AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana Crime: కోరిక కాదన్నందుకు తీవ్రంగా కొట్టి.. స్పృహ తప్పినా వదలకుండా

వికారాబాద్ (Vikarabad) బాలిక మర్డర్‌ మిస్టరీ వీడిపోయింది. తనకేమీ తెలియదని అబద్ధాలాడిన ప్రియుడే హంతకుడని తేలింది. మాట్లాడుకుందామని పిలిచి మహేందర్ అనే వ్యక్తి బాలికను హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. బాలికపై అత్యాచారం....

Telangana Crime: కోరిక కాదన్నందుకు తీవ్రంగా కొట్టి.. స్పృహ తప్పినా వదలకుండా
Murder
Ganesh Mudavath
|

Updated on: Mar 30, 2022 | 3:38 PM

Share

వికారాబాద్ (Vikarabad) బాలిక మర్డర్‌ మిస్టరీ వీడిపోయింది. తనకేమీ తెలియదని అబద్ధాలాడిన ప్రియుడే హంతకుడని తేలింది. మాట్లాడుకుందామని పిలిచి మహేందర్ అనే వ్యక్తి బాలికను హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. బాలికపై అత్యాచారం (Rape) చేసేందుకు ప్రయత్నించడంతో ఆమె ఒప్పుకోలేదు. అతని నుంచి తప్పించుకునేందుకు తీవ్రంగా ప్రతిఘటించింది. ఇద్దరి మధ్య తీవ్ర పెనుగులాట జరిగింది. స్పృహ తప్పిపడిపోయిన బాలికపై మహేందర్ అత్యాచారం చేశాడు. ఆ తర్వాత బండరాయితో కొట్టి హత్య (Murder) చేశాడు. పూడూరు మండలం అంగడిచిట్టంపల్లిలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న బాలికకు మహేందర్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం ప్రేమకు దారి తీసింది. ఇద్దరూ ఫోన్‌లో మాట్లాడుకునే వారు. ఈ విషయం అమ్మాయి ఇంట్లో తెలిసింది. వద్దని వారించారు. విషయం తెలుసుకున్న మహేందర్.. స్నేహితులతో కలిసి మద్యం సేవించాడు. అనంతరం మద్యం మత్తులో బాలికకు ఫోన్ చేసి బయటికి రమ్మని చెప్పాడు.

అతని మాటలు నమ్మి, వచ్చిన బాలికను మహేందర్ ఊరి చివర నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు. దీనికి బాలిక నిరాకరించడంతో ఇరువురి మధ్య ఘర్షణ ఏర్పడింది. మద్యం మత్తులో ఉన్న ప్రియుడు మహేందర్ తీవ్ర ఆగ్రహానికి లోనై బాలికను బలంగా నెట్టాడు. ఈ ఘటనలో బాలిక తల చెట్టుకు తగిలి స్పృహతప్పిపోయింది. అయినా మహేందర్ ఆగకుండా మూర్చపోయిన బాలికపై అత్యాచారం చేశాడు. అనంతరం బాలిక శరీరంలో చలనం లేకపోవడంతో భయపడ్డాడు. విషయం యటపడుతుందేమోనని గ్రహించి అక్కడి నుంచి మెల్లగా జారుకున్నాడు. హత్య విషయం తెలుసుకున్న బాలిక కుటుంబసభ్యులు ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ కేసులో ప్రియుడు మహేందర్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా.. అతనే బాలికను హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. దీంతో నిందితుడు మహేందర్‌ను అరెస్టు చేశారు. అనంతరం కోర్టులో హాజరు పరుస్తామని ఎస్పీ వెల్లడించారు. తల్లిదండ్రులు ఎప్పటికప్పడు పిల్లలపై నిఘా పెట్టాలని, ఇటువంటి సంఘటనలు జరగకుండా తల్లిదండ్రులు పిల్లలను అనునిత్యం పర్యవేక్షించడమే కాకుండా వారికి తోడుగా ఉండాలంటూ ఎస్పీ ప్రజలను కోరారు.

Also Read

Coral Reefs: మనుషుల శవాలతో సముద్రం అడుగున పగడపు దిబ్బల ఏర్పాటు.. కాన్సెప్ట్ సూపర్ అంటున్న నెటిజన్లు

వేసవిలో చెరుకు రసంతో బోలెడు ప్రయోజనాలు.. అవేంటంటే..

Viral Photo: ఈ ఫోటోలో పామును కనిపెడితే మీరే జీనియస్.. ఈజీగా కనిపెట్టొచ్చండోయ్.!