Telanagana: 14 ఏళ్ల మమకారం.. గుండెల్ని పిండేసే బాధ.. మూగజీవికి అంత్యక్రియలు నిర్వహించిన రైతు కుటుంబం..

వ్యవసాయం చేసేవారు పశువులను కూడా తమ కుటుంబసభ్యుల్లా భావించి ప్రేమిస్తుంటారు. అలా తాను అల్లారు ముద్దుగా ప్రాణానికి ప్రాణంగా పెంచుకున్న ఎద్దు చనిపోవడాన్ని ఆ రైతు కుటుంబం తట్టుకోలేకపోయింది. దానికి సంప్రదాయ పద్ధతిలో అంతిమ సంస్కారాలు నిర్వహించి మమకారాన్ని చాటుకుంది.

Telanagana: 14 ఏళ్ల మమకారం.. గుండెల్ని పిండేసే బాధ.. మూగజీవికి అంత్యక్రియలు నిర్వహించిన రైతు కుటుంబం..
Ox Funeral

Updated on: Apr 08, 2023 | 9:42 AM

వ్యవసాయం చేసేవారు పశువులను కూడా తమ కుటుంబసభ్యుల్లా భావించి ప్రేమిస్తుంటారు. అలా తాను అల్లారు ముద్దుగా ప్రాణానికి ప్రాణంగా పెంచుకున్న ఎద్దు చనిపోవడాన్ని ఆ రైతు కుటుంబం తట్టుకోలేకపోయింది. దానికి సంప్రదాయ పద్ధతిలో అంతిమ సంస్కారాలు నిర్వహించి మమకారాన్ని చాటుకుంది. మహబూబ్‌నగర్ జిల్లా అంబటిపల్లి గ్రామంలో తిరుపతయ్య అనే రైతుకు చెందిన బసవేశ్వర అనే ఎద్దు 14 సంవత్సరాలగా తనతోనే ఉంటుంది. అయితే కొన్ని రోజులు దాని ఆరోగ్యం బాగోవడం లేదు. దీంతో ఆసుప్రతిలో చేర్పించాడు..పరిస్థితి విషమించి ఆ ఎద్దు చనిపోయింది. దీంతో చిన్నప్పటి నుంచి పెంచిన కుటుంబ సభ్యులు దాని మరణాన్ని జిర్ణించుకోలేకపోయారు…

తమ నుంచి దూరమైన ఆ బసవేశ్వరకి అంతిమ సంస్కారాలను మనుషులతో సమానంగా నిర్వహించారు. వారితో పాటు ఊరు ఊరంతా కదిలి వచ్చింది. గ్రామంలోని స్మశాన వాటిక వరకు అంతిమయాత్ర నిర్వహించారు. అంతిమయాత్ర వాహనానికి డీజే సౌండ్‌ బాక్స్‌లతో ఊరేగింపుగా తీసుకెళ్లారు. చివరగా స్మశానంలో ఖననం చేసి నివాళులర్పించారు. జంతువుల పట్ల మనుషులు ప్రేమ పెంచుకుంటే అవి దూరమైనప్పుడు చూపించే ఆప్యాయతకు ఉదాహరణగా నిలిచింది ఈఘటన.

ప్రజలందరితో కలిసి భారీ ఊరేగింపు నిర్వహించారు. ట్రాక్టర్ ద్వారా తీసుకెళ్లి తమ వ్యవసాయ పొలంలో తిరుపతయ్య కుటుంబ సభ్యులు ఎద్దుకు అంతిమసంస్కారాలు నిర్వహించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..