రైల్వే ప్రయాణీకులకు గుడ్ న్యూస్.. పట్టాలెక్కనున్న కృష్ణా ఎక్స్‌ప్రెస్.. ఎప్పటి నుంచంటే.?

Krishna Express Train: కరోనా వైరస్, లాక్‌డౌన్ కారణంగా రద్దైన రైళ్లు తిరిగి ఇప్పుడిప్పుడే ప్రారంభమవుతున్నాయి. ఒక్కొక్కటిగా రద్దు చేయబడిన...

  • Ravi Kiran
  • Publish Date - 9:07 am, Mon, 25 January 21
రైల్వే ప్రయాణీకులకు గుడ్ న్యూస్.. పట్టాలెక్కనున్న కృష్ణా ఎక్స్‌ప్రెస్.. ఎప్పటి నుంచంటే.?

Krishna Express Train: కరోనా వైరస్, లాక్‌డౌన్ కారణంగా రద్దైన రైళ్లు తిరిగి ఇప్పుడిప్పుడే ప్రారంభమవుతున్నాయి. ఒక్కొక్కటిగా రద్దు చేయబడిన ట్రైన్స్‌ను రైల్వేశాఖ పట్టాలెక్కిస్తోంది. ఈ నేపధ్యంలోనే తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఓ తీపికబురు అందించింది. తిరుపతి- ఆదిలాబాద్ మధ్య నడిచే కృష్ణా ఎక్స్‌ప్రెస్ ఈ నెల 27వ తేదీ నుంచి పట్టాలెక్కనున్నట్లు స్పష్టం చేసింది. సుమారు 10 నెలల తర్వాత ప్రయాణీకులకు అందుబాటులోకి రానున్న ఈ రైలు మొత్తం 59 స్టేషన్లలో ఆగుతుంది.

ఈ రైలు ప్రతీ రోజూ ఉదయం 5.50 గంటలకు తిరుపతి నుంచి బయల్దేరి మల్కాజిగిరి రాత్రి 9 గంటలకు.. ఆదిలాబాద్ మరుసటి రోజు ఉదయం 6.15 గంటలకు చేరుకుంటుంది. అలాగే తిరుగు ప్రయాణంలో ఆదిలాబాద్ నుంచి రాత్రి 9.05 గంటలకు బయల్దేరి.. మల్కాజిగిరికి మరుసటి రోజు ఉదయం 5.15 గంటలకు.. అదే రోజు రాత్రి 9.35 గంటలకు తిరుపతి చేరుతుంది.

కాగా, సికింద్రాబాద్‌-మణుగూరు-సికింద్రాబాద్‌ (నెం.02745/02746), కాచిగూడ-యల్హంక-కాచిగూడ (నెం.07603/07604), గుంటూరు-రాయగడ-గుంటూరు (నెం.07244/07243), కాకినాడపోర్టు-తిరుపతి-కాకినాడపోర్టు (నెం.07249/07250) రైళ్లను సైతం రైల్వే శాఖ 27,28,29 నుంచి ప్రయాణీకులకు అందుబాటులోకి తీసుకురానుంది.