Gangula Kamalakar: తెలంగాణ ధాన్యం రైతులకు గుడ్ న్యూస్.. నవంబర్ 30 వరకు ఆ గడువు పెంపు..

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ సీఎంఆర్ (కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌) గడువు పెంపు విషయంలో చేసిన కృషి ఫలించింది.

Gangula Kamalakar: తెలంగాణ ధాన్యం రైతులకు గుడ్ న్యూస్.. నవంబర్ 30 వరకు ఆ గడువు పెంపు..
Gangula Kamalakar
Follow us

|

Updated on: Oct 26, 2022 | 1:34 PM

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ సీఎంఆర్ (కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌) గడువు పెంపు విషయంలో చేసిన కృషి ఫలించింది. నిరంతరం రాష్ట్ర రైతుల గురించి తపించే ప్రభుత్వ యంత్రాంగం.. రైతులకు లబ్ధి చేకూర్చేందుకు అనుక్షణం తపిస్తూనే ఉంటుందని మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. రైతుకు అనుకూల నిర్ణయాల కోసం సీఎం కేసీఆర్ చేసిన ప్రయత్నాలు ఫలించాయని మంత్రి గంగుల తెలిపారు. 2021-22 వానాకాలం బియ్యాన్ని సమర్పించేందుకు.. ఈ నవంబర్ 30 వరకు ఎఫ్సీఐ గడువును పెంచిందని గంగుల తెలిపారు. ఎఫ్‌సీఐ నిర్ణయంపై హర్షం వ్యక్తంచేస్తూ మంత్రి గంగుల బుధవారం ప్రకటన విడుదల చేశారు.

దీంతోపాటు గత యాసంగి బియ్యం బాయిల్డ్ గా తీసుకునేందుకు మరో నాలుగు లక్షల టన్నులకు అనుమతించిందని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. దీంతో గతంలో ఇచ్చిన ఎనిమిది లక్షలు టన్నులతో కలిసి మొత్తం 12 లక్షల మెట్రిక్ టన్నుల ఫోర్టిఫైడ్ బాయిల్డ్ రైస్ సేకరణకు మార్గం సుగమమైందన్నారు. తద్వారా రాష్ట్ర ఖజానాకు దాదాపు 180 కోట్లు ఆదా అవుతాయని మంత్రి గంగుల కమలాకర్ హర్షం వ్యక్తం చేశారు.

కాగా.. మంగళవారం ధాన్యం కొనుగోలుపై మాట్లాడిన గంగుల కమలాకర్.. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోళ్లు చేపడుతామని తెలిపారు. అందుకు అవసరమైన నిధులను ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇప్పటికే సమకూర్చారని చెప్పారు. వానాకాలం పంట సేకరణకు ప్రభుత్వం సిద్దంగా ఉందని.. దాదాపు 7,100కు పైగా కొనుగోలు కేంద్రాల ఏర్పాటు చేశామని తెలిపారు. అవసరమైతే మరో వందవరకు ఏర్పాటు చేసుకోవడానికి కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చామని తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..

కరీంనగర్ స్థానంపై కొనసాగుతున్న ఉత్కంఠ..!
కరీంనగర్ స్థానంపై కొనసాగుతున్న ఉత్కంఠ..!
30 ఏళ్ల వయస్సులో స్లిమ్‌ అవ్వాలంటే ఈ 6 అలవాట్లను అలవర్చుకోండి..
30 ఏళ్ల వయస్సులో స్లిమ్‌ అవ్వాలంటే ఈ 6 అలవాట్లను అలవర్చుకోండి..
క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ ఎందుకు తిరగబెడుతోంది..?
క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ ఎందుకు తిరగబెడుతోంది..?
సింపుల్‏గా దివంగత కమెడియన్ వివేక్ కూతురి పెళ్లి..
సింపుల్‏గా దివంగత కమెడియన్ వివేక్ కూతురి పెళ్లి..
టీబీ రోగుల్లో కనిపించని దగ్గు లక్షణం.. ఆందోళ చెందుతోన్ననిపుణులు
టీబీ రోగుల్లో కనిపించని దగ్గు లక్షణం.. ఆందోళ చెందుతోన్ననిపుణులు
పేరెంట్స్‌కి అలర్ట్‌.. కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశాలకు షెడ్యూల్‌.
పేరెంట్స్‌కి అలర్ట్‌.. కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశాలకు షెడ్యూల్‌.
జనంతో జగన్.. కొనసాగుతోన్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర..
జనంతో జగన్.. కొనసాగుతోన్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర..
మీ ఏంపీ అభ్యర్థి పూర్తి సమాచారం ఇలా తెలుసుకోండి!
మీ ఏంపీ అభ్యర్థి పూర్తి సమాచారం ఇలా తెలుసుకోండి!
శరీరంలో కనిపించే ఈ లక్షణాలు.. కిడ్నీల్లో రాళ్లకు సంకేతం కావొచ్చు.
శరీరంలో కనిపించే ఈ లక్షణాలు.. కిడ్నీల్లో రాళ్లకు సంకేతం కావొచ్చు.
బంగారం రా మా సాయి పల్లవి.. ఇంత మెచ్యురిటీ ఏంటమ్మా నీకు..
బంగారం రా మా సాయి పల్లవి.. ఇంత మెచ్యురిటీ ఏంటమ్మా నీకు..