Video: నిన్న విరాట్ కోహ్లీ.. మొన్న మరో బ్యాటర్.. డెడ్ బాల్‌లో 8 రన్స్ రాబట్టాడు.. ఎవరో తెలుసా.. అసలు రూల్ ఏంటంటే?

T20 World Cup 2022: పాకిస్థాన్‌పై భారత్ విజయం సాధించిన తర్వాత, ఐసీసీ నిబంధన గురించి పెద్ద రచ్చే జరిగింది. మార్క్ టేలర్ ఏకంగా నిషేధం విధించాలని డిమాండ్ చేశాడు.

Video: నిన్న విరాట్ కోహ్లీ.. మొన్న మరో బ్యాటర్.. డెడ్ బాల్‌లో 8 రన్స్ రాబట్టాడు.. ఎవరో తెలుసా.. అసలు రూల్ ఏంటంటే?
Ind Vs Pak Records
Follow us
Venkata Chari

|

Updated on: Oct 25, 2022 | 6:10 PM

పాకిస్థాన్‌పై భారత్ విజయం సాధించినప్పటి నుంచి ఐసీసీ నిబంధనపై రచ్చ జరుగుతోంది. ఫ్రీ హిట్‌పై బౌల్డ్ అయిన తర్వాత పరుగు తీసుకోవాలనేది ఈ నియమం. పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో నవాజ్ బౌలింగ్‌లో విరాట్ కోహ్లీ అవుటయ్యాడు. ఇది ఫ్రీ హిట్ బాల్. ఆ తర్వాత విరాట్, కార్తీక్ మూడు పరుగులు తీశారు. ఈ మూడు పరుగుల కారణంగా ఆఖరి బంతికి టీమిండియా విజయం సాధించింది. ICC ఈ నియమంపై ప్రస్తుతం ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఈ నిబంధనను వెంటనే మార్చాలని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మార్క్ టేలర్ అన్నారు. అయితే, ఓ మ్యాచ్‌లో ఆస్ట్రేలియన్ బ్యాట్స్‌మెన్ కూడా ఇలాంటి పనే చేయడంతో, మార్క్ టేలర్‌ ప్రస్తుతం ట్రోల్స్ బారిన పడ్డాడు.

పాకిస్థాన్‌పై ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్ బ్రాడ్ హాడిన్ కూడా అచ్చం విరాట్ చేసిన పనే చేశాడు. ఆస్ట్రేలియా వెళ్లిన పాకిస్థాన్ జట్టు, ఆస్ట్రేలియా-ఏ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో షోయబ్ అక్తర్ ఎక్స్‌ట్రాలకు 3 పరుగులు ఇచ్చాడు. అక్తర్ వేసిన బంతికి హాడిన్ 4 పరుగులు చేశాడు. ఈ బంతి కూడా నో బాల్. ఆ తర్వాతి బంతికి హాడిన్ బౌల్డ్ అయ్యాడు. అది ఫ్రీ హిట్. హాడిన్ బౌల్డ్ అయిన తర్వాత ఒక పరుగు కూడా చేశాడు. దీంతో మార్క్ టేలర్ ట్రోల్స్ బారిన పడ్డాడు. అప్పుడు ఆస్ట్రేలియ బ్యాటర్లు చేసిందే కదా.. ఇప్పుడు విరాట్ కోహ్లీ చేసిందంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మార్క్ టేలర్ ఈ నియమాన్ని నిషేధించాలని ఎందుకు డిమాండ్ చేస్తున్నాడు?

ఈ నిబంధనను నిషేధించాలని మార్క్ టేలర్ ఎందుకు డిమాండ్ చేస్తున్నారనేది ఇప్పుడు ప్రశ్నగా మారింది. టేలర్ మాట్లాడుతూ, ‘ఈ నియమం ద్వారా, బ్యాటింగ్ జట్టు ప్రయోజనం పొందుతుంది. అందుకే ఫ్రీ హిట్‌లో బౌల్డ్ అయితే, ఆ బంతిని డెడ్ బాల్ అవ్వాలి’ అంటూ చెప్పుకొచ్చాడు.

ఈ నియమంపై సైమన్ టౌఫెల్ ఏమన్నారంటే..

View this post on Instagram

A post shared by ICC (@icc)

లెజెండరీ అంపైర్లలో ఒకరైన సైమన్ టౌఫెల్ కూడా ఈ విషయంపై మాట్లాడారు. అతని ప్రకారం, భారత జట్టు బౌల్డ్ అయిన తర్వాత తీసుకున్న మూడు పరుగులు నియమం ప్రకారం ఖచ్చితంగా సరైనవి. అంపైర్లు సరైన నిర్ణయమే తీసుకున్నారని టౌఫెల్ అన్నాడు. ఒక ఫ్రీ హిట్ కారణంగా బ్యాట్స్‌మన్ బౌల్డ్ అయితే, ఆ బంతి డెడ్‌గా పరిగణించరు అని చెప్పుకొచ్చారు.

జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.