T20 WC 2022: విన్నింగ్ కాంబినేషన్‌లో కీలక మార్పు.. రెండో మ్యాచ్‌లో ఎంట్రీ ఇవ్వనున్న టీమిండియా స్టార్ ప్లేయర్?

Team India Playing XI Against Netherlands: 2022 టీ20 ప్రపంచకప్‌లో తమ తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను ఓడించిన రోహిత్ సేన ప్రస్తుతం అక్టోబర్ 27న నెదర్లాండ్స్‌తో తలపడేందుకు సిద్ధమైంది.

T20 WC 2022: విన్నింగ్ కాంబినేషన్‌లో కీలక మార్పు.. రెండో మ్యాచ్‌లో ఎంట్రీ ఇవ్వనున్న టీమిండియా స్టార్ ప్లేయర్?
Ind Vs Ned Playing 11
Follow us

|

Updated on: Oct 25, 2022 | 6:22 PM

2022 టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా శుభారంభం చేసింది. భారత జట్టు తన తొలి మ్యాచ్‌లోనే పాకిస్థాన్‌ను ఓడించింది. ఇక రెండో మ్యాచ్‌లో టీమిండియా అక్టోబర్ 27న నెదర్లాండ్స్‌తో తలపడేందుకు సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లో టీమ్ ఇండియా ప్లేయింగ్ ఎలెవన్‌లో మార్పులు చేయనున్నట్లు తెలుస్తోంది. దీంతో ప్లేయింగ్‌ XIలో ఎవరు రానున్నారు, ఎవరు బయటకు వెళ్లనున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..

పాక్‌పై విన్నింగ్ కాంబినేషన్‌లో కీలక మార్పులు..

టీ20 ప్రపంచకప్‌లో టీమ్ ఇండియా తన తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను ఓడించినప్పటికీ, నెదర్లాండ్స్‌పై టీమిండియా తన ప్లేయింగ్ ఎలెవన్‌ను మార్చగలదని భావిస్తున్నారు.

జట్టులోకి యుజ్వేంద్ర చాహల్..

భారత జట్టు ఒక మార్పుతో నెదర్లాండ్స్‌తో బరిలోకి దిగనుందని తెలుస్తోంది. ఆఫ్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ స్థానంలో సీనియర్‌ లెగ్‌ స్పిన్నర్‌ యుజ్వేంద్ర చాహల్‌ నెదర్లాండ్స్‌తో జరిగే చివరి ఎలెవన్‌లో చోటు దక్కించుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

ఈ ఆటగాళ్లపైనే దృష్టి..

భారత్‌తో జరిగే మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌కు చెందిన పలువురు ఆటగాళ్ల ప్రదర్శనపైనే అందరి దృష్టి ఉంటుంది. ఇందులో మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ కోలిన్ అకెర్‌మాన్, ఓపెనర్ విక్రమ్‌జిత్ సింగ్, కెప్టెన్ కం వికెట్ కం కీపర్ బ్యాట్స్‌మెన్ స్కాట్ ఎడ్వర్డ్స్, ఆల్ రౌండర్ రీలోఫ్ వాన్ డెర్ మెర్వే చక్కని ఆటతో ఆకట్టుకుంటున్నారు.

నెదర్లాండ్స్‌పై టీమిండియా ప్రాబబుల్ ప్లేయింగ్ XI – రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్ (కీపర్), అక్షర్ పటేల్, యుజువేంద్ర చాహల్, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ షమీ, భువనేశ్వర్ కుమార్.

తొలి మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం..

టీమిండియా తన తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను 4 వికెట్ల తేడాతో ఓడించింది. తొలుత ఆడిన పాకిస్థాన్ జట్టు భారత్ ముందు 160 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. చివరి బంతికి రోహిత్ సేన విజయం సాధించింది. విరాట్ కోహ్లీ భారత్ తరపున 82 పరుగులతో మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో రోహిత్ సేన టీ20 ప్రపంచ కప్‌ 2022లో తొలి ప్రయాణం విజయంతో మొదలుపెట్టింది.

Latest Articles
పెట్రోల్ పోసి తగులబెట్టారు.. పోలీసుల దర్యాప్తులో సంచలనం!
పెట్రోల్ పోసి తగులబెట్టారు.. పోలీసుల దర్యాప్తులో సంచలనం!
బెంగళూరు గెలిస్తే వాళ్లకు డేంజర్ బెల్స్ మోగినట్లే..
బెంగళూరు గెలిస్తే వాళ్లకు డేంజర్ బెల్స్ మోగినట్లే..
మళ్లీ సెట్స్‌పైకి వచ్చేసిన నటసింహం.. బాలయ్య 109 మూవీ విశేషాలు ఇవే
మళ్లీ సెట్స్‌పైకి వచ్చేసిన నటసింహం.. బాలయ్య 109 మూవీ విశేషాలు ఇవే
ఈ అలవాట్లు ఉంటే.. 50యేళ్లకు వచ్చే హైబీపీ 20యేళ్లకే తిష్టవేస్తుంది
ఈ అలవాట్లు ఉంటే.. 50యేళ్లకు వచ్చే హైబీపీ 20యేళ్లకే తిష్టవేస్తుంది
అరటి పండు తొక్క తీసినట్టు ఈజీగా వెల్లుల్లి పొట్టు తీయొచ్చు..
అరటి పండు తొక్క తీసినట్టు ఈజీగా వెల్లుల్లి పొట్టు తీయొచ్చు..
'విశ్వంభర'.. చిరంజీవికి ఎంతో స్పెషల్.. మెగా ఫ్యాన్స్‌కి ఫుల్ మీల్
'విశ్వంభర'.. చిరంజీవికి ఎంతో స్పెషల్.. మెగా ఫ్యాన్స్‌కి ఫుల్ మీల్
వేసవిలో కళ్ల సమస్యలా? ఈ జాగ్రత్తలు తీసుకుంటే నయనానందమే!
వేసవిలో కళ్ల సమస్యలా? ఈ జాగ్రత్తలు తీసుకుంటే నయనానందమే!
బడ్జెట్ హద్దు దాటితే.. ప్రాజెక్ట్ అటకెక్కినట్టే.!
బడ్జెట్ హద్దు దాటితే.. ప్రాజెక్ట్ అటకెక్కినట్టే.!
విడిపోయిన పాక్ ఆటగాళ్లు.. చిచ్చుపెట్టిన రోహిత్, బాబర్..
విడిపోయిన పాక్ ఆటగాళ్లు.. చిచ్చుపెట్టిన రోహిత్, బాబర్..
అప్పుడు రజినీకాంత్ మూవీలో సైడ్ యాక్టర్.. ఇప్పుడు స్టార్ హీరోయిన్
అప్పుడు రజినీకాంత్ మూవీలో సైడ్ యాక్టర్.. ఇప్పుడు స్టార్ హీరోయిన్