T20 WC 2022: నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌కి టీమిండియా ఆల్ రౌండర్ డౌట్.. కారణం ఏంటంటే?
2022 టీ20 ప్రపంచకప్‌లో తమ తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను ఓడించిన టీమ్ ఇండియా రెండో మ్యాచ్‌లో అక్టోబర్ 27న నెదర్లాండ్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యాకు విశ్రాంతి ఇవ్వవచ్చని వార్తలు వస్తున్నాయి.
నెదర్లాండ్స్‌తో జరిగే మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యాకు విశ్రాంతి లభించే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. నివేదిక ప్రకారం, ఈ మ్యాచ్‌లో స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాకు విశ్రాంతి ఇవ్వనున్నారు. పీటీఐ నివేదిక ప్రకారం, సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో అక్టోబర్ 27 (గురువారం) నెదర్లాండ్స్‌తో జరిగే సూపర్ 12 మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యాకు విశ్రాంతి ఇవ్వవచ్చని తెలుస్తోంది. ఈ మ్యాచ్‌కు ముందు కూడా హార్దిక్ ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొనలేదు.
పాక్ మ్యాచ్‌లో గాయంతో ఇబ్బంది..
పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ సమయంలో కూడా పూర్తిగా ఫిట్‌గా కనిపించలేదు. అతను నొప్పితో బాధపడుతున్నట్లు కనిపించింది. పీటీఐ నివేదిక ప్రకారం, ఆల్ రౌండర్ ఫిట్‌నెస్‌పై భారత జట్టు మేనేజ్‌మెంట్ నిశితంగా పరిశీలిస్తోంది. హార్దిక్ ప్రాక్టీస్ సెషన్‌ను దాటవేయాలని నిర్ణయించుకున్నాడు. అయితే, బౌలర్లకు ఒక రోజు సెలవు ఇచ్చారని, అందుకే పాండ్యా కూడా ప్రాక్టీస్ సెషన్‌కు దూరమయ్యాడని అంటున్నారు. కానీ, తదుపరి గేమ్‌కు మాత్రం దూరమవుతాడనే వార్తల్లోనూ ఎలాంటి నిర్ణయం కూడా ఇంతవరకు వెలువడలేదు.
పాక్‌పై భారత్ విజయంలో హార్దిక్ పాండ్యా కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. పాకిస్థాన్‌పై హార్దిక్ బంతితోనూ, బ్యాట్‌తోనూ బాగా రాణించాడు. బౌలింగ్‌లో మూడు వికెట్లు తీశాడు. అదే సమయంలో అతను బ్యాటింగ్‌లో 40 పరుగుల కీలక ఇన్నింగ్స్‌ను ఆడాడు.
తొలి మ్యాచ్‌లో భారత్ ఘన విజయం..
టీమిండియా తన తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను 4 వికెట్ల తేడాతో ఓడించింది. తొలుత ఆడిన పాకిస్థాన్ జట్టు భారత్ ముందు 160 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. చివరి బంతికి రోహిత్ సేన విజయం సాధించింది. విరాట్ కోహ్లీ భారత్ తరపున 82 పరుగులతో మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు.