Video: ఇదేం కొట్టుడు సామీ.. 6 సిక్సులు, 4 ఫోర్లతో హాఫ్ సెంచరీ.. 327 స్ట్రైక్ రేట్ తో బౌలర్లకు మరణదండన..

AUS vs SL: శ్రీలంకతో జరిగిన ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా విజయానికి 158 పరుగులు చేయాల్సి ఉంది. అయితే, కేవలం ఆస్ట్రేలియా 16.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి టార్గెట్ ను చేరుకుని విజయం సాధించింది.

Video: ఇదేం కొట్టుడు సామీ.. 6 సిక్సులు, 4 ఫోర్లతో హాఫ్ సెంచరీ.. 327 స్ట్రైక్ రేట్ తో బౌలర్లకు మరణదండన..
Aus Vs Sl Marcus Stoinis
Follow us
Venkata Chari

| Edited By: Ravi Kiran

Updated on: Oct 26, 2022 | 6:30 AM

T20 వరల్డ్ కప్ 2022 19వ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 7 వికెట్ల తేడాతో శ్రీలంకను ఓడించింది. శ్రీలంకతో జరిగిన ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా విజయానికి 158 పరుగులు చేయాల్సి ఉంది. అయితే, కేవలం ఆస్ట్రేలియా 16.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి టార్గెట్ ను చేరుకుని విజయం సాధించింది. కీలక సమయంలో ఆసీస్ విజయం సాధించి రేసులో నిలిచింది. ఈ ప్రపంచకప్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన ఆస్ట్రేలియా తొలి విజయం సాధించింది. అంతకుముందు న్యూజిలాండ్‌పై ఆతిథ్య ఆస్ట్రేలియా ఓటమి చవిచూడాల్సి వచ్చింది.

మార్కస్ స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్..

ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ మార్కస్ స్టోయినిస్ లంకపై చెలరేగిపోయాడు. 89 పరుగులకే 3వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయింది. దీంతో క్రీజులోకి వచ్చిన స్టోయినీస్ వెంటనే తన ప్రతాపం చూపించడం మొదలుపెట్టాడు. కరుణరత్నతో మొదలు పెట్టిన ఊచకోత లహిరు కుమారతో ముగించాడు. కేవలం 18 బంతులు ఆడిన స్టోయినీస్.. 4 పోర్లు, 6 సిక్సర్లతో బౌండరీల వర్షం కురిపించి, లంక బౌలర్లను చీల్చి చెండాడాడు. ఈ క్రమంలో 327 స్ట్రైక్ రేట్ తో పరుగుల వరద పారించిన ఈ ఆసీస్ ప్లేయర్.. ఏ బౌలర్ ను వదలలేదు. కేవలం 17 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన స్టోయినీస్.. మ్యాచ్ మొత్తాన్ని లంక నుంచి లాగేసుకుని, కష్టమనున్న గెలుపును, ఈజీగా మార్చేశాడు.

ఈ పవర్ ఫుల్ బ్యాటింగ్ తో లంక బౌలర్లకు చుక్కలు చూపించిన స్టోయినీస్.. ఆస్ట్రేలియా ఆటగాళ్లలోనే తక్కువ బాల్స్ లో హాఫ్ సెంచరీ చేసిన తొలి ప్లేయర్ గా నిలిచాడు. దీంతో ఆస్ట్రేలియా తన నెట్ రన్ రేట్ ను కూడా పెంచుకోవడంతో స్టోయినీస్ సహాయపడ్డాడు. ఈ విజయంతో ఆస్ట్రేలియా పాయింట్ల పట్టికలో 2 పాయింట్లతో 4వ స్థానంలో నిలిచింది. అదే సమయంలో కెప్టెన్ ఆరోన్ ఫించ్ 42 బంతుల్లో 31 పరుగులతో నాటౌట్ గా వెనుదిరిగాడు. ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ 10 బంతుల్లో 11 పరుగులు చేసి ఔటయ్యాడు. మిచెల్ మార్ష్ 17 బంతుల్లో 17 పరుగులు చేశాడు. గ్లెన్ మాక్స్‌వెల్ 12 బంతుల్లో 23 పరుగులతో వేగంగా ఇన్నింగ్స్ ఆడాడు. గ్లెన్ మాక్స్‌వెల్ తన ఇన్నింగ్స్‌లో 2 ఫోర్లు, 2 సిక్సర్లు కొట్టాడు. ధనంజయ డి సిల్వా, చమిక కరుణరత్నే, మహేష్ తీక్షణ తలో వికెట్ పడగొట్టారు.

View this post on Instagram

A post shared by ICC (@icc)

నిరాశపరిచిన శ్రీలంక బౌలర్లు..

శ్రీలంక తరపున ధనంజయ్ డిసిల్వా 2.1 ఓవర్లలో 18 పరుగులిచ్చి 1 వికెట్ తీశాడు. అదే సమయంలో చమిక కరుణరత్నే 3 ఓవర్లలో 20 పరుగులకే 1 ఆటగాడిని పెవిలియన్‌కు పంపాడు. మహేష్ తీక్షణ 3 ఓవర్లలో 23 పరుగులు ఇవ్వగా, ఒక వికెట్ దక్కించుకున్నాడు. ఇది కాకుండా మిగతా శ్రీలంక బౌలర్లు నిరాశపరిచారు. ఆస్ట్రేలియా బ్యాటర్ల దెబ్బకు వానెందు హసరంగా బలయ్యాడు. ఆస్ట్రేలియన్ బౌలర్లు వనేందు హసరంగా వేసిన 3 ఓవర్లలో 53 పరుగులు చేశారు. ఈ బౌలర్‌కు ఒక్క వికెట్ కూడా దక్కలేదు. ఈ మ్యాచ్‌లో 18 బంతుల్లో అజేయంగా 59 పరుగులు చేసిన మార్కస్ స్టోయినిస్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా ఎంపికయ్యాడు.