Banswada Election Result: స్పీకర్ సెంటిమెంట్ బ్రేక్ చేసిన పోచారం.. బంపర్ మెజార్టీతో విజయం
స్పీకర్ సెంటిమెంట్ తెలుగు రాష్ట్రాల్లో స్ట్రాంగ్‌గా ఉందన్న విషయం తెలిసిందే. 1991 నుంచి పోటీ చేసిన స్పీకర్లలో ఒక్కరంటే ఒక్కరు కూడా గెలిచింది లేదు. ఏ ఎన్నికల్లోనైనా స్పీకర్‌గా పోటీ చేసిన వారికి ఓటమి తప్పదనే ప్రచారం ఉంది. తెలుగు రాష్ట్రాల్లో స్పీకర్‌గా పని చేసిన ఎవరూ మళ్లీ అసెంబ్లీ గడప తొక్కలేదు.
స్పీకర్ సెంటిమెంట్ తెలుగు రాష్ట్రాల్లో స్ట్రాంగ్‌గా ఉందన్న విషయం తెలిసిందే. 1991 నుంచి పోటీ చేసిన స్పీకర్లలో ఒక్కరంటే ఒక్కరు కూడా గెలిచింది లేదు. ఏ ఎన్నికల్లోనైనా స్పీకర్‌గా పోటీ చేసిన వారికి ఓటమి తప్పదనే ప్రచారం ఉంది. తెలుగు రాష్ట్రాల్లో స్పీకర్‌గా పని చేసిన ఎవరూ మళ్లీ అసెంబ్లీ గడప తొక్కలేదు. ఉమ్మడి ఏపీతో పాటు తెలంగాణ తొలి స్పీకర్ మధుసూదన చారికి కూడా సేమ్ సెంటిమెంట్ రిపీట్ అయింది. ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాద్ సైతం గత ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు.
దీంతో పోచారం ప్యూచర్ ఏంటన్న చర్చ జిల్లాలో జోరుగా సాగింది. అయితే ఈసారి ఎన్నికల్లో అనూహ్య రీతిలో సెంటిమెంట్ బ్రేక్ అయింది. రాష్ట్రవ్యాప్తంగా బీఆర్‌ఎస్‌కు వ్యతిరేక పవనాలు వీచినా.. లక్ష్మీపుత్రుడికి లక్కు కలిసొచ్చింది. బాన్సువాడ నియోజకవర్గ BRS పార్టీ అభ్యర్థి పోచారం శ్రీనివాసరెడ్డి 23,582 ఓట్లతో విజయం సాధించారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల లైవ్ కవరేజ్ :