AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi: అవినీతి పెరిగింది.. అభివృద్ధికి సహకరించడం లేదు.. కేసీఆర్ ప్రభుత్వంపై ప్రధాని మోడీ ఫైర్..

తెలంగాణ ప్రభుత్వంపై ప్రధాని మోడీ విమర్శలు గుప్పించారు. తెలంగాణలో కేంద్రం చేపడుతున్న అనేక ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం అందడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు ప్రధాని మోదీ. దీనివల్ల ప్రాజెక్టుల పనులు ఆలస్యం అవుతున్నాయని.. దీనివల్ల ప్రజలకు ఎంతో నష్టం జరుగుతుందని మోదీ చెప్పారు.

PM Modi: అవినీతి పెరిగింది.. అభివృద్ధికి సహకరించడం లేదు.. కేసీఆర్ ప్రభుత్వంపై ప్రధాని మోడీ ఫైర్..
Pm Modi
Shaik Madar Saheb
|

Updated on: Apr 08, 2023 | 1:42 PM

Share

తెలంగాణ ప్రభుత్వంపై ప్రధాని మోడీ విమర్శలు గుప్పించారు. తెలంగాణలో కేంద్రం చేపడుతున్న అనేక ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం అందడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు ప్రధాని మోదీ. దీనివల్ల ప్రాజెక్టుల పనులు ఆలస్యం అవుతున్నాయని.. దీనివల్ల ప్రజలకు ఎంతో నష్టం జరుగుతుందని మోదీ చెప్పారు. అభివృద్ధి పనులకు ఆటంకం కలిగించొద్దని ఆయన అన్నారు. రాష్ట్రంలో కుటుంబం పాలన అవినీతిని పెంచిపోషిస్తుందన్నారు. సొంత కుటుంబం ఎదిగితే చాలనుకుంటారు.. అన్ని విషయాల్లో వారికి కుటుంబ స్వార్థమే కావాలంటూ ఫైర్ అయ్యారు. ఇలాంటివారితో తెలంగాణ ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు. వారసత్వ రాజకీయంతో అవినీతిని పెంచి పోషిస్తున్నారు.. అవినీతిపరులపై చట్టప్రకారం చర్యలు చేపట్టాలా వద్దా? అంటూ ప్రజలను కోరారు. నాపై పోరాటానికి అన్ని శక్తులు ఏకమయ్యాయి.. కోర్టుకు వెళ్లారు, అక్కడా వారికి షాక్‌ తగిలిందంటూ విమర్వించారు.

తెలంగాణ ఏర్పడినప్పుడే కేంద్రంలో NDA ప్రభుత్వం కూడా వచ్చిందన్నారు ప్రధాని మోదీ. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే బాధ్యతను కేంద్రం తీసుకుందన్నారు ప్రధాని.

కేంద్రం చేపడుతున్న అభివృద్ధి పనులపై కొందరు వ్యక్తులు భయాందోళనలు చెందుతున్నారని విపక్ష పార్టీలపై విమర్శనాస్త్రాలు సంధించారు ప్రధాని మోదీ. వారసత్వ రాజకీయాలు.. అవినీతే వారికి ప్రాధాన్యమని ఎద్దేవా చేశారు ప్రధాని. ఇలాంటి వారికి దేశాభివృద్ధి పట్టదని.. స్వార్థపూరిత ఆలోచనలోనే మునిగి తేలుతుంటారని విమర్శించారు మోదీ. ఇలాంటి వారితో నిత్యం అప్రమత్తంగా ఉండాలన్నారు ప్రధాని.

ఇవి కూడా చదవండి

దేశాన్ని అవినీతి పరుల నుంచి విముక్తం చేయాలా వద్దా అని సభకు హాజరైన ప్రజలను ప్రశ్నించారు ప్రధాని మోదీ. అవినీతి లీడర్లను ఉపేక్షించబోమని స్పష్టంచేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..