Telangana: తప్పులున్నా డోంట్ వర్రీ.. ప్రజాపాలన దరఖాస్తుల డేటా ఎంట్రీపై రేవంత్ సర్కార్ కీలక ఆదేశాలు

తెలంగాణలోని రేవంత్ రెడ్డి సర్కార్ అభయహస్తం ఆరు గ్యారెంటీల అమలుకు దృష్టిసారించింది. ఈ మేరకు ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించి.. దరఖాస్తులను స్వీకరించింది. రాష్ట్రవ్యాప్తంగా కోటికి పైగానే దరఖాస్తులొచ్చాయి. జనవరి ఆరున ఈ కార్యక్రమం ముగిసిన నాటి నుంచి ప్రజాపాలన దరఖాస్తుల డేటా ఎంట్రీ ప్రక్రియ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతోంది.

Telangana: తప్పులున్నా డోంట్ వర్రీ.. ప్రజాపాలన దరఖాస్తుల డేటా ఎంట్రీపై రేవంత్ సర్కార్ కీలక ఆదేశాలు
Praja Palana
Follow us

|

Updated on: Jan 11, 2024 | 9:48 PM

తెలంగాణలోని రేవంత్ రెడ్డి సర్కార్ అభయహస్తం ఆరు గ్యారెంటీల అమలుకు దృష్టిసారించింది. ఈ మేరకు ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించి.. దరఖాస్తులను స్వీకరించింది. రాష్ట్రవ్యాప్తంగా కోటికి పైగానే దరఖాస్తులొచ్చాయి. జనవరి ఆరున ఈ కార్యక్రమం ముగిసిన నాటి నుంచి ప్రజాపాలన దరఖాస్తుల డేటా ఎంట్రీ ప్రక్రియ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో ప్రజాపాలనలో స్వీకరించిన దరఖాస్తుల్లో తప్పులుంటే సరిచేసిన తరువాతే వాటిని ఆన్‌లైన్‌లో ఎంట్రీ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశించారు. దరఖాస్తుల్లో తప్పులు ఉన్నంత మాత్రన పక్కన పెట్టొద్దని.. తప్పులుంటే దరఖాస్తుదారులకు ఫోన్ చేసి వివరాలను సేకరించాలని సూచించారు. అన్ని డీటేల్స్ తీసుకోన్న తర్వాతే ఆన్లైన్ లో డేటా ఎంట్రీ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించినట్లు కాంగ్రెస్ నేత కస్తూరి నరేందర్ తెలిపారు.

ధరణి సమస్యలపై ఫోకస్..

ధరణి కారణంగా ఏర్పడిన సమస్యలు పరిష్కరించేందుకు కసరత్తు మొదలైంది. భూ సమస్యల పరిష్కారానికి ధరణి పోర్టల్‌పై ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కమిటీ తొలి సమావేశం జరిగింది. రాష్ట్ర ప్రజలు, రైతాంగం ధరణి పోర్టల్ ద్వారా చాలా ఇబ్బంది పడ్డారని కమిటీ సభ్యుడు, కాంగ్రెస్ సీనియర్ నేత కోదండరెడ్డి అన్నారు. ఆన్‌లైన్‌లో చాలా భూములు ఎంటర్ కాలేదని.. ఈ కారణంగా పలువురికి ప్రభుత్వ పధకాలు అందలేదని అన్నారు. సన్నకారు చిన్నకారు రైతులు భూమి అమ్ముకోవడానికి ఇబ్బందిపడ్డారని తెలిపారు.

ధరణిలో మార్పులు చేర్పులు చేస్తామని గతంలోనే సీఎం రేవంత్ రెడ్డి చెప్పారని కోదండరెడ్డి తెలిపారు. వేగంగా సమస్య పరిష్కారం కోసం కమిటీ వేశారని.. గతంలో జరిగిన తప్పులు పునరావృతం కాకుండా అడుగులు వేస్తామని అన్నారు. ఇప్పటికే డేటాను సేకరించామని.. త్వరలోనే దీనిపై ప్రభుత్వానికి సూచనలు చేస్తామని కమిటీ సభ్యులు తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

మహేశ్, ప్రభాస్‌లతో సినిమాలు చేసిన ఈ చిన్నారిని గుర్తు పట్టారా?
మహేశ్, ప్రభాస్‌లతో సినిమాలు చేసిన ఈ చిన్నారిని గుర్తు పట్టారా?
కోనసీమలో కూలీల కొరత.. కలకత్తా నుంచి రప్పించుకుంటున్న రైతన్నలు
కోనసీమలో కూలీల కొరత.. కలకత్తా నుంచి రప్పించుకుంటున్న రైతన్నలు
ఢిల్లీలో కేంద్ర మంత్రులతో చంద్రబాబు భేటీ
ఢిల్లీలో కేంద్ర మంత్రులతో చంద్రబాబు భేటీ
పిల్లలకు స్కూల్లో పిచ్చిపిచ్చిగా హెయిర్ కట్ చేసిన టీచర్.. తర్వాత
పిల్లలకు స్కూల్లో పిచ్చిపిచ్చిగా హెయిర్ కట్ చేసిన టీచర్.. తర్వాత
పాన్‌కార్డు పేరుతో భారీ స్కామ్.. చెక్ చేసుకోండి లేకుంటే..
పాన్‌కార్డు పేరుతో భారీ స్కామ్.. చెక్ చేసుకోండి లేకుంటే..
ఈవీ కార్ల తయారీ ప్రక్రియ ఆపేసిన ఓలా ఎలక్ట్రిక్‌…!
ఈవీ కార్ల తయారీ ప్రక్రియ ఆపేసిన ఓలా ఎలక్ట్రిక్‌…!
యష్ సినిమాలో నేను నటించడం లేదు.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్
యష్ సినిమాలో నేను నటించడం లేదు.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్
మటన్ ముసుగులో కుక్కమాంసం విక్రయాలు? ఎక్కడంటే
మటన్ ముసుగులో కుక్కమాంసం విక్రయాలు? ఎక్కడంటే
సినిమాల్లేకపోయిన అందాలు చాలవ.! సోకులతో కవ్విస్తున్న పూజ హెగ్డే..
సినిమాల్లేకపోయిన అందాలు చాలవ.! సోకులతో కవ్విస్తున్న పూజ హెగ్డే..
ప్రశాంత్ వర్మ డైరెక్షన్‌లో పట్టాలెక్కిన నందమూరి మోక్షజ్ఞ మూవీ..
ప్రశాంత్ వర్మ డైరెక్షన్‌లో పట్టాలెక్కిన నందమూరి మోక్షజ్ఞ మూవీ..