Telangana: పండుగ శుభాకాంక్షల పేరుతో ప్రచారాలు.. పాలమూరులో పొలిటికల్ ట్రెండ్.

పాలమూరు ఎంపీ స్థానంలో పోటీ చేసేందుకు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మూడు ప్రధాన పార్టీల నుంచి నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక్కో పార్టీ నుంచి దాదాపుగా ముగ్గురు నేతలు టికెట్ కోసం కుస్తీ పడుతున్నారు. కాంగ్రెస్ నుంచి వంశీచంద్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సీతాదయాకర్ రెడ్డితో పాటు మరొకరి పేరు బలంగా వినిపిస్తున్నాయి. అటూ బీజేపీ నుంచి డీకే అరుణతో పాటు, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, రాష్ట్ర కోశాధికారి శాంతకుమార్ అశావాహుల జాబితాలో ఉన్నారు.

Telangana: పండుగ శుభాకాంక్షల పేరుతో ప్రచారాలు.. పాలమూరులో పొలిటికల్ ట్రెండ్.
Telangana Leadres
Follow us

| Edited By: Surya Kala

Updated on: Jan 11, 2024 | 9:05 PM

పాలమూరు జిల్లాలో పార్లమెంట్ ఎన్నికల హడావిడి మొదలైంది. ఓ వైపు టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్న నేతలు మరోవైపు ప్రజల్లోకి వెళ్లే ప్రణాళికల్లో మునిగిపోయారు. ఇప్పటి నుంచే ప్రజల అటెన్షన్ ను తమవైపు తిప్పుకునేందుకు ప్లాన్ చేస్తున్నారు. సంక్రాంతి పండుగను దృష్టిలో ఉంచుకొని శుభాకాంక్షల పేరుతో అప్పుడే ప్రచారాలు మొదలుపెట్టారు. అసెంబ్లీ ఎన్నికల ముగిసి ఇంకా నెల రోజులు కూడా కాకముందే పాలమూరు జిల్లాలో పార్లమెంట్ ఎన్నికల వేడి రాజుకుంటోంది. మహబూబ్ నగర్ పార్లమెంట్ సెగ్మెంట్ పై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డికే అరుణ, కాంగ్రెస్ సీడబ్ల్యూసీ ప్రత్యేక అహ్వానిత సభ్యుడు వంశీచంద్ రెడ్డిలు ఆయా పార్టీలనుంచి బరిలో దిగేందుకు పావులు కదుపుతున్నారు.

ఒక్కో పార్టీ నుంచి ముగ్గురు నేతల పోటి:

పాలమూరు ఎంపీ స్థానంలో పోటీ చేసేందుకు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మూడు ప్రధాన పార్టీల నుంచి నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక్కో పార్టీ నుంచి దాదాపుగా ముగ్గురు నేతలు టికెట్ కోసం కుస్తీ పడుతున్నారు. కాంగ్రెస్ నుంచి వంశీచంద్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సీతాదయాకర్ రెడ్డితో పాటు మరొకరి పేరు బలంగా వినిపిస్తున్నాయి. అటూ బీజేపీ నుంచి డీకే అరుణతో పాటు, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, రాష్ట్ర కోశాధికారి శాంతకుమార్ అశావాహుల జాబితాలో ఉన్నారు. ఇక బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ కే మళ్లీ సీటు ఇస్తారా లేక అభ్యర్థిని మార్చుతారా అంశంపై చర్చలు కొనసాగుతున్నాయి. ఇటీవలే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన నేతలు ఎంపీగా పోటీ చేసేందుకు అసక్తి చూపుతున్నట్లు సమాచారం.

పండుగ శుభాకాంక్షల పేరుతో ప్రచారాలు:

ఓవైపు టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తునే మరోవైపు పార్లమెంట్ సెగ్మెంట్ లో పట్టుకోసం ప్రయత్నాలు చేస్తున్నారు నేతలు. ఈ అంశంలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, కాంగ్రెస్ నేత వంశీచంద్ రెడ్డి ముందువరుసలో ఉన్నారు. ఇప్పటికే డీకే అరుణ పార్లమెంట్ పరిధిలోని ఆయా నియోజకవర్గాల ముఖ్య నేతలను కలుస్తూ ఎన్నికలకు సన్నధం చేస్తున్నారని తెలిసింది. దీనికి తోడు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో డీకే అరుణ, వంశీచంద్ రెడ్డిలు వేరువేరుగా ఫ్లెక్సీలు, పోస్టర్లు హాట్ టాపిక్ గా మారాయి. ఈ ఇద్దరు నేతలు సంక్రాంతి పండుగ శుభాకాంక్షల పేరుతో అప్పుడే ప్రచారాలకు, ప్రజలను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

అలెర్ట్ అయిన ఆశావహ నేతలు:

ఈ రెండు ప్రధాన పార్టీల కీలక నేతల ప్లెక్సీలు, పోస్టర్లపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చలు నడుస్తున్నాయి. ఓవైపు టికెట్ ప్రయత్నాలు, మరోవైపు పరోక్షంగా ప్రచారాన్ని ప్రారంభించారని మిగిలిన నేతలు అలర్ట్ అయ్యారు. దీంతో టికెట్ ఆశావహులు ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నట్లు తెలిసింది. అవసరమైతే ఢిల్లీ వెళ్లీ జాతీయ నాయకత్వాన్ని కలిసే యోచనలో కాంగ్రెస్, బీజేపీ పార్టీ టికెట్ అశావహులు ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది.

అసెంబ్లీ ఎన్నికల వేడి ఇంకా పూర్తిగా చల్లారక ముందే పాలమూరు జిల్లాలో పార్లమెంట్ ఎన్నికల హీట్ కాక పుట్టిస్తోంది. ఓవైపు టికెట్ ప్రయత్నాలు చేస్తునే, మరోవైపు ప్రచారాన్ని ట్రాక్ ఎక్కిస్తున్నారు నేతలు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

డయాబెటిస్‌ రోగులు బంగాళా దుంపలు తినొచ్చా? తినకూడదా?
డయాబెటిస్‌ రోగులు బంగాళా దుంపలు తినొచ్చా? తినకూడదా?
తిరుమలలో వెలసిన డిక్లరేషన్‌ బోర్డులు జగన్‌ పర్యటన రద్దుతోతొలగింపు
తిరుమలలో వెలసిన డిక్లరేషన్‌ బోర్డులు జగన్‌ పర్యటన రద్దుతోతొలగింపు
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు..
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు..
రా మచ్చ మచ్చ అంటున్న రామ్ చరణ్.! థియేటర్స్ షేకే..
రా మచ్చ మచ్చ అంటున్న రామ్ చరణ్.! థియేటర్స్ షేకే..
వేగంగా బరువు తగ్గాలంటే ఆ ఆహారాలకు దూరంగా ఉండాల్సిందే..
వేగంగా బరువు తగ్గాలంటే ఆ ఆహారాలకు దూరంగా ఉండాల్సిందే..
మహేష్ పక్కన ఉన్న ఈ అమ్మాయి గుర్తుందా.? ఇప్పుడీమె అందం చూస్తే
మహేష్ పక్కన ఉన్న ఈ అమ్మాయి గుర్తుందా.? ఇప్పుడీమె అందం చూస్తే
కంగనా కు షాక్.! ఎమర్జెన్సీ సినిమాపై బాంబే హైకోర్టులో విచారణ.!
కంగనా కు షాక్.! ఎమర్జెన్సీ సినిమాపై బాంబే హైకోర్టులో విచారణ.!
ఉజ్జయినిలో వర్షం బీభత్సం కూలిన ఆలయ గోడ ఇద్దరు భక్తులు మృతి
ఉజ్జయినిలో వర్షం బీభత్సం కూలిన ఆలయ గోడ ఇద్దరు భక్తులు మృతి
మీకూ గోర్లు కొరికే అలవాటు ఉందా? అయితే ఈ విషయం తెలుసుకోండి
మీకూ గోర్లు కొరికే అలవాటు ఉందా? అయితే ఈ విషయం తెలుసుకోండి
గుట్టలాంటి పొట్టను కరిగించే స్పెషల్ టీ.. ఎలా తయారు చేయాలంటే
గుట్టలాంటి పొట్టను కరిగించే స్పెషల్ టీ.. ఎలా తయారు చేయాలంటే
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు..
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు..
కెమెరాలు తీసుకుని బయటకు నడవండి.! మీడియాపై సైనికుల దాడి.
కెమెరాలు తీసుకుని బయటకు నడవండి.! మీడియాపై సైనికుల దాడి.
ఆ ఎయిర్‌పోర్ట్‌ యమ డేంజర్.! 50 మంది పైలట్లు మాత్రమే ల్యాండింగ్‌..
ఆ ఎయిర్‌పోర్ట్‌ యమ డేంజర్.! 50 మంది పైలట్లు మాత్రమే ల్యాండింగ్‌..
హైదారాబాద్ లో భారీ చోరీ! తాళం పగలగొట్టి రూ.2 కోట్లు ఎత్తుకెళ్లారు
హైదారాబాద్ లో భారీ చోరీ! తాళం పగలగొట్టి రూ.2 కోట్లు ఎత్తుకెళ్లారు
లెబనాన్‌ ఘటనపై ఎక్స్‌లో వెల్లడించిన ఇజ్రాయెల్‌.! ఆ ముగ్గురు తప్ప!
లెబనాన్‌ ఘటనపై ఎక్స్‌లో వెల్లడించిన ఇజ్రాయెల్‌.! ఆ ముగ్గురు తప్ప!
30 ముక్కలుగా నరికి ఫ్రిడ్జ్‌‌లో దాచిపెట్టిన హంతకుడు.! 8 బృందాలు..
30 ముక్కలుగా నరికి ఫ్రిడ్జ్‌‌లో దాచిపెట్టిన హంతకుడు.! 8 బృందాలు..
అది మనుషుల ఆస్పత్రా.. కుక్కల డెన్నా.? ఆస్పత్రిలో కుక్కల గుంపు..
అది మనుషుల ఆస్పత్రా.. కుక్కల డెన్నా.? ఆస్పత్రిలో కుక్కల గుంపు..
గ్రీన్‌ కార్డ్‌ హోల్డర్స్‌కు గుడ్‌న్యూస్‌.! కార్డ్‌ వ్యాలిడిటీ..
గ్రీన్‌ కార్డ్‌ హోల్డర్స్‌కు గుడ్‌న్యూస్‌.! కార్డ్‌ వ్యాలిడిటీ..
పింఛన్‌దారులకు శుభవార్త.! ఇకపై ఇంటి నుంచే లైఫ్‌ సర్టిఫికెట్‌..
పింఛన్‌దారులకు శుభవార్త.! ఇకపై ఇంటి నుంచే లైఫ్‌ సర్టిఫికెట్‌..
క్లాస్‌లో లెక్చరర్‌ పాఠాలు చెప్తుండగా షాక్.! భయంతో స్టూడెంట్స్‌.!
క్లాస్‌లో లెక్చరర్‌ పాఠాలు చెప్తుండగా షాక్.! భయంతో స్టూడెంట్స్‌.!