T20 WORLD CUP: స్టోయినిస్ ఫైరింగ్ నాక్.. టీ20 ప్రపంచకప్ లో శ్రీలంకపై సునాయసంగా గెలుపొందిన ఆస్ట్రేలియా..

శ్రీలంక బ్యాట్స్ మెన్ చరిత్ అసలంక 25 బంతుల్లో 38 పరుగులు చేయడంతో శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. శ్రీలంక బ్యాట్స్ మెన్ పాతుమ్ నిస్సాంక 40 పరుగులు చేయడంతో శ్రీలంక గౌరవప్రదమైన స్కోర్ చేయగలిగింది. ఆస్ట్రేలియా బౌలర్లు జోష్ హేజిల్‌వుడ్, మిచెల్ స్టార్క్, అష్టన్ అగర్..

T20 WORLD CUP: స్టోయినిస్ ఫైరింగ్ నాక్.. టీ20 ప్రపంచకప్ లో శ్రీలంకపై సునాయసంగా గెలుపొందిన ఆస్ట్రేలియా..
Marcus Stoinis, Australian Cricketer
Follow us

|

Updated on: Oct 25, 2022 | 8:48 PM

టీ20 ప్రపంచకప్ సూపర్ 12లో జరిగిన ప్రారంభమ్యాచ్ లో న్యూజిలాండ్ పై ఓటమిని చూసిన అతిథ్య ఆస్ట్రేలియా జట్టు అక్టోబర్ 25వ తేదీ మంగళవారం జరిగిన మరో సూపర్ 12 మ్యాచ్ లో శ్రీలంకపై ఘన విజయం సాధించింది. సూపర్-12 గ్రూప్ 1లో ఆస్ట్రేలియా తన రెండవ మ్యాచ్ లో శ్రీలంకతో తలపడింది. మార్కస్ స్టోయినిస్ యొక్క ఫైరింగ్ నాక్ తో ఆసీస్ శ్రీలంకపై సునాయశంగా గెలిచింది. మార్కస్ స్టోయినిస్ కేవలం 18 బంతుల్లో 59 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఆస్ట్రేలియా వేదికగా పెర్త్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా జట్టు 7 వికెట్ల తేడాతో శ్రీలకంపై గెలిచింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 6వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. 158 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ జట్టు నిలకడగా ఆడుతూ.. 16.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించింది. జట్టు స్కోర్ 26 పరుగుల వద్ద డేవిడ్ వార్నర్‌ను మహేశ్ తీక్షణ ఔట్ చేశాడు. తర్వాత వచ్చిన మిచెల్ మార్ష్ 18 పరుగులు, గ్లెన్ మాక్స్‌వెల్ 23 పరుగులు చేసి పెవిలియన్ చేరారు. ఓపెనర్ ఫించ్, స్టోయినిస్ వేగంగా ఆడుతూ 3.3 ఓవర్లు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేధించారు.

అంతకుముందు శ్రీలంక బ్యాట్స్ మెన్ చరిత్ అసలంక 25 బంతుల్లో 38 పరుగులు చేయడంతో శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. శ్రీలంక బ్యాట్స్ మెన్ పాతుమ్ నిస్సాంక 40 పరుగులు చేయడంతో శ్రీలంక గౌరవప్రదమైన స్కోర్ చేయగలిగింది. ఆస్ట్రేలియా బౌలర్లు జోష్ హేజిల్‌వుడ్, మిచెల్ స్టార్క్, అష్టన్ అగర్, గ్లెన్ మాక్స్‌వెల్, పాట్ కమిన్స్ ఒక్కో వికెట్ తీశారు. శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.

ఇవి కూడా చదవండి

మొదటి మ్యాచ్ లో న్యూజిలాండ్ ఓడిపోయిన ఆస్ట్రేలియా శ్రీలంకపై గెలుపుతో టీ20 ప్రపంచకప్ లో తన విజయాల ఖాతాను తెరిచింది. శ్రీలంక ఐర్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో గెలవడంతో ఇప్పటివరకు రెండు మ్యాచ్ లు ఆడిన శ్రీలంక కూడా ఒక మ్యాచ్ గెలిచినట్లైంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం చూడండి..