Telugu News Sports News Cricket news India target 160 in 20 overs against pakistan in ICC Mens T20 World Cup 2022 India vs Pakistan 16th Match Super 12 Group 2
India vs Pakistan: సత్తా చాటిన బౌలర్లు.. ఇక భారమంతా బ్యాటర్లదే.. టీమిండియా టార్గెట్ 160
టాస్ గెలిచిన రోహిత్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. బౌలర్లు నిర్ణయం సరైనదని నిరూపించారు. దీంతో పాక్ జట్టు నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది. దీంతో టీమిండియా ముందు 160 పరుగుల టార్గెట్‌ని ఉంచింది.
టీ20 వరల్డ్ కప్ 2022లో అతిపెద్ద క్లాష్, భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ప్రారంభమైంది. టాస్ గెలిచిన రోహిత్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. బౌలర్లు నిర్ణయం సరైనదని నిరూపించారు. దీంతో పాక్ జట్టు నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది. దీంతో టీమిండియా ముందు 160 పరుగుల టార్గెట్‌ని ఉంచింది. భారత్ తరపున హార్దిక్, అర్ష్‌దీప్ చెరో 3 వికెట్లు పడగొట్టారు. షమీ, భువీ ఖాతాల్లో ఓ వికెట్ చేరింది. పాండ్యా 14వ ఓవర్లో రెండు వికెట్లు తీసి పాకిస్థాన్‌ను కష్టాల్లో పడేశాడు. పాకిస్థాన్ తరపున ఇఫ్తికర్ 51 పరుగులతో ఇన్నింగ్స్ ఆడాడు. 4 సిక్సర్లు కూడా కొట్టాడు. షాన్ మసూద్ 52 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.