IND vs PAK: మెల్‌బోర్న్‌లో ‘విరాట పర్వం’.. ఉత్కంఠ మ్యాచ్‌లో చిత్తయిన పాక్‌.. టీ20 ప్రపంచకప్‌లో భారత్ బోణీ..

టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌-భారత్‌ మధ్య జరిగిన గ్రేట్‌ మ్యాచ్‌ చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగింది. 160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 31 పరుగుల వద్ద 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆపై క్రీజులోకి వచ్చిన కోహ్లి, హార్దిక్ లు 78 బంతుల్లో 113 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

IND vs PAK: మెల్‌బోర్న్‌లో 'విరాట పర్వం'.. ఉత్కంఠ మ్యాచ్‌లో చిత్తయిన పాక్‌.. టీ20 ప్రపంచకప్‌లో భారత్ బోణీ..
Virat Kohli, Dinesh Karthik
Follow us
Venkata Chari

|

Updated on: Oct 23, 2022 | 5:54 PM

టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌-భారత్‌ మధ్య జరిగిన గ్రేట్‌ మ్యాచ్‌ చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగింది. 160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 31 పరుగుల వద్ద 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆపై క్రీజులోకి వచ్చిన కోహ్లి, హార్దిక్ లు 78 బంతుల్లో 113 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. చివరి క్షణంలో హార్దిక్ ఔటయ్యాడు, కానీ ఛేజ్ మాస్టర్ కోహ్లీ చివరి వరకు నిలిచి, టీమిండియాను గెలిపించాడు.

చివరి ఓవర్లో భారత్ విజయానికి 16 పరుగులు కావాల్సిన సమయంలో కోహ్లీ అద్భుతం చేశాడు. నో బాల్‌లో స్పిన్నర్ నవాజ్ బంతిని సిక్సర్ బాదాడు. దీని తర్వాత, అతను ఫ్రీ హిట్‌లో బౌల్డ్ అయినప్పుడు కూడా 3 పరుగులు తీశాడు. 2 పరుగులు అవసరమైతే దినేష్ కార్తీక్ అవుటయ్యాడు. అశ్విన్ రాగానే నవాజ్ వైడ్ విసిరాడు. దీంతో అశ్విన్ ఒక్క పరుగు చేసి విజయం సాధించాడు.

ఇవి కూడా చదవండి

అంతకుముందు టాస్ గెలిచిన రోహిత్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. బౌలర్లు నిర్ణయం సరైనదని నిరూపించారు. దీంతో పాక్ జట్టు నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది. దీంతో టీమిండియా ముందు 160 పరుగుల టార్గెట్‌ని ఉంచింది. భారత్ తరపున హార్దిక్, అర్ష్‌దీప్ చెరో 3 వికెట్లు పడగొట్టారు. షమీ, భువీ ఖాతాల్లో ఓ వికెట్‌ చేరింది. పాండ్యా 14వ ఓవర్లో రెండు వికెట్లు తీసి పాకిస్థాన్‌ను కష్టాల్లో పడేశాడు. పాకిస్థాన్ తరపున ఇఫ్తికర్ 51 పరుగులతో ఇన్నింగ్స్ ఆడాడు. 4 సిక్సర్లు కూడా కొట్టాడు. షాన్ మసూద్ 52 పరుగులతో నాటౌ‌ట్‌గా నిలిచాడు.

టీమిండియా ప్లేయింగ్ XI: రోహిత్ శర్మ(సి), కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్(w), అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్

ఇరు జట్లు..

పాకిస్తాన్ ప్లేయింగ్ XI: బాబర్ ఆజం(సి), మహ్మద్ రిజ్వాన్(w), షాన్ మసూద్, హైదర్ అలీ, మహ్మద్ నవాజ్, షాదాబ్ ఖాన్, ఇఫ్తీకర్ అహ్మద్, ఆసిఫ్ అలీ, షాహీన్ అఫ్రిది, హరీస్ రవూఫ్, నసీమ్ షా

జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.