AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Munugode ByPoll: ఈ చిత్రం కశ్మీర్ సరిహద్దుల్లో కాదు.. మన మునుగోడులోనే.. విషయం ఏమిటంటే..?

మునుగోడు నియోజకవర్గం ఇప్పుడు దేశ ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది. ఇప్పటివరకు తెలుగురాష్ట్రాల్లోనే సరిగ్గా ఎవరికి తెలియని ఈ నియోజకవర్గం పేరు ఇప్పుడు దేశమంతా హాట్ టాపిక్ అవుతోంది. ఉప ఎన్నిక ప్రకటనతో పదుల సంఖ్యలో మంత్రులు, వందలాది మంది ఎమ్మెల్యేలు ఒక నియోజకవర్గంలో..

Munugode ByPoll: ఈ చిత్రం కశ్మీర్ సరిహద్దుల్లో కాదు.. మన మునుగోడులోనే.. విషయం ఏమిటంటే..?
Temporary Tents at Munugode
Amarnadh Daneti
|

Updated on: Oct 26, 2022 | 4:37 PM

Share

మునుగోడు నియోజకవర్గం ఇప్పుడు దేశ ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది. ఇప్పటివరకు తెలుగురాష్ట్రాల్లోనే సరిగ్గా ఎవరికి తెలియని ఈ నియోజకవర్గం పేరు ఇప్పుడు దేశమంతా హాట్ టాపిక్ అవుతోంది. ఉప ఎన్నిక ప్రకటనతో పదుల సంఖ్యలో మంత్రులు, వందలాది మంది ఎమ్మెల్యేలు ఒక నియోజకవర్గంలో మోహరించడంతో ఒక్కసారిగా ఈ నియోజకవర్గం వార్తల్లో నిలిచింది. కేంద్రమంత్రులు సైతం రోజూ ఎవరో ఒకరు మునుగోడుకు వచ్చి వెళ్తూన్నారు. గతంలో తమ సమస్యలు పట్టించుకోండి అంటూ ఎంతో మంది ప్రజాప్రతినిధులను వేడుకున్నా పట్టించుకున్న నాధుడే కరువయ్యాడు. ఇప్పుడు మాత్రం అన్ని పార్టీల నాయకులు మునుగోడు నియోజకవర్గంలోని గ్రామాల్లో తిరుగుతూ.. గత కొన్ని రోజులుగా ప్రజల మధ్యనే ఉంటూ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. టీఆర్ ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలతో పాటు ఇరత పార్టీల నాయకులు సైతం మునుగోడుకు తాత్కాలికంగా మకాం మార్చడంతో ఇక్కడ ఇళ్ల కొరత కూడా ఏర్పడింది. కొద్దో గొప్పో ఖాళీగా ఉన్న ఇళ్లకు అయితే కేవలం 20 రోజులకే వేలల్లో అద్దె పలకగా, ఓ మోస్తరు సదుపాయాలు ఉన్న ఇళ్ల అద్దె లక్షల్లో పలుకిన విషయం తెలిసిందే. మరోవైపు వివిధ పార్టీల కార్యకర్తల ఇళ్లు కూడా తయ పార్టీ నాయకుల అతిథ్యంతో నిండిపోయాయి. తమ పార్టీపై అభిమానంతో ఇతర ప్రాంతాల కార్యకర్తలు సైతం మునుగోడు వచ్చి తమ అభిమాన పార్టీ అభ్యర్థి తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. దీంతో ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న కార్యకర్తలకు వసతి ఏర్పాటుచేయడం వివిధ రాజకీయ పార్టీలకు కత్తిమీద సాములా తయారైంది.

నియోజకవర్గంలో ఉన్న కమ్యూనిటీ హాలులతో పాటు కళ్యాణ మండపాలు సైతం ఇప్పటికే వివిధ పార్టీల కార్యకర్తలతో ఫుల్ అయిపోయాయి. హైదరాద్ కు సమీపంలో మునుగోడు నియోజకవర్గం ఉండటంతో కొంతమంది ముఖ్యమైన నాయకులైతే ఉదయం నియోజకవర్గానికి వెళ్లి, రాత్రి వరకు ఉండి.. ప్రచార సమయం ముగిసిన తర్వాత విశ్రాంతి కోసం మునుగోడు నియోజకవర్గానికి సమీపంలో ఉండే హోటళ్లు, గెస్ట్ హౌస్ లలో విశ్రాంతి తీసుకుంటున్నారు. కాని కార్యకర్తలందరికి ఇలాంటి సౌకర్యాలు కల్పించడం సాధ్యం కాకపోవడంతో భారతీయ జనతా పార్టీ వినూత్నంగా ఆలోచించి, ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న కార్యకర్తల వసతి కోసం తాత్కాలిక గుడారాలను ఏర్పాటు చేసింది. సాధారణంగా కశ్మీర్ సరిహద్దుల్లో లేదా ఎక్కడైనా వైపరీత్యాలు లేదా గొడవలు జరిగి పోలీసు ఫోర్సు ఎక్కువ అవసరమైనప్పుడు వారు ఉండటానికి తాత్కాలిక గుడారాలను ఏర్పాటు చేసుకుంటుంటారు. ఇప్పుడు సరిగ్గా మునుగోడు ఉప ఎన్నిక వేళ మన మునుగోడులో ఇలాంటి పరిస్థితులే కనబడుతున్నాయి. అద్దె గదులకు డిమాండ్ ఏర్పడంతో పాటు ఖాళీలు లేకపోవడంతో యుద్ధప్రాతిపాదికన తమ పార్టీ కార్యకర్తల కోసం బీజేపీ తాత్కాలిక గుడారాలను ఏర్పాటు చేసింది. ఇప్పుడు తాత్కాలిక గుడారాలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

సాధారణంగా గతంలో ఉత్తర భారతదేశంలో వివిధ రాజకీయ పార్టీలు రాష్ట్ర స్థాయిలో లేదా జాతీయ స్థాయిలో తమ కార్యకర్తల శిక్షణ కోసం లేదా జాతీయ సమావేశాలు నిర్వహించే సమయంలో అంతా సమావేశాలు జరిగే ప్రదేశానికి దగ్గరగా ఉండాలనే ఉద్దేశంతో ఇలాంటి తాత్కాలిక గుడారాలను ఏర్పాటు చేసేవారు. మారుతున్న కాలానుగుణంగా హోటళ్ల సంఖ్య పెరగడం, దానికి తోడు ప్రయివేట్ విశ్రాంతి గదుల సంఖ్య పెరగడంతో పరిస్థితుల్లో మార్పులు వచ్చాయి. అయితే ముఖ్యంగా కశ్మీర్ సరిహద్దులతో పాటు దేశ సరిహద్దు ప్రాంతాల్లో సైనికులు విశ్రాంతి తీసుకోవడం కోసం ఇలా తాత్కాలిక గుడారాలు ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. ఇదే ఐడియాను ఉపయోగించి బీజేపీ మునుగోడులో తాత్కాలిక గూడారాలను ఏర్పాటు చేసింది. వీటి ద్వారా ఎక్కువ మందికి తక్కువ స్థలంలో వసతి ఏర్పాటు చేయడంతో పాటు తక్కువ ఖర్చుతో కూడా కూడుకున్నది. మరోవైపు చలికాలం కావడంతో ఈ తాత్కాలిక గూడారాల్లో నివాసం ఉండటం కొంచెం ఇబ్బందికరమే అయినప్పటికి చలి నుంచి తమను తాము కాపాడుకోవడానికి అవసరమైన కంబళ్లు, దుప్పుట్లు కూడా ఈ గూడారాల్లో ఏర్పాటు చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం చూడండి..