ఆల్‌టైమ్‌ గరిష్ట రికార్డును క్రాస్ చేసిన పెట్రోల్ ధరలు.. ముంబై తర్వాత స్థానానికి చేరిన హైదరాబాద్..

పెట్రోల్, డీజిల్‌ ధరలు సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. రోజు రోజుకు పెరుగుతున్న ధరల ప్రభావం ముందుగా హైదరాబాద్‌పై పడుతోంది. సైలెంట్‌ బాదుడుతో మునుపెన్నడూ లేనంతగా ఎత్తుకు ధరలు చేరుకుటున్నాయి.

  • Sanjay Kasula
  • Publish Date - 7:55 am, Mon, 25 January 21
ఆల్‌టైమ్‌ గరిష్ట రికార్డును క్రాస్ చేసిన పెట్రోల్ ధరలు.. ముంబై తర్వాత స్థానానికి చేరిన హైదరాబాద్..

Petrol-diesel prices : పెట్రోల్, డీజిల్‌ ధరలు సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. రోజు రోజుకు పెరుగుతున్న ధరల ప్రభావం ముందుగా హైదరాబాద్‌పై పడుతోంది. సైలెంట్‌ బాదుడుతో మునుపెన్నడూ లేనంతగా ఎత్తుకు ధరలు చేరుకుటున్నాయి. దేశంలోనే డీజిల్‌ ధర హైదరాబాద్‌లో అత్యధికం కాగా, పెట్రోల్‌ ధరలో ముంబై తర్వాత స్థానానికి చేరింది.

రెండేళ్ల క్రితం నాటి పెట్రోల్, డీజిల్‌ ధర ఆల్‌టైమ్‌ రికార్డును సైతం అధిగమించింది. దీంతో హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.89.15, డీజిల్‌ రూ.82.80కు చేరింది. విదేశీ మారక ద్రవ్యం రేట్లు, అంతర్జాతీయ బెంచ్‌మార్క్‌ ధర ఆధారంగా ప్రభుత్వ రంగ చమురు సంస్థలు ఈ నెలలో రోజువారీ ధరల సవరణలో భాగంగా లీటర్‌ పెట్రోల్‌పై రూ. 2.10, డీజిల్‌పై 2.20 బాదేశాయి. పెట్రో ఉత్పత్తుల ధరల రోజువారీ సవరణ ప్రక్రియ అనంతరం తొలిసారిగా రికార్డు స్థాయిలో ధరలు ఎగబాకుతున్నాయి.

పెట్రో ధరలు ఆల్‌టైమ్‌ గరిష్ట రికార్డును అధిగమించాయి. రెండేళ్ల క్రితం 2018, అక్టోబర్‌ 4న లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.89.11తో ఇప్పటివరకు ఆల్‌టైమ్‌ రికార్డుగా నమోదైంది. దానికంటే ఐదేళ్ల క్రితం 2013, సెప్టెంబర్‌ నెలలో పెట్రోల్‌ లీటర్‌ ధర రూ. 83.07తో ఆల్‌టైమ్‌ రికార్డు సృష్టించింది. ఇక డీజిల్‌ 2018, అక్టోబర్‌ 18న లీటర్‌ ధర రూ.82.38తో ఆల్‌టైమ్‌ రికార్డును నమోదు చేసుకోగా ప్రస్తుతం గరిష్టానికి చేరిన ధరతో పాత రికార్డును అధిగమించినట్లయింది.

ఇది కూడా చదవండి :

ఏపీలో లోకల్‌ ఎలక్షన్‌ పంచాయితీ.. నేడు సుప్రీంకోర్టులో కీలక వాదనలు..అందరిలో ఇదే ఉత్కంఠ