Toll Plaza Rates: మొదలైన టోల్ బాదుడు.. పెరిగిన ఛార్జీల వివరాలు ఇలా..
దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై మళ్లీ టోల్(Toll Plaza) బాదుడు మొదలైంది. పెరిగిన ఛార్జీలు అర్థరాత్రి నుంచే టోల్ ప్లాజాల వద్ద అమలులోకి వచ్చాయి. వాహనం స్థాయిని బట్టి 10 నుంచి 90 రూపాయల వరకు పెంచారు. పెరిగిన ఛార్జీలతో వాహనదారులు..
దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై మళ్లీ టోల్(Toll Plaza) బాదుడు మొదలైంది. పెరిగిన ఛార్జీలు అర్థరాత్రి నుంచే టోల్ ప్లాజాల వద్ద అమలులోకి వచ్చాయి. వాహనం స్థాయిని బట్టి 10 నుంచి 90 రూపాయల వరకు పెంచారు. పెరిగిన ఛార్జీలతో వాహనదారులు లబోదిబోమంటున్నారు. జిల్లాల మీదుగా రాకపోకలు సాగించే వారికి సైతం టోల్ బాదుడు తప్పడం లేదు. పెరిగిన ధరలపై వాహనదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెరిగిన టోల్ ఛార్జీలతో(Toll Plaza Rates) వాహనదారులపై రోజుకు రెండు లక్షల రూపాయల అదనపు భారం పడనుంది. టోల్ బాదుడిపై లారీ యాజమాన్యాలు, నెలవారి పాసులు కలిగిన వాహనదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఏప్రిల్ 1నుంచి టోల్‌ప్లాజాల వద్ద చెల్లించే రుసుం గతంలో ఉన్నదాని కంటే భారీగా పెరిగినట్లు అధికారులు తెలిపారు. సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం కంకోల్ గ్రామ శివారులో గల డెక్కన్ టోల్‌ప్లాజాలో ఇవాళ్టి నుంచి పెరిగిన రుసుం అమల్లోకి వచ్చింది. ఫాస్టాగ్ ఉన్న వారు టోల్‌ప్లాజా నుంచి ఈజీగా రాకపోకలు సాగించవచ్చు.
టోల్‌ప్లాజా నుంచి ఛార్జీలు ఇలా..
- కారు, జీపు, వ్యాన్, లైట్‌మోటర్ వాహనాలకు ఒకవైపు రూ.105, రెండో సైడ్ రూ.160, ఫీ జిల్లా కమర్షియల్ వాహనాలకు ఒకసారి రాకపోకలు చెల్లించే రుసుం రూ.55, నెలసారి పాస్ ఒకసారి రాకపోకలు సాగించేందుకు రూ.3,520.
- లైట్ కమర్షియల్, లైట్ గూడ్స్, మినీ బస్ వాహనాలకు ఒక వైపు రూ.170, రెండో వైపు రూ.255, ఫీ జిల్లా కమర్షియల్ వాహనాలకు ఒకసారి రాకపోకలు సాగించేందుకు రూ.85. నెలసారి పాస్ ఒకసారి రాకపోకలు సాగించేందుకు రూ.5,685 పెరిగింది.
- బస్సు, ట్రాక్ ఒక వైపు రూ.355, రెండో వైపు రూ.535, ఫీ జిల్లా కమర్షియల్ వాహనాలకు ఒకసారి రాకపోకలు సాగించేందుకు రూ.180 పెరిగింది. నెలసారి పాస్ ఒకసారి రాకపోకలు సాగించేందుకు రూ.11,915.
- త్రీ యాక్సల్, కమర్షియల్ ట్యాక్స్ వాహనాలకు ఒక వైపు రూ.390, రెండో వైపు రూ.585, ఫీ జిల్లా కమర్షియల్ వాహనాలకు ఒకసారి రాకపోకలు సాగించేందుకు రూ.195. నెలసారి పాస్ ఒకసారి రాకపోకలు సాగించేందుకు రూ.13వేలు.
- హెవీ కస్టరుక్షన్ మెషినరీ ఒకవైపు రూ.560, రెండో వైపు రూ.840, ఫీ జిల్లా కమర్షియల్ వాహనాలకు ఒకసారి రాకపోకలు సాగించేందుకు రూ.280. నెలసారి పాస్ ఒకసారి రాకపోకలు సాగించేందుకు రూ.18,685.
- ఓవర్సిజెడ్ వాహనాలకు ఒక వైపు 680, రెండో వైపు రూ.1025, ఫీ జిల్లా కమర్షియల్ వాహనాలకు ఒకసారి రాకపోకలు సాగించేందుకు రూ.340. నెలసారి పాస్ ఒకసారి రాకపోకలు సాగించేందుకు రూ.22,750 పెంచినట్లు అధికారులు తెలిపారు.
ఈ పద్దతిలోనే టోల్ చెల్లింపులు ఇవాళ్టి నుంచి టోల్‌ప్లాజా వద్ద వాహనాదారులు రూసుము చెల్లించాల్సి ఉంటుందని టోల్‌ప్లాజా సిబ్బంది తెలిపారు.
ఇవి కూడా చదవండి: Rahul Gandhi: ముందస్తు ఎన్నికలు వస్తున్నాయి.. రాహుల్ పర్యటనలో ఆంతర్యం అదే..