Watch Video: లాస్ట్ ఓవర్ యాక్షన్ మిస్ అయ్యారా.. నరాలు తెగే ఉత్కంఠ రేపిన వీడియో మీకోసం..
IND vs PAK: విరాట్ కోహ్లి 82 పరుగులతో రాణించడంతో భారత్ ఈ మ్యాచ్‌లో విజయం సాధించింది. దీంతో గతేడాది టీ20 ప్రపంచకప్‌లో ఓటమికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. 2021 టీ20 ప్రపంచకప్‌లో దుబాయ్‌లో భారత్‌పై పాకిస్థాన్ 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
ఆదివారం (అక్టోబర్ 23) మెల్‌బోర్న్‌లో ఎప్పటికీ మరచిపోలేని క్రికెట్ మ్యాచ్ జరిగింది. 90 వేలకుపైగా ప్రేక్షకుల ముందు భారత జట్టు పాకిస్థాన్‌ను నాలుగు వికెట్ల తేడాతో ఓడించింది. ఈ విజయంతో టీ20 ప్రపంచకప్‌లో శుభారంభం చేసింది. రెండు జట్లూ అద్భుత ఆటతీరును ప్రదర్శించినా.. చివరకు విజయం భారత్‌ను వరించింది. చాలా మంది అనుభవజ్ఞులు భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌తో నిజమైన ప్రపంచకప్ ప్రారంభమైందని చెప్పుకొచ్చారు.
విరాట్ కోహ్లి 82 పరుగులతో రాణించడంతో భారత్ ఈ మ్యాచ్‌లో విజయం సాధించింది. దీంతో భారత్ గతేడాది టీ20 ప్రపంచకప్‌లో ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది. 2021 టీ20 ప్రపంచకప్‌లో దుబాయ్‌లో భారత్‌పై పాకిస్థాన్ 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ప్రపంచకప్‌లో పాక్‌పై టీమిండియా తొలిసారి ఓడిపోయింది. ఆ ఓటమికి రోహిత్ శర్మ జట్టు ప్రతీకారం తీర్చుకుంది. టీ20 ప్రపంచకప్ మ్యాచ్ విశేషాల వీడియోను తన అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్‌లో షేర్ చేసింది. ఆ వీడియోను ఇక్కడ చూడొచ్చు..
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కెప్టెన్ రోహిత్ శర్మ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. అర్ష్‌దీప్ సింగ్, హార్దిక్ పాండ్యా అద్భుత బౌలింగ్ కారణంగా పాక్‌ను టీమిండియా 159 పరుగులకే పరిమితం చేసింది. పాకిస్థాన్ తరపున షాన్ మసూద్ 52 పరుగులు చేశాడు. అతను 42 బంతుల్లో ఐదు ఫోర్లు కొట్టాడు. ఇఫ్తికార్ అహ్మద్ 34 బంతుల్లో 51 పరుగులు చేశాడు. కెప్టెన్ బాబర్ ఆజం ఖాతా తెరవలేకపోయాడు. నాలుగు పరుగులు చేసి మహ్మద్ రిజ్వాన్ అవుటయ్యాడు. భారత్ తరపున అర్ష్‌దీప్, హార్దిక్‌లు చెరో మూడు వికెట్లు తీశారు. భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ ఒక్కో వికెట్ అందుకున్నారు.
అనంతరం భారత్ 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసి విజయం సాధించింది. కోహ్లి 53 బంతుల్లో ఆరు ఫోర్లు, నాలుగు సిక్సర్లు బాదాడు. హార్దిక్ పాండ్యా 37 బంతుల్లో 40 పరుగులు చేశాడు. సూర్యకుమార్ యాదవ్ 15 పరుగులు చేశాడు. రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ విఫలమయ్యారు. ఇద్దరూ చెరో నాలుగు పరుగులు చేశారు. అక్షర్ పటేల్ రెండు, దినేష్ కార్తీక్ ఒక పరుగు మాత్రమే చేయగలిగారు. అశ్విన్ తన కెరీర్‌లో మరపురాని ఒక పరుగు సాధించి, విజయాన్ని అందించాడు. పాక్ బౌలర్లలో హరీస్ రవూఫ్, మహ్మద్ నవాజ్ చెరో రెండు వికెట్లు తీశారు.