AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: వార్నీ.. ఇదేం కొట్టుకున్నాడు తల్లీ..! బస్సులో సీటు కోసం ఆడవాళ్ల సిగపట్లు.. ఆ జుట్టు ఉందో… ఊడిందో!

నిజామాబాద్ నుంచి భైంసా వస్తున్న ఆర్టీసీ బస్సు గురువారం మధ్యాహ్నం ముథోల్ కు చేరుకుంది. కొన్ని సీట్లు ఖాళీ కాగా అప్పటికే రెండు బస్సులు చెడిపోవడంతో అందులోని ప్రయాణికులు ఈ బస్సులోకి ఎక్కారు. ముథోల్లో ఎక్కిన కొందరు మహిళలు సీటు ఆపగా అప్పటికే బస్సులోని మహిళలకు..వీరికి ఆ సీటు కోసం కొట్లాట జరిగింది. కండక్టర్ చెబుతున్నప్పటికీ మహిళలు వినిపించుకోలేదు. బస్సులో ఉన్న మరికొందరు ప్రయాణికులు ఇదంతా వీడియోలు తీశారు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్‌ గా మారింది.

Viral Video: వార్నీ.. ఇదేం కొట్టుకున్నాడు తల్లీ..! బస్సులో సీటు కోసం ఆడవాళ్ల సిగపట్లు.. ఆ జుట్టు ఉందో... ఊడిందో!
Fight In Bus
Jyothi Gadda
|

Updated on: Jan 12, 2024 | 11:42 AM

Share

తెలంగాణ RTC బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించటంతో రద్దీ బాగా పెరిగింది. అసలే పండగ సీజన్‌.. సంక్రాంతి పండగన నేపథ్యంలో ప్రజలు తమ సొంతూళ్లకు పయనమవుతున్నారు. ఈ క్రమంలోనే పలుచోట్ల ఆర్టీసీ బస్సుల్లో సీట్ల కోసం మహిళలు సిగపట్లకు దిగుతున్నారు. తాజాగా నిర్మల్ జిల్లా ముథోల్ మండల కేంద్రంలో ఆర్టీసీ బస్సులో మహిళలు గొడవపడ్డారు. ముధోల్ మండల కేంద్రంలోని బస్టాండ్ లో భైంసా నుంచి మహారాష్ట్రలోని ధర్మాబాద్ వెళ్లే ఆర్టీసీ బస్సులో మహిళలు సీట్ల కోసం సిగలు పట్టుకుని కుమ్ముకున్నారు. సీటు కోసం ఆడవాళ్లు దారుణంగా కొట్లాడుకున్న దృశ్యాలు వైరల్ గా మారాయి.

నిజామాబాద్ నుంచి భైంసా వస్తున్న ఆర్టీసీ బస్సు గురువారం మధ్యాహ్నం ముథోల్ కు చేరుకుంది. కొన్ని సీట్లు ఖాళీ కాగా అప్పటికే రెండు బస్సులు చెడిపోవడంతో అందులోని ప్రయాణికులు ఈ బస్సులోకి ఎక్కారు. ముథోల్లో ఎక్కిన కొందరు మహిళలు సీటు ఆపగా అప్పటికే బస్సులోని మహిళలకు..వీరికి ఆ సీటు కోసం కొట్లాట జరిగింది. కండక్టర్ చెబుతున్నప్పటికీ మహిళలు వినిపించుకోలేదు. బస్సులో ఉన్న మరికొందరు ప్రయాణికులు ఇదంతా వీడియోలు తీశారు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్‌ గా మారింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..