India vs Pakistan: టీమిండియాను ట్రోల్ చేయాలనుకున్నాడు.. దిమ్మతిరిగే కౌంటరిచ్చిన గూగుల్ సీఈవో.. బొక్క బోర్లా పడిన పాక్ అభిమాని..
పాకిస్థాన్‌పై భారత్ విజయం అందర్నీ ఆనందపరిచింది. మెల్‌బోర్న్‌లో భారత్ అద్భుత విజయాన్ని నమోదు చేయగానే సోషల్ మీడియా కూడా సంబరాలు చేసుకుంది. ఈ వేడుకలో గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ కూడా పాలు పంచుకున్నారు.
టీ20 ప్రపంచకప్ 2022లో సూపర్-12 దశలో పాకిస్థాన్‌ను 4 వికెట్ల తేడాతో ఓడించి భారత్ తన మిషన్‌ను అద్భుతంగా ప్రారంభించింది. మెల్‌బోర్న్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ టీమిండియాకు అద్భుతాలు చేశాడు. మ్యాచ్ తర్వాత అనేక రకాలుగా కామెంట్లు వచ్చాయి. అయితే, పాకిస్తాన్‌ను తీవ్రంగా ట్రోల్ చేశారు. విశేషమేమిటంటే.. గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ కూడా భారత్-పాకిస్థాన్ మ్యాచ్ పూర్తయ్యాక తన ఆనందాన్ని పంచుకున్నాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ కామెంట్ పంచుకున్నాడు. దీనిపై ఓ పాక్ అభిమాని ఇబ్బంది పట్టేలా కామెంట్ చేశాడు. కానీ, పిచాయ్ తన సమయ స్ఫూర్తితో రివర్స్ కౌంటర్ ఇచ్చారు. పాక్ అభిమాని దూల తీర్చాడు
నిజానికి సుందర్ పిచాయ్ సోషల్ మీడియాలో దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ భారత్-పాకిస్థాన్ మ్యాచ్ చివరి మూడు ఓవర్ల గురించి ప్రస్తావించారు. ఈ ట్వీట్‌కు ప్రతిస్పందనగా, ఒక పాకిస్తానీ అభిమాని సుందర్ పిచాయ్‌కి మొదటి మూడు ఓవర్లను చూడమని సలహా ఇచ్చాడు. అందులో కేఎల్ రాహుల్-రోహిత్ శర్మ ఔట్ అయ్యారు. దీని తర్వాత సుందర్ పిచాయ్ ఇచ్చిన సమాధానం అద్భుతంగా ఉంది.
సుందర్ పిచాయ్ తన ట్వీట్‌లో దీపావళి శుభాకాంక్షలు, ప్రతి ఒక్కరూ తమ కుటుంబం, స్నేహితులతో దీపావళి చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను. నేను ఈ దీపావళికి చివరి మూడు ఓవర్లు చూడటం ద్వారా నేను సెలబ్రేట్ చేసుకున్నారు. ఎంత గొప్ప మ్యాచ్, అద్భుతమైన ప్రదర్శన అంటూ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.
Happy Diwali! Hope everyone celebrating has a great time with your friends and family. ? I celebrated by watching the last three overs again today, what a game and performance #Diwali #TeamIndia #T20WC2022
— Sundar Pichai (@sundarpichai) October 24, 2022
ఈ ట్వీట్‌పై, మీరు మొదటి 3 ఓవర్లు చూడండి అని ఒక పాకిస్తానీ వినియోగదారు బదులిచ్చారు. దీనిపై సుందర్ పిచాయ్ నేను కూడా చూశానని రాసుకొచ్చారు. భువనేశ్వర్, అర్ష్‌దీప్ సింగ్ అద్భుతమైన స్పెల్ వేశారు. పాకిస్థానీ వినియోగదారు ఇక్కడ టీమిండియాను ట్రోల్ చేస్తున్నారు. కానీ, సుందర్ పిచాయ్ పాక్ ఇన్నింగ్స్‌ను గుర్తు చేస్తూ అతని జట్టును ట్రోల్ చేశాడు.
you should watch 1st three overs
— Muhammad Shahzaib (@Muhamma91436212) October 24, 2022
Did that too:) what a spell from Bhuvi and Arshdeep
— Sundar Pichai (@sundarpichai) October 24, 2022
ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 159 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. పాకిస్థాన్ తరపున షాన్ మసూద్, ఇఫ్తికార్ అహ్మద్ యాభై పరుగులు చేశారు. దీనికి సమాధానంగా టీమిండియా చివరి బంతికి ఈ మ్యాచ్‌లో విజయం సాధించింది. విరాట్ కోహ్లి భారత్ తరపున చారిత్రాత్మక ఇన్నింగ్స్ ఆడి 82 పరుగులు చేసి, హార్దిక్ పాండ్యా 40 పరుగులు చేసి మూడు వికెట్లు కూడా పడగొట్టాడు.