PM Narendra Modi: ప్రధాని మోడీ నోట.. భాగ్యలక్ష్మి అమ్మవారి మాట..
తెలంగాణ పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ తన ప్రసంగంలో.. భాగ్యలక్ష్మి అమ్మవారి గురించి ప్రస్తావింాచరు. వందే భారత్ రైలుతో భాగ్యలక్ష్మి నగరాన్ని శ్రీ వెంకటేశ్వరస్వామి నగరాన్ని కలిపామని ప్రధాని మోడీ పేర్కొన్నారు.
తెలంగాణ పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ తన ప్రసంగంలో.. భాగ్యలక్ష్మి అమ్మవారి గురించి ప్రస్తావింాచరు. వందే భారత్ రైలుతో భాగ్యలక్ష్మి నగరాన్ని శ్రీ వెంకటేశ్వరస్వామి నగరాన్ని కలిపామని ప్రధాని మోడీ పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి తెలంగాణను అభివృద్ధి చేసే అవకాశం తనకు దక్కిందని మోడీ తెలిపారు. పరేడ్ గ్రౌండ్స్ లో ప్రధాని మోదీ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునరుద్ధరణ పనులకు శంకుస్థాపన చేశారు. అలాగే మహబూబ్ నగర్-సికింద్రాబాద్ డబ్లింగ్ లైన్ ను జాతికి అంకితం చేశారు. అనంతరం ప్రధాని మోడీ మాట్లాడుతూ.. తెలంగాణలో ఎన్నో అభివృద్ది పథకాలను ప్రారంభించినట్లు వివరించారు. తెలంగాణకు అన్ని విధాలుగా అండగా ఉన్నామని.. కానీ రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదంటూ పేర్కొన్నారు. 11 వేల కోట్లతో అభివృద్ధి కార్యాక్రమాలను ప్రారంభించామని తెలిపారు. తెలంగాణలో కుటుంబ పాలనకు వ్యతిరేకంగా.. అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమించాలని సూచించారు. తనపై పోరాడటానికి అన్ని శక్తులు ఏకమయ్యాయని మోడబీ పేర్కొన్నారు. కొందరు అభివృద్ధిని అడ్డుకుంటున్నారని.. ప్రజల ఆకాంక్షలు నేరవేర్చడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.
అవినీతిపరులపై చర్యలు తప్పవని మోడీ స్పష్టంచేశారు. కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వం కలిసిరావడం లేదని.. తెలంగాణలో కుటుంబ పాలనతో అవినీతి పెరిగిందని మోడీ పేర్కొన్నారు. అవినీతిపై పోరాడాటానికి ప్రజల సహకారం కావాలన్నారు.