IND vs PAK: ఆసియాకప్‌లో విలన్.. కట్‌చేస్తే.. టీ20 ప్రపంచకప్‌లో 12 బంతుల్లోనే హీరోగా మారిన భారత ప్లేయర్..
పాకిస్తాన్ తన ఇద్దరు బ్యాట్స్‌మెన్‌ల గురించి ఎంతో గర్వపడింది. కానీ, కీలక మ్యాచ్‌లో వారే తీవ్రంగా నిరాశపరిచారు. ఇక, పాకిస్థాన్ పతనానికి అర్ష్‌దీప్ సింగ్ కారణం అయ్యాడు.
మెల్‌బోర్న్ మైదానంలో భారత్-పాకిస్థాన్ మధ్య హై ఓల్టేజీ మ్యాచ్ అట్టహాసంగా ప్రారంభమైంది. టాస్ గెలిచిన తర్వాత, భారత కెప్టెన్ రోహిత్ శర్మ మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఆ తర్వాత అతని నిర్ణయాన్ని భారత జట్టు సమర్థవంతమైన సర్దార్ అంటే అర్ష్దీప్ సింగ్ నిజమని నిరూపించాడు. భువనేశ్వర్ కుమార్ తొలి ఓవర్ బౌలింగ్ చేశాడు. అద్భుతంగా బౌలింగ్ చేసినా.. వికెట్ పడగొట్టలేదు. కానీ, అర్ష్‌దీప్ చేసిన విధ్వంసం, పాకిస్థాన్‌కు మాత్రం పీడకలలా మారింది. అతను మొదట బాబర్ అజామ్, మహ్మద్ రిజ్వాన్‌లను కేవలం 12 బంతుల వ్యవధిలో పెవిలియన్ చేర్చాడు. ఈ బ్యాట్స్‌మెన్‌లు ఎప్పుడు క్రీజులోకి వచ్చారో, ఎప్పుడు వెళ్లిపోయారో కూడా తెలియకుండా చేశాడు.
అంటే, పాకిస్తాన్ తన ఇద్దరు బ్యాట్స్‌మెన్‌ల గురించి గర్వపడింది. కానీ, అదే ఆశలను అర్షదీప్ చీల్చిచెండాడి, ఆ జట్టుకు తీవ్ర నిరాశను మిగిల్చాడు. ఇక, పాకిస్థాన్ పతనానికి భారత్‌కు చెందిన అర్ష్‌దీప్ సింగ్ కారణం అయ్యాడు. T20 వరల్డ్ కప్ 2022 ప్రారంభానికి ముందే అర్ష్‌దీప్ గురించి చర్చ జరిగింది. పాకిస్తాన్‌తో జరిగిన T20 ప్రపంచ కప్‌లో తన మొదటి మ్యాచ్‌లో, ఆట ప్రారంభానికి ముందే తన పేరు ఎందుకు ఉండాలో వివరించాడు.
A dream start ft. Arshdeep Singh! ?
Keep watching Star Sports & Disney+Hotstar to enjoy the LIVE action from the ICC Men’s #T20WorldCup 2022!#GreatestRivalry #BelieveInBlue #ReadyForT20WC #INDvPAK pic.twitter.com/zquAPT8EOf
— Star Sports (@StarSportsIndia) October 23, 2022
మొదట బాబర్ ఆ తర్వాత రిజ్వాన్..
టీ20 ప్రపంచకప్ చరిత్రలో అర్ష్‌దీప్ సింగ్ విసిరిన తొలి బంతికే పాక్ కెప్టెన్ బాబర్ ఆజం భారీ వికెట్ తీశాడు. అతను బాబర్‌కు ఎల్‌బీడబ్ల్యూ ద్వారా గోల్డెన్ డక్ చేశాడు.
అతని మొదటి ఓవర్ మొదటి బంతికి బాబర్‌ను అవుట్ చేసిన తరువాత, అర్ష్‌దీప్ సింగ్ రెండవ ఓవర్ చివరి బంతికి పాకిస్తాన్ రెండవ స్టార్ బ్యాట్స్‌మెన్ మహ్మద్ నవాజ్‌ను కూడా డీల్ చేశాడు. షార్ట్ బాల్‌లో భువనేశ్వర్ కుమార్ వేసిన క్యాచ్‌తో రిజ్వాన్ పెవిలియన్ చేరాడు.
2 ఓవర్లలోనే పాకిస్థాన్ పాలిట విలన్ అయ్యాడు..
ఈ విధంగా, అర్ష్‌దీప్ సింగ్ తన మొదటి T20 ప్రపంచ కప్‌లో బాబర్, రిజ్వాన్‌లను మొదటి 2 ఓవర్లలోనే పెవిలియన్ చేర్చాడు. అర్ష్‌దీప్ వేసిన బంతి గురించి పాకిస్థాన్‌లోని ఈ ఇద్దరు పెద్ద బ్యాట్స్‌మెన్‌లకు కూడా తెలియదు. అర్ష్‌దీప్ సమర్థవంతమైన బౌలింగ్ ముందు వారి పోరాటం చచ్చుబడిపోయింది.
మ్యాచ్ గురించి మాట్లాడితే..
పాక్ జట్టు నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది. దీంతో టీమిండియా ముందు 160 పరుగుల టార్గెట్‌ని ఉంచింది. భారత్ తరపున హార్దిక్, అర్ష్‌దీప్ చెరో 3 వికెట్లు పడగొట్టారు. షమీ, భువీ ఖాతాల్లో ఓ వికెట్ చేరింది.
ఇరు జట్లు..
టీమిండియా ప్లేయింగ్ XI: రోహిత్ శర్మ(సి), కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్(w), అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్
పాకిస్తాన్ ప్లేయింగ్ XI: బాబర్ ఆజం(సి), మహ్మద్ రిజ్వాన్(w), షాన్ మసూద్, హైదర్ అలీ, మహ్మద్ నవాజ్, షాదాబ్ ఖాన్, ఇఫ్తీకర్ అహ్మద్, ఆసిఫ్ అలీ, షాహీన్ అఫ్రిది, హరీస్ రవూఫ్, నసీమ్ షా