
Gaddar passed away: ప్రజా యుద్ధనౌక, ప్రజాగాయకుడు గద్దర్ కన్నుమూశారు. అనారోగ్యంతో అపోలో ఆసుపత్రిలో చేరిన గద్దర్.. చికిత్స పొందుతూ ఆదివారం తుదిశ్వాస విడిచారు. గద్దర్.. తెలంగాణలోనే కాదు తెలుగు ప్రజలకు ఆయన తెలియని వారంటూ లేరు. తన మాటనే పాటగా మలిచిన గొప్ప కళాకారుడు గద్దర్. తెలంగాణ ఉద్యమంలో తన పాట ద్వారా ఎంతోమంది ఉద్యమనికి ఊపిరి పోసిన ఘనత ఆయన సొంతం. తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని ఆయన పాటలతో ఎంతోమందికి స్ఫూర్తి నింపారు. ఈ మధ్యనే గుండె ఆపరేషన్ చేయించుకున్నారు గద్దర్.. ఈ క్రమంలో అనారోగ్యంతో అపోలో ఆస్పత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ మృతి చెందారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..