Online Games: బెట్టింగ్ యాప్ రాసిన మరణ శాసనం ఇది.. కటకటాల వెనక్కి మరో వ్యక్తి..!

వినాశకాలే విపరీత బుద్దులు అన్నట్లు.. చేతిలోని చరవాణి కొందరి జీవితాలను చెరిపేస్తుంది. ఆన్‌లైన్ బెట్టింగ్స్ యాప్స్‌‌కు బానిసలుగా మారుతున్న యువతరం వారి బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు

Online Games: బెట్టింగ్ యాప్ రాసిన మరణ శాసనం ఇది.. కటకటాల వెనక్కి మరో వ్యక్తి..!
Online Betting Apps
Follow us
G Peddeesh Kumar

| Edited By: Balaraju Goud

Updated on: Oct 29, 2024 | 6:35 PM

ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ యువత ప్రాణాలు బలి తీసుకుంటున్నాయి.. బెట్టింగ్స్‌కు బానిసలుగా మారిన కొందరు యువకులు దోపిడీలకు బరితెగిస్తుంటే, మరికొందరు ఆ బెట్టింగ్స్ కోసం చేసిన అప్పుల ఊబి కూరుక్కుపయి, బయటకు రాలేక తనువు చాలిస్తున్నారు. వరంగల్ జిల్లాలో ఒకేరోజు జరిగిన రెండు వేరువేరు ఘటనలో తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఓ విద్యార్థి బెట్టింగ్ యాప్స్ అప్పులు తీర్చలేక ఆత్మహత్యకు పాల్పడితే, మరో యువకుడు ఆన్‌లైన్ బెట్టింగ్స్ అప్పులు తీర్చడం కోసం దొంగగా మారి కటకటాల పాలయ్యాడు.

వినాశకాలే విపరీత బుద్దులు అన్నట్లు.. చేతిలోని చరవాణి కొందరి జీవితాలను చెరిపేస్తుంది. ఆన్‌లైన్ బెట్టింగ్స్ యాప్స్‌‌కు బానిసలుగా మారుతున్న యువతరం వారి బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. వరంగల్ లో జరిగిన రెండు తాజా ఘటనలే ఇందుకు నిదర్శనం. వరంగల జిల్లా రాయపర్తి మండల కేంద్రానికి చెందిన ధర్మరాజు అనే యువకుడు హనుమకొండలోని సుబేదారి పోస్టల్ కాలనీలో ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు.. డిగ్రీ పూర్తి చేసిన ధర్మరాజు తన స్వగ్రామం రాయపర్తిలో కొద్ది రోజులపాటు బిర్యానీ సెంటర్ నిర్వహించాడు.. ఆ తర్వాత బెట్టింగ్ యాప్స్‌కు బానిసగా మారి ఆన్‌లైన్ బెట్టింగ్ లో పెద్ద మొత్తంలో నష్టపోయాడు.

బెట్టింగ్స్ కోసం తీసుకున్న అప్పులు ఎలా చెల్లించాలో తెలియక దురాలోచనతో దొంగగా మారాడు. దొంగతనాలు ఒక్కటే మార్గంగా ఎంచుకున్న ధర్మరాజు ద్విచక్ర వాహనంపై పగటిపూట రెక్కీ నిర్వహించి, తాళాలు వేసిన ఇండ్లను గుర్తించేవాడు. రాత్రి సమయంలో ఆ ఇళ్లలో చోరీలకు పాల్పడేవాడు. ఇలా కేవలం ఒక్క వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోనే 17 ఇళ్లలో చోరీలకు పాల్పడ్డాడు. టెక్నికల్ డేటా ఆధారంగా సీసీఎస్ పోలీసులు ధర్మరాజును గుర్తించి ఎట్టకేలకు పట్టుకున్నారు. ఇతని వద్ద నుంచి 28లక్షల 50 వేల విలువగల బంగారు ఆభరణాలు, ఒక కిలో 640 వెండి గ్రాముల వెండి ఆభరణాలు, సెల్ ఫోన్ ఇతర సామాగ్రి స్వాధీనం చేసుకుని రిమాండ్ కు పంపారు..

ఇదే జిల్లాలోని వర్ధన్నపేట మండలం కడారిగూడెం గ్రామంలో మరొక ఘటన జరిగింది. గణేష్ అనే యువకుడు ఘట్కేసర్ లోని ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నాడు. ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ కు బానిసగా మారిన గణేష్ బెట్టింగ్స్ ద్వారా ఏడు లక్షలపైగా అప్పు చేశాడు. చేసిన అప్పు ఎలా తీర్చాలో తెలియక మనోవేధనకు గురై పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్నాడు. చేతికి అందిన కొడుకు కళ్ళముందే ఆత్మహత్యకు పాల్పడటంతో ఆ తల్లి గుండెలవిసేలా రోదిస్తుంది. బెట్టింగ్ యాప్స్ కు బానిసలుగా మారి యువత జీవితాలు బుగ్గిపాలు చేసుకోద్దని పోలీసులు కూడా సూచిస్తున్నారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!