Telangana: రాజాసింగ్ కు పీడీ యాక్టు అడ్వైజరీ బోర్డులో లభించని ఊరట.. హైకోర్టును ఆశ్రయిస్తామన్న న్యాయవాది..

గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ కు పీడీ యాక్టును అడ్వైజరీ బోర్డులో ఊరట లభించలేదు. రాజాసింగ్ పై పోలీసులు పీడీ యాక్టు నమోదు చేయడాన్ని పీడీ యాక్ట్‌ అడ్వైజరీ బోర్డు సమర్థించింది. అక్రమంగా నమోదు చేసిన పీడీ యాక్టును తొలగించాలని ఎమ్మెల్యే రాజాసింగ్‌ భార్య చేసిన అభ్యర్థనను పీడీ యాక్ట్‌..

Telangana: రాజాసింగ్ కు పీడీ యాక్టు అడ్వైజరీ బోర్డులో లభించని ఊరట.. హైకోర్టును ఆశ్రయిస్తామన్న న్యాయవాది..
Mla Raja Singh (File Photo)
Follow us

|

Updated on: Oct 26, 2022 | 6:54 PM

గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ కు పీడీ యాక్టును అడ్వైజరీ బోర్డులో ఊరట లభించలేదు. రాజాసింగ్ పై పోలీసులు పీడీ యాక్టు నమోదు చేయడాన్ని పీడీ యాక్ట్‌ అడ్వైజరీ బోర్డు సమర్థించింది. అక్రమంగా నమోదు చేసిన పీడీ యాక్టును తొలగించాలని ఎమ్మెల్యే రాజాసింగ్‌ భార్య చేసిన అభ్యర్థనను పీడీ యాక్ట్‌ అడ్వైజరీ బోర్డు తిరస్కరించింది. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారణకు హాజరైన ఎమ్మెల్యే.. తనపై కక్షపూరితంగా పీడీ యాక్టు కేసు నమోదు చేశారని తెలిపారు. ఒక రాజకీయ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా ఉన్నందున కక్షతో పీడీ యాక్టు ప్రయోగించారని ఆరోపించారు. ఈ ఆరోపణలను పోలీసులు తోసిపుచ్చారు.  రాజాసింగ్‌ విద్వేషపూరిత ప్రసంగాలు చేయడం, కొన్ని వర్గాల మధ్య చిచ్చురేపే విధంగా వ్యహరించడం వల్లే పీడీ యాక్టు ప్రయోగించామని పోలీసులు వివరించారు. గతంలో అతనిపై వివిధ పోలీసు స్టేషన్లలో నమోదైన కేసుల వివరాలను బోర్డు ముందుంచారు. ఇరువర్గాల వాదనలు విన్న అడ్వైజరీ బోర్డు, పీడీ యాక్టును కక్షపూరితంగా ప్రయోగించారనడానికి ఎలాంటి ఆధారాలు లేవని అభిప్రాయపడింది. పోలీసులు పీడీ యాక్టు నమోదు చేయడాన్ని సమర్థించింది. దీనిపై రాజాసింగ్‌ తరఫు న్యాయవాది హైకోర్టును ఆశ్రయించనున్నట్టు సమాచారం.

సెప్టెంబర్ 29న విచారించిన పిడి యాక్ట్ అడ్వైజరీ కమిటీ

గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పై పిడి యాక్ట్ పెట్టడం అన్యాయమని, దానిని తొలగించాలని కోరుతూ రాజాసింగ్ భార్య భార్య ఉష భాయ్ పిడి యాక్ట్ అడ్వైజరీ కమిటీని అభ్యర్థించారు. దీంతో ఈఏడాది సెప్టెంబర్ 29వ తేదీన పిడి యాక్ట్ అడ్వైజరీ కమిటీ విచారణ జరిపిన విషయం తెలిసిందే. ఈకమిటీ ముందు రాజాసింగ్ న్యాయవాది కరుణ సాగర్, రాజాసింగ్ భార్య ఉష భాయ్ హాజరయ్యారు. రాజాసింగ్ వీడియో కార్ఫరెన్స్ ద్వారా జైలు నుంచి హాజరయ్యారు. ఎమ్మెల్యే రాజాసింగ్ పై నమోదైన పిడి యాక్ట్ పై పిడి యాక్ట్ బోర్డ్ ఛైర్మన్ జస్టిస్ భాస్కరరావు నేతృత్వంలో విచారణ జరిగింది. ఆ సందర్భంగా రాజాసింగ్ భార్య ఉష భాయ్.. తన భర్తపై అక్రమంగా పిడి యాక్ట్ నమోదుచేశారని కమిటీ ముందు తెలియజేశారు. ఒక వర్గాన్ని సంతృప్తి పరచడానికి తన భర్త పైన పీడి యాక్ట్ పెట్టారని అప్పుడు ఆమె కమిటీకి తెలిపారు. కక్ష సాధింపులో భాగంగా లా అండ్ ఆర్డర్ (శాంతి భద్రతలు) సాకుగా చూపి పీడి యాక్ట్ నమోదు చేశారని కమిటీ ముందు రాజాసింగ్ భార్య చెప్పిన విషయం విదితమే. పీడీ యాక్ట్ ఎత్తివేయాలని అడ్వైజర్ కమిటీని ఆమె కోరారు. రాజసింగ్ కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరై తన వాదనలు వినిపించిన విషయం తెలిసిందే.

ఇలా ఉండగా మహ్మద్ ప్రవక్తపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ రాజాసింగ్ పై అభియోగాలు నమోదైన విషయం తెలిసిందే. తాను వీడియోలో ఎక్కడా మహ్మద్ ప్రవక్త పేరును ప్రస్తావించలేదని, తాను మహ్మద్ ప్రవక్త గురించి మాట్లాడినట్లు కొందరు ఆరోపిస్తున్నారంటూ మరో వీడియోను అరెస్ట్ ముందు రాజాసింగ్ విడుదల చేసిన విషయం తెలిసిందే. కాగా పిడి యాక్ట్ పై అరెస్టు అయిన రాజాసింగ్ ప్రస్తుతం చర్లపల్లి జైల్లో ఉన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం చూడండి..

మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో