AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: కాంగ్రెస్‌ నేతలు నోటికి ఏది వస్తే అది హామీ ఇచ్చారు- కేటీఆర్

కాంగ్రెస్‌ అబద్ధాల ముందు అభివృద్ధి ఓడిపోయిందన్నారు కేటీఆర్. ప్రజలు బీఆర్ఎస్‌ను పూర్తిగా తిరస్కరించలేదని.. ఎవరూ నిరుత్సాహపడొద్దని గులాబీ నేతలకు సూచించారు. రైతుబంధుపై మంత్రులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి.. గందరగోళానికి గుర్తిచేస్తున్నారన్నారు నిరంజన్‌ రెడ్డి.

Telangana: కాంగ్రెస్‌ నేతలు నోటికి ఏది వస్తే అది హామీ ఇచ్చారు- కేటీఆర్
KTR
Ram Naramaneni
|

Updated on: Jan 11, 2024 | 10:10 PM

Share

లోక్‌సభ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి పెట్టిన బీఆర్ఎస్‌ పార్టీ వరుస సమావేశాలు నిర్వహిస్తోంది. పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అధ్యక్షతన హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఈ సమీక్షలు కొనసాగుతున్నాయి. మహబూబాబాద్‌ సెగ్మెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహంపై నేతలకు బీఆర్ఎస్ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ దిశానిర్దేశం చేశారు.

పనుల కంటే ప్రచారంపై ఫోకస్‌ చేసుంటే గెలిచేవాళ్లమన్నారు కేటీఆర్. మనం చేసిన పనిని కూడా చెప్పుకోవడంలో విఫలమయ్యామన్నారు. కాంగ్రెస్‌ నేతలు నోటికి ఏది వస్తే ఆ హామీ ఇచ్చారని.. తప్పుడు ప్రచారాన్నే ప్రజలు నమ్మారన్నారు. కాంగ్రెస్‌ అబద్ధాల ముందు అభివృద్ధి ఓడిపోయిందన్నారు. ప్రజలు బీఆర్ఎస్‌ను పూర్తిగా తిరస్కరించలేదని.. ఎవరూ నిరుత్సాహపడొద్దని సూచించారు కేటీఆర్. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ మధ్య ఓట్ల తేడా 1.85 శాతమే ఉందన్నారు.

అధికారంలో ఉన్నప్పుడు పార్టీ నిర్మాణంపై దృష్టి పెట్టలేకపోయామన్నారు మాజీ మంత్రి సత్యవతి రాథోడ్. ప్రజలు అడిగినవి, అడగని పథకాలు అమలు చేసినా.. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే ఇంకేదో ఇస్తుందని ప్రజలు ఆశపడ్డారన్నారు. కానీ పార్లమెంట్ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురుతుందన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం భయపడుతోందని విమర్శించారు.

ప్రభుత్వ పెద్దలు ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదన్నారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. రైతుబంధు అందరికి వచ్చిందని డిప్యూటీ సీఎం చెప్తుంటే.. సంక్రాంతి తర్వాత రైతుబంధు ఇస్తామని వ్యవసాయ శాఖ మంత్రి చెప్తున్నారన్నారు. మంత్రులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి రైతులను గందరగోళానికి గురి చేస్తున్నారన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి