Telangana: ఎన్నడూ లేనంతగా కుప్పులు తెప్పలుగా పట్టుబడుతున్న డబ్బు

నోటిఫికేషన్ రాకముందే తెలంగాణకు వచ్చిన కేంద్ర ఎన్నికల కమిటీ.. కీలక సమావేశం నిర్వహించింది. డబ్బు, మద్యం తరలించేవారిపై ఉక్కుపాదం మోపాలని అధికారులను ఆదేశించింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 250వరకు చెక్ పోస్టులను ఏర్పాటు చేసారు అధికారులు. విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు.

Telangana: ఎన్నడూ లేనంతగా కుప్పులు తెప్పలుగా పట్టుబడుతున్న డబ్బు
Cash
Follow us
Ram Naramaneni

|

Updated on: Oct 22, 2023 | 8:24 AM

2023 తెలంగాణ ఎన్నికలను కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్‌గా తీసుకుంది. ఎన్నికల్లో మద్యం, డబ్బు పంచకుండా అడ్డుకట్టవేయాలని నిర్ణయించుకుంది. ఎక్కడికక్కడ చెక్‌పోస్టులు పెట్టి.. తనిఖీలు నిర్వహిస్తున్నారు అధికారులు. ఈ సోదాల్లో అధికారులు సైతం అవాక్కయ్యేలా నోట్ల కట్టలు, సొమ్ములు బయటపడుతున్నాయి. షెడ్యూల్ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏకంగా 307కోట్ల సొమ్ము స్వాధీనం చేసుకున్నారు. ఇందులో నగదు 105కోట్ల 58లక్షలు కాగా.. 13కోట్ల 58లక్షలు విలువ చేసే 72వేల లీటర్ల మద్యాన్ని సీజ్ చేశారు. ఇక పోలీసులు సీజ్ చేసిన బంగారం,వెండి, వజ్రాల విలువ 145కోట్ల 67లక్షలు అన్నట్లు ఈసీ అంచనా వేసింది. ఇవి కాకుండా 27కోట్ల విలువచేసే బియ్యం, చీరలు, ల్యాప్ టాప్స్, క్రీడా సామాగ్రి, వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. గడిచిన 24గంటల్లోనే 18కోట్ల మేర సొత్తును స్వాధీనం చేసుకున్నారు.

నోటిఫికేషన్ రాకముందే తెలంగాణకు వచ్చిన కేంద్ర ఎన్నికల కమిటీ.. కీలక సమావేశం నిర్వహించింది. డబ్బు, మద్యం తరలించేవారిపై ఉక్కుపాదం మోపాలని అధికారులను ఆదేశించింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 250వరకు చెక్ పోస్టులను ఏర్పాటు చేసారు అధికారులు. విస్తృతంగా తనిఖీలు నిర్వహించి.. సరైన బిల్లులు లేని నగదు, మద్యాన్ని స్వాధీనం చేసుకుంటున్నారు. అయితే ఎప్పుడూ లేని విధంగా టార్గెట్ పెట్టుకుని మరీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. టార్గెట్ పేరుతో లెక్కకు మించి చేతికి దొరికిన ప్రతిదానిని సీజ్ చేస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి.

ఎన్నడూ లేనంతగా భారీ స్థాయిలో డబ్బు, మద్యం పట్టుబడుతుండటంతో అధికారులు సైతం అవాక్కవుతున్నారు. 12 రోజుల్లోనే 307 కోట్లు పట్టుబడితే.. తీరా ఎన్నికలు అయ్యే నాటికి ఇంకెంత డబ్బు, మద్యం పట్టుబడుతుందనేది లెక్కకే అందడం లేదు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..
మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..
సెంచరీతో అదరగొట్టిన నితీష్ రెడ్డి.. సీఎం చంద్రబాబు అభినందనలు
సెంచరీతో అదరగొట్టిన నితీష్ రెడ్డి.. సీఎం చంద్రబాబు అభినందనలు
గొప్ప నివాళి అర్పించిన మన్మోహన్ సింగ్ స్వగ్రామం!
గొప్ప నివాళి అర్పించిన మన్మోహన్ సింగ్ స్వగ్రామం!
ఆ హీరోల నుంచి డబల్ ధమాకా.. 2025లో ఫ్యాన్స్‎ని ఖుషి చేయనున్నారా.?
ఆ హీరోల నుంచి డబల్ ధమాకా.. 2025లో ఫ్యాన్స్‎ని ఖుషి చేయనున్నారా.?
ఓటీటీలోకి వచ్చేసిన జబర్దస్థ్ రాకేష్ కేసీఆర్.. స్ట్రీమింగ్ ఎక్కడంట
ఓటీటీలోకి వచ్చేసిన జబర్దస్థ్ రాకేష్ కేసీఆర్.. స్ట్రీమింగ్ ఎక్కడంట