Revanth Reddy: తడిబట్టలతో నేను రెడీ.. భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రమాణం చేద్దామా.. ఈటలకు రేవంత్ సవాల్..
మునుగోడు మంటలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. మునుగోడు ఎన్నికల్లో కాంగ్రెస్‌కు బీఆర్ఎస్ డబ్బులు పంపిందంటూ సంచలన ఆరోపణలు చేశారు బీజేపీ నేత, ఎమ్మెల్యే ఈటల రాజేందర్. బీఆర్ఎస్ నుంచి..
కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ(బీజేపీ) మధ్య చెలరేగిన మునుగోడు మంటలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. మునుగోడు ఎన్నికల్లో కాంగ్రెస్‌కు బీఆర్ఎస్ డబ్బులు పంపిందంటూ సంచలన ఆరోపణలు చేశారు బీజేపీ నేత, ఎమ్మెల్యే ఈటల రాజేందర్. బీఆర్ఎస్ నుంచి 25 కోట్ల రూపాయలు వచ్చాయన్నది జగమెరిగన సత్యమేనని అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ నాణానికి బొమ్మ బొరుసు లాంటివని.. ఎవరికి ఓటేసిన ఒకటే నంటూ విమర్శించారు ఈటల రాజేందర్. ఈటల చేసిన ఆరోపణలపై తీవ్రంగా స్పందించారు తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి. రేపు భాగ్యలక్ష్మి టెంపుల్ వద్ద ప్రమాణం చేద్దామా అంటూ ఈటలకు సవాల్ విసిరారు. తడిబట్టలతో ప్రమాణం చేసేందుకు తాను సిద్ధమన్నారు రేవంత్ రెడ్డి. మునుగోడు ఎన్నికల్లోనే కాదు, కె. చంద్రశేఖర్ రావు(కేసీఆర్) నుంచి అనా పైస కూడా ముట్టలేదని చెప్పుకొచ్చారు.
మునుగోడులో ఖర్చుచేసిన ప్రతి రూపాయి కాంగ్రెస్ కార్యకర్తలదే అని అన్నారు. రాజకీయాల కోసం ఈటల రాజేందర్ ఇంతలా దిగజారి మాట్లాడటం క్షమించరాని నేరమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఆరోపణలను ఈటల 24 గంటల్లో నిరూపించాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.
ఈటల రాజేందర్ ఏమన్నారంటే..
కాంగ్రెస్, బీఆర్ఎస్ వేర్వేరు కాదని.. ఎన్నికల ముందైనా.. తర్వాతైనా రెండు పార్టీలు కలుస్తాయని ఈటల రాజేందర్ అన్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సీఎం కేసీఆర్ రూ. 25 కోట్లు పంపించారన్నారు. పార్లమెంట్ ప్రవాస్ యోజనలో భాగంగా చేవేళ్ళ సభలో పాల్గొంటారని, దేశంలోని అన్ని పార్టీలకు ఎన్నికల ఖర్చు భరించేంత వేల కోట్లు ఎలా వచ్చాయో ముఖ్యమంత్రి చెప్పాలని ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. ఇదే అంశంపై పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఫైరయ్యారు. ఛాలెంజ్ విసిరారు.3
మరిన్ని తెలంగాణ వార్తల కోసం