Telangana: తెలంగాణ జిల్లాలో కొనసాగుతున్న అవిశ్వాసాల పర్వం.. రాజకీయ సమీకరణాలు మార్పుకు కారణం ఇదే..
రాష్ట్రంలో అధికారం మారడంతో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. బీఆర్ఎస్ కౌన్సిలర్లు, జెడ్పీటీసీలు తమ పదవులకు రాజీనామా చేసి కాంగ్రెస్ గూటికి చేరుతున్నారు. ప్రతి జిల్లాలో అవిశ్వాస తీర్మానాలతో రాజకీయం వేడెక్కింది. పెద్దపెల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధుపై అవిశ్వాసం కత్తి వేలాడుతోంది. రెండు, మూడు రోజుల్లో అవిశ్వాస తీర్మానానికి సిద్ధమవుతున్నారు జెడ్పీటీసీలు.
రాష్ట్రంలో అధికారం మారడంతో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. బీఆర్ఎస్ కౌన్సిలర్లు, జెడ్పీటీసీలు తమ పదవులకు రాజీనామా చేసి కాంగ్రెస్ గూటికి చేరుతున్నారు. ప్రతి జిల్లాలో అవిశ్వాస తీర్మానాలతో రాజకీయం వేడెక్కింది. పెద్దపెల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధుపై అవిశ్వాసం కత్తి వేలాడుతోంది. రెండు, మూడు రోజుల్లో అవిశ్వాస తీర్మానానికి సిద్ధమవుతున్నారు జెడ్పీటీసీలు. గత ఏడాది డిసెంబర్ 28న జరగాల్సిన స్టాండింగ్ కమిటీ మీటింగ్‌కు మెజార్టీ జెడ్పీటీసీలు డుమ్మా కొట్టారు. అయితే నిన్న ఎన్టీపీసీలో జరగాల్సిన జెడ్పీ సర్వ సభ్య సమావేశం కూడా కోరం లేక వాయిదా పడింది. దీంతో ఉత్కంఠ నెలకొంది.
గత ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి 11 మంది జెడ్పీటీసీలు, కాంగ్రెస్ నుంచి ఇద్దరు గెలిచారు. ఇటీవలే బీఆర్ఎస్‌ను వీడి జెడ్పీటీసి కందుల సంధ్యారాణి బీజేపీలో చేరగా.. ఓదెల జెడ్పీటీసి గంటా రాములు కాంగ్రెస్‌ను వీడి బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. మెజార్టీ సభ్యుల అసమ్మతితో అవిశ్వాసానికి రంగం సిద్ధమైంది. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపాలిటీలో 21 మంది కౌన్సిలర్లు బీఆర్ఎస్ పార్టీకి గుడ్‌బై చెప్పారు. మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తీరును వ్యతిరేకిస్తూ పార్టీకి రాజీనామా చేశారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు లైన్ క్లియర్ చేసుకున్నారు. కాంగ్రెస్‌లో చేరిన ఛైర్‌పర్సన్ జక్కుల శ్వేతకే మద్దతు తెలపాలని బీఆర్ఎస్ కౌన్సిలర్లు డిసైడ్ అయ్యారు. దీంతో అవిశ్వాస తీర్మానం వీగిపోనుంది.
ఖమ్మం డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణంపై 11 మంది సొసైటీ డైరెక్టర్లు అవిశ్వాసం తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. వి.వెంకటాయపాలెం సొసైటీ ఛైర్మన్‌గా కొనసాగుతున్నారు కూరాకుల నాగభూషణం. సహకార శాఖ అధికారికి అవిశ్వాస తీర్మాన లేఖను అందజేశారు. సహకార సంఘం చట్టం ప్రకారం సహకార సంఘంలో ఉన్న సభ్యులకు నోటీసులు ఇచ్చి సొసైటీ ఛైర్మన్ ఎన్నికలు నిర్వహిస్తామన్నారు విజయ కుమారి. రాష్ట్రంలో అధికారం మారడంతో రోజుకో జిల్లాలో అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెడుతున్నారు. దీంతో లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ రాకముందే రాష్ట్రంలో పొలిటికల్ హీట్ పెరిగింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..