Hyderabad: స్వచ్ఛ సర్వేక్షణ్‌లో తెలుగు రాష్ట్రాలకు అవార్డుల పంట.. హైదరాబాద్‌తో సహా టాప్-10లో ఉన్న నగరాలివే
సర్వేక్షణ్ అవార్డుల్లో తెలుగు రాష్ట్రాల పంట పండింది. క్లీన్ నగరాల జాబితాలో టాప్ టెన్‌లో ఏపీ, తెలంగాణకు చెందిన నగరాలను అవార్డులు వరించాయి. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నగరం మరోసారి సత్తా చాటింది. 2023 సంవత్సరానికి గానూ దేశంలోనే అత్యంత పరిశుభ్ర నగరాల జాబితాలో తొలి స్థానం దక్కించుకుంది.
సర్వేక్షణ్ అవార్డుల్లో తెలుగు రాష్ట్రాల పంట పండింది. క్లీన్ నగరాల జాబితాలో టాప్ టెన్‌లో ఏపీ, తెలంగాణకు చెందిన నగరాలను అవార్డులు వరించాయి. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నగరం మరోసారి సత్తా చాటింది. 2023 సంవత్సరానికి గానూ దేశంలోనే అత్యంత పరిశుభ్ర నగరాల జాబితాలో తొలి స్థానం దక్కించుకుంది. దీంతో స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డుల్లో వరుసగా ఏడోసారి తొలిస్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ ఏడాది ఇండోర్‌తో పాటు గుజరాత్‌లోని సూరత్ కూడా సంయుక్తంగా తొలి ర్యాంక్ దక్కించుకుంది. నవీ ముంబయి ఈ జాబితాలో మూడో స్థానంలో నిలిచింది. ఇక టాప్ టెన్‌లో తెలుగు రాష్ట్రాలకు చెందిన నగరాలకు అవార్డులు దక్కాయి. విశాఖకు నాలుగో స్థానం, విజయవాడకు ఆరో స్థానం, తిరుపతికి ఎనిమిదో స్థానం, హైదరాబాద్‌కు తొమ్మిదో స్థానం దక్కింది.
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము గురువారం ఈ అవార్డులను ప్రదానం చేశారు. దేశవ్యాప్తంగా ఏప్రిల్ 2022 నుంచి మార్చి 2023 వరకు 4 వేల 416 పట్టణాల్లో పరిశుభ్రతపై ప్రజల అవగాహన, భాగస్వామ్యం అంశాలపై అధ్యయం చేశారు. ఇందుకోసం సర్వీస్ లెవల్, సర్టిఫికేషన్, సిటిజన్ వాయిస్ వంటి మూడు ప్రామాణిక అంశాల్లో 9,500 మార్కులకు గాను 8 వేల 601 మార్కులు సాధించి దేశంలో 9వ స్థానంలో నిలిచింది హైదరాబాద్. అంతే కాకుండా చెత్త రహిత నగరాల్లో 5 స్టార్ హోదా సంపాదించుకుంది. రాష్ట్రంలో స్వచ్ఛ నగరం తెలంగాణలో తొలి 5 స్టార్ రేటింగ్ పొందిన నగరంతో పాటు వాటర్ సిటీగా ధృవీకరించారు. స్వచ్చభారత్ మిషన్-అర్బన్‌లో భాగంగా కేంద్రం ప్రతి ఏటా కేంద్రం ఈ అవార్డులు ఇస్తుంది.
స్వచ్చ సర్వేక్షన్ అవార్డుల ప్రదానోత్సవం..
Speaking at the Swachh Survekshan awards event in New Delhi, President Droupadi Murmu said that if we deeply understand the concept of value from waste, it becomes clear that everything is valuable and nothing is waste.https://t.co/l5hs7J7Vmb pic.twitter.com/goP4l8zTyw
— President of India (@rashtrapatibhvn) January 11, 2024
జాబితాలో హైదరాబాద్ తో పాటు..
Great achievement by GHMC. The Corporation received the following 5 National Awards under Swachh Survekshan-2023 1. 9th Clean City in India 2. 5 Star rated Garbage Free City in India 3. Clean city in Telangana 4. First 5 Star rated city in Telangana (Population > 1 lakh)… pic.twitter.com/eFunRKaO6o
— Commissioner GHMC (@CommissionrGHMC) January 11, 2024
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..