Telangana: వారిని సంతృప్తి పర్చడం కోసమే నా భర్తపై పిడి యాక్ట్.. రాజాసింగ్ భార్య సంచలన వ్యాఖ్యలు..

గోషామహల్ ఎమ్మెల్యే, బీజేపీ బహిష్కృత నేత రాజాసింగ్ పై పిడి యాక్ట్ పెట్టడంపై ఆయన భార్య ఉష భాయ్ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈరోజు పిడి యాక్ట్ అడ్వైజరీ కమిటీ విచారణ జరిగింది. ఈకమిటీ ముందు రాజాసింగ్ న్యాయవాది..

Telangana: వారిని సంతృప్తి పర్చడం కోసమే నా భర్తపై పిడి యాక్ట్.. రాజాసింగ్ భార్య సంచలన వ్యాఖ్యలు..
Mla Raja Singh (File Photo)
Follow us
Amarnadh Daneti

|

Updated on: Sep 29, 2022 | 8:37 PM

గోషామహల్ ఎమ్మెల్యే, బీజేపీ బహిష్కృత నేత రాజాసింగ్ పై పిడి యాక్ట్ పెట్టడంపై ఆయన భార్య ఉష భాయ్ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈరోజు పిడి యాక్ట్ అడ్వైజరీ కమిటీ విచారణ జరిగింది. ఈకమిటీ ముందు రాజాసింగ్ న్యాయవాది కరుణ సాగర్, రాజాసింగ్ భార్య ఉష భాయ్ హాజరయ్యారు. ఎమ్మెల్యే రాజాసింగ్ పై నమోదైన పిడి యాక్ట్ పై పిడి యాక్ట్ బోర్డ్ ఛైర్మన్ జస్టిస్ భాస్కరరావు నేతృత్వంలో విచారణ జరిగింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాజాసింగ్ కూడా ఈ కమిటీ ముందు హాజరయ్యారు. ఈసందర్భంగా రాజాసింగ్ భార్య ఉష భాయ్.. తన భర్తపై అక్రమంగా పిడి యాక్ట్ నమోదుచేశారని కమిటీ ముందు వాపోయింది. ఒక వర్గాన్ని సంతృప్తి పరచడానికి తన భర్త పైన పీడి యాక్ట్ పెట్టారని తెలిపారు. కక్ష సాధింపులో భాగంగా లా అండ్ ఆర్డర్ (శాంతి భద్రతలు) సాకుగా చూపి పీడి యాక్ట్ నమోదు చేశారని కమిటీ ముందు రాజాసింగ్ భార్య తెలిపింది.

పీడీ యాక్ట్ ఎత్తివేయాలని అడ్వైజర్ కమిటీని కోరామని ఆమె తెలిపింది. రాజసింగ్ కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరై తన వాదనలు వినిపించారు. అడ్వైజర్ కమిటీ ఆదేశాలను హైకోర్టు ముందు ఉంచుతామన్నారు. హైకోర్టులో ఇప్పటికే రీవోక్ పిటిషన్ దాఖలు చేశామని, అడ్వైజరి కమిటీ తీర్పు తమకు వ్యతిరేకంగా వస్తే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తామని ఉష భాయ్ తెలిపారు. పోలీసులు చెప్తున్న వాదనలో వాస్తవం లేదని అడ్వైజర్ కమీటీకి తెలియజేశారు రాజాసింగ్ సతీమణి.

ఇలా ఉండగా మహ్మద్ ప్రవక్తపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ రాజాసింగ్ పై అభియోగాలు నమోదైన విషయం తెలిసిందే. తాను వీడియోలో ఎక్కడా మహ్మద్ ప్రవక్త పేరును ప్రస్తావించలేదని, తాను మహ్మద్ ప్రవక్త గురించి మాట్లాడినట్లు కొందరు ఆరోపిస్తున్నారంటూ మరో వీడియోను అరెస్ట్ ముందు రాజాసింగ్ విడుదల చేసిన విషయం తెలిసిందే. కాగా పిడి యాక్ట్ పై అరెస్టు అయిన రాజాసింగ్ ప్రస్తుతం చర్లపల్లి జైల్లో ఉన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం చూడండి..