IND vs PAK: టీ20 ప్రపంచకప్‌లో మరోసారి భారత్-పాకిస్థాన్ ఫైట్.. ఎప్పుడో చెప్పేసిన పాకిస్థాన్ మాజీ ప్లేయర్..

T20 World Cup 2022: టీ20 ప్రపంచకప్‌లో భారత్, పాకిస్థాన్‌లు మరోసారి పోటీపడతాయని పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ చెప్పుకొచ్చాడు.

IND vs PAK: టీ20 ప్రపంచకప్‌లో మరోసారి భారత్-పాకిస్థాన్ ఫైట్.. ఎప్పుడో చెప్పేసిన పాకిస్థాన్ మాజీ ప్లేయర్..
Ind Vs Pak
Follow us

|

Updated on: Oct 24, 2022 | 5:30 PM

టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు తన ప్రయాణాన్ని ప్రారంభించింది. ఆ జట్టు తన తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను ఓడించింది. మెల్‌బోర్న్‌లో భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య అత్యంత ఉత్కంఠభరితమైన మ్యాచ్ జరగగా, చివరి బంతికి ఈ మ్యాచ్ ఫలితం వెలువడింది. అదే సమయంలో ఈ విజయం తర్వాత, భారత జట్టుతోపాటు అభిమానులు చాలా ఉత్సాహంగా ఉన్నారు. దీంతో అక్కడ పాక్ అభిమానులు, పలువురు మాజీ క్రికెటర్లు పాకిస్థాన్ ఓటమి తర్వాత నిరుత్సాహానికి గురయ్యారు. అయితే 2022లో భారత్‌-పాక్‌ల మధ్య మరోసారి టీ20 ప్రపంచకప్‌ జరుగుతుందని పాకిస్థాన్‌ మాజీ ఫాస్ట్‌ బౌలర్‌ షోయబ్‌ అక్తర్‌ పేర్కొన్నాడు.

మరోసారి ఇండో-పాక్ మ్యాచ్..

పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ తన యూట్యూబ్ ఛానెల్‌లో భారత్ ఒక మ్యాచ్ గెలిచిందని, పాకిస్థాన్ ఒక మ్యాచ్ ఓడిపోయిందని పేర్కొన్నాడు. ఈ టోర్నీలో భారత్, పాకిస్థాన్ మరోసారి పోటీపడనున్నాయి. భారత్‌, పాకిస్థాన్‌లు ఎప్పుడు ఆడతాయో అప్పుడే ప్రపంచకప్‌ ప్రారంభమవుతుందని షోయబ్‌ చెప్పుకొచ్చాడు. ఇది చరిత్రలో అత్యంత ప్రత్యేకమైన మ్యాచ్‌లలో ఒకటిగా నిలవనుంది. అదే ఫైనల్ మ్యాచ్. టీ20 ప్రపంచకప్ 2022లో ఇరుజట్లు తలపడనున్నాయి. మెల్‌బోర్న్‌లో వికెట్ చాలా దారుణంగా ఉందని చెప్పుకొచ్చాడు.

అయితే పాకిస్థాన్ జట్టు 160 పరుగులు చేసింది. పాకిస్థాన్ లోయర్ మిడిల్ ఆర్డర్ మెచ్యూరిటీకి తగ్గట్టుగా ఆడలేదు. జట్టు మరిన్ని పరుగులు చేయాల్సి ఉంది. ఈ మ్యాచ్‌లో ఓటమిని అంగీకరించి తదుపరి మ్యాచ్‌కి పాకిస్థాన్ ప్లాన్ చేసుకోవాలి.

ఇవి కూడా చదవండి

అంపైర్ నిర్ణయంపై ప్రశ్నలు లేవనెత్తిన పాక్ మాజీ ఆటగాళ్ళు..

వసీం అక్రమ్ ప్రకారం, ఆన్-ఫీల్డ్ అంపైర్ నో బాల్ ఇచ్చే ముందు థర్డ్ అంపైర్ సహాయం తీసుకోవాలి. ‘బంతి కిందికి రావడం కనిపించింది. బ్యాట్స్‌మెన్ నో-బాల్‌ని డిమాండ్ చేస్తాడు. కానీ, మీకు సాంకేతికత ఉంటే మీరు దానిని ఉపయోగించాలి’ అని చెప్పుకొచ్చాడు.

వకార్ యూనిస్ మాట్లాడుతూ, ‘స్క్వేర్ లెగ్ అంపైర్ ముందుగా చీఫ్ అంపైర్‌తో దీని గురించి చర్చించాల్సింది. ఆ తర్వాత థర్డ్ అంపైర్ వద్దకు వెళ్లొచ్చు. అందుకే థర్డ్ అంపైర్ ఉన్నది. ఈ నిర్ణయాన్ని ఆయనకే వదిలేయాలి’ అని చెప్పుకొచ్చాడు.