AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 World Cup 2022: ఆస్ట్రేలియాలో కోహ్లీకి ఎదురులేదు.. అలా చేసిన మొదటి ఆటగాడిగా రికార్డు..

IND vs PAK 2022: ఆదివారం మెల్‌బోర్న్‌లో పాకిస్తాన్‌పై భారత జట్టు విజయం సాధించడంలో హీరోగా నిలిచిన విరాట్ కోహ్లి తన పేరిట ఒక భారీ రికార్డు సృష్టించాడు.

T20 World Cup 2022: ఆస్ట్రేలియాలో కోహ్లీకి ఎదురులేదు.. అలా చేసిన మొదటి ఆటగాడిగా రికార్డు..
Virat Kohli
Venkata Chari
|

Updated on: Oct 25, 2022 | 7:48 PM

Share

ఆదివారం పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా విజయంలో విరాట్ కోహ్లీనే హీరో అనే విషయం తెలిసిందే. మెల్‌బోర్న్‌లో పాకిస్థాన్‌పై విరాట్ కోహ్లీ 53 బంతుల్లో 82 పరుగులు చేశాడు. భారత మాజీ కెప్టెన్ బ్యాటింగ్‌కు వచ్చే సమయానికి, టీమిండియా 4 వికెట్ల నష్టానికి 31 పరుగులతో కష్టాల్లో పడింది. అయితే విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా ఐదో వికెట్‌కు 113 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. జట్టును కష్టాలనుంచి గట్టేక్కించారు. అలాగే, పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ తన పేరిట ఓ భారీ రికార్డు సృష్టించాడు.

ఆ రికార్డు ఏంటంటే?

ఆస్ట్రేలియా గడ్డపై టీ20, వన్డే, టెస్టు ఫార్మాట్లలో విరాట్ కోహ్లీ 500కు పైగా పరుగులు చేశాడు. మూడు ఫార్మాట్లలో ఇలా చేసిన ఏకైక క్రికెటర్ భారత మాజీ కెప్టెనే కావడం గమనార్హం. ఆస్ట్రేలియా గడ్డపై ఈ ఘనత సాధించిన ఏకైక విదేశీ ఆటగాడు విరాట్ కోహ్లీ. ఆస్ట్రేలియా గడ్డపై టెస్టుల్లో విరాట్ కోహ్లీ 1352 పరుగులు చేశాడు. వన్డే ఫార్మాట్‌లో విరాట్ కోహ్లీ పేరిట 1327 పరుగులు నమోదయ్యాయి. అదే సమయంలో, టీ20 ఫార్మాట్‌లో కూడా విరాట్ కోహ్లీ బ్యాట్ దూకుడు చూపించింది. ఈ ఆటగాడు ఆస్ట్రేలియా గడ్డపై టీ20 ఫార్మాట్‌లో 533 పరుగులు చేశాడు.

ఇవి కూడా చదవండి

గురువారం నెదర్లాండ్స్‌తో టీమిండియా పోరు..

మెల్‌బోర్న్‌లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ 53 బంతుల్లో 82 పరుగులు చేసి టీమ్ ఇండియాకు విజయాన్ని అందించాడు. ఇది కాకుండా, హార్దిక్ పాండ్యా 37 బంతుల్లో 40 పరుగుల ముఖ్యమైన సహకారం అందించాడు. విరాట్‌ కోహ్లి, హార్దిక్‌ పాండ్యాల అద్భుతమైన భాగస్వామ్యంతో టీమిండియా చివరి బంతికి పాకిస్థాన్‌ను ఓడించగలిగింది. అదే సమయంలో భారత జట్టు T20 ప్రపంచ కప్ 2022లో తన రెండవ మ్యాచ్‌ను నెదర్లాండ్స్‌తో తలపడనుంది. అక్టోబర్ 27న సిడ్నీలో భారత్, నెదర్లాండ్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఇరు జట్ల మధ్య ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రారంభమవుతుంది.