AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Warangal: మెడికో ప్రీతిది ఆత్మహత్యే.. పోస్టుమార్టం రిపోర్ట్‌లో అదే తేలిందన్న వరంగల్‌ సీపీ

మెడికో ప్రీతిది ఆత్మహత్యే! పోస్టుమార్టం రిపోర్ట్‌లో అదే తేలిందన్నారు వరంగల్ పోలీస్ కమిషనర్ రంగనాథ్. విషం కారణంగానే ప్రీతి మరణించినట్టు రిపోర్ట్‌ వచ్చిందన్నారు. ప్రీతి శరీరంలో పాయిజన్ ఆనవాళ్లు దొరికాయన్నారు. ఇంజక్షన్‌ ద్వారానే పాయిజన్‌ తీసుకున్నట్టు భావిస్తున్నామన్నారు. ఆరోజు స్పాట్‌లో ఇంజక్షన్‌ దొరికింది కానీ నీడిల్‌ మిస్సైందన్నారు.

Warangal: మెడికో ప్రీతిది ఆత్మహత్యే.. పోస్టుమార్టం రిపోర్ట్‌లో అదే తేలిందన్న వరంగల్‌ సీపీ
Warangal Cp Ranganath
Sanjay Kasula
|

Updated on: Apr 21, 2023 | 7:04 PM

Share

వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీ మెడికల్ విద్యార్థిని ప్రీతి నాయక్‌ది ఆత్మహత్యే అని.. అయితే ఆమె ఆత్మహత్యకు కారణం మాత్రం సైఫ్‌ అని స్పష్టం చేశారు వరంగల్ పోలీస్ కమిషనర్ రంగనాథ్. ప్రీతి పోస్టుమార్టం నివేదికలో వచ్చిందని..ఈ రిపోర్ట్‌లో అదే తేలిందన్నారు. విషం కారణంగానే ప్రీతి మరణించినట్టు రిపోర్ట్‌ వచ్చిందన్నారు. ప్రీతి శరీరంలో పాయిజన్ ఆనవాళ్లు దొరికాయన్నారు. పాయిజన్ ఇంజెక్షన్ తీసుకొని ఆత్మహత్య చేసుకున్నదన్నారు. ఆత్మహత్య చేసుకున్న రోజు స్పాట్‌లో ఇంజక్షన్‌ దొరికిందన్నారు. కానీ నీడిల్‌ మిస్సైందన్నారు సీపీ రంగనాథ్.

త్వరలో ఛార్జిషీట్‌ దాఖలు చేస్తామన్నారు. ప్రీతి ఆత్మహత్యకు సైఫ్‌ ప్రధాన కారణమన్నారు. సైఫ్‌పై 306 సెక్షన్‌ కింద చర్యలు తీసుకుంటున్నామన్నారు. కేసు 99శాతం క్లియర్‌ అని వరంగల్‌ సీపీ రంగనాథ్‌ తేల్చి చెప్పారు. కొద్ది నెలల క్రితం కేఎంసీలో ప్రీతి ఆత్మహత్య ఘటన తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన విషయం తెలిసిందే. సీనియర్ విద్యార్థి సైఫ్ ఆమెను నెలల పాటు వేధించడంతో ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు గుర్తించారు.

ఇదిలావుంటే, మెడికో ప్రీతిది ఆత్మహత్యా కాదని.. హత్య చేశారని ఆమె తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, విపక్ష పార్టీల నేతలు ఆరోపిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్