AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: చౌరస్తాలో బైక్‌పై అనుమానాస్పదంగా కనిపించిన యువకుడు.. ఆరా తీసిన పోలీసులు షాక్..!

ఈజీగా డబ్బు సంపాదించాలనే ఆశ, ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్ వ్యసనం ఓ యువకుడి జీవితాన్ని నేరాల బాట పట్టించింది. బెట్టింగ్‌లో వరుసగా డబ్బు పోగొట్టుకుని అప్పుల ఊబిలో కూరుకుపోయిన యువకుడు, చివరకు బైక్ దొంగతనాలకు పాల్పడ్డాడు. కొట్టేసిన బైక్‌తో తిరుగుతూ.. చివరికి సిద్దిపేట వన్‌టౌన్ పోలీసులకు చిక్కాడు. అతడి నుంచి రెండు ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Telangana: చౌరస్తాలో బైక్‌పై అనుమానాస్పదంగా కనిపించిన యువకుడు.. ఆరా తీసిన పోలీసులు షాక్..!
Bike Thief
P Shivteja
| Edited By: |

Updated on: Jul 17, 2026 | 4:53 PM

Share

ఈజీగా డబ్బు సంపాదించాలనే ఆశ, ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్ వ్యసనం ఓ యువకుడి జీవితాన్ని నేరాల బాట పట్టించింది. బెట్టింగ్‌లో వరుసగా డబ్బు పోగొట్టుకుని అప్పుల ఊబిలో కూరుకుపోయిన యువకుడు, చివరకు బైక్ దొంగతనాలకు పాల్పడ్డాడు. కొట్టేసిన బైక్‌తో తిరుగుతూ.. చివరికి సిద్దిపేట వన్‌టౌన్ పోలీసులకు చిక్కాడు. అతడి నుంచి రెండు ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డి జిల్లా దోమకొండకు చెందిన అబ్బరబోయిన ప్రశాంత్ ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్‌కు బానిసయ్యాడు. మొదట త్వరగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో బెట్టింగ్ ప్రారంభించిన అతడు, వరుసగా నష్టాలు చవిచూడడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో పడ్డాడు. అప్పులు పెరగడంతో వాటిని తీర్చేందుకు దొంగతనాలనే మార్గంగా ఎంచుకున్నాడు.

ఈ క్రమంలోనే జూలై 11వ తేదీన సిద్దిపేటకు వచ్చిన ప్రశాంత్, ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి పార్కింగ్‌లో నిలిపి ఉంచిన ఓ బైక్‌ను చాకచక్యంగా దొంగిలించాడు. అనంతరం ఆ వాహనాన్ని ఓ రహస్య ప్రదేశంలో దాచిపెట్టాడు. అదే రోజు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో పార్క్ చేసిన మరో ద్విచక్ర వాహనాన్ని కూడా ఎత్తుకెళ్లి నేరుగా కామారెడ్డి జిల్లాకు వెళ్లిపోయాడు. అయితే దాచిపెట్టిన తొలి బైక్‌ను తీసుకెళ్లేందుకు గురువారం (జూలై 16) మళ్లీ సిద్దిపేటకు వచ్చిన ప్రశాంత్ పోలీసులకు చిక్కాడు. ముస్తాబాద్ చౌరస్తా వద్ద వన్‌టౌన్ పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా, వారిని చూసి తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారించారు.

విచారణలో ప్రశాంత్ రెండు బైక్‌లను తానే దొంగిలించినట్లు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. అతడి వద్ద నుంచి రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. నిందితుడిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు వెల్లడించారు. ఈ ఘటనతో ఆన్‌లైన్ బెట్టింగ్ వ్యసనం యువతను ఆర్థిక ఇబ్బందులతో పాటు నేరాల బాట పట్టించే ప్రమాదం ఎంత తీవ్రమో మరోసారి స్పష్టమైంది. అక్రమ బెట్టింగ్‌లకు దూరంగా ఉండాలని, అనుమానాస్పద కార్యకలాపాలపై వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని అధికారులు ప్రజలకు సూచిస్తున్నారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
సీతాఫలం ఆకుల్లో సూపర్ మ్యాటర్.. ఆ రోగాలను తరిమికొట్టే దివ్యౌషధం!
సీతాఫలం ఆకుల్లో సూపర్ మ్యాటర్.. ఆ రోగాలను తరిమికొట్టే దివ్యౌషధం!
నదీ తీరంలోనే అంత్యక్రియలు ఎందుకు చేస్తారు? హిందూ సంప్రదాయంలో అసలు
నదీ తీరంలోనే అంత్యక్రియలు ఎందుకు చేస్తారు? హిందూ సంప్రదాయంలో అసలు
ఆసియా కప్‌ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్-పాక్ మ్యాచ్ ఎప్పుడంటే?
ఆసియా కప్‌ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్-పాక్ మ్యాచ్ ఎప్పుడంటే?
అకౌంట్ నుంచి కట్ అయినా ఏటీఎం నుంచి నగదు రాలేదా..?
అకౌంట్ నుంచి కట్ అయినా ఏటీఎం నుంచి నగదు రాలేదా..?
జైలులో ఉండాల్సిన ఖైదీలు ఇంట్లో.. జైలర్ మాత్రం జైలులో..!
జైలులో ఉండాల్సిన ఖైదీలు ఇంట్లో.. జైలర్ మాత్రం జైలులో..!
ఇంట్లో కిటికీల విషయంలో ఈ తప్పులు చేయకండి.. నెగిటివిటీ పెరుగుతుందట
ఇంట్లో కిటికీల విషయంలో ఈ తప్పులు చేయకండి.. నెగిటివిటీ పెరుగుతుందట
సుత్తితో దాడికి ప్రయత్నించారు.. JNTU వీసీపై పోలీసులకు ఫిర్యాదు
సుత్తితో దాడికి ప్రయత్నించారు.. JNTU వీసీపై పోలీసులకు ఫిర్యాదు
పోలీస్ స్టేషన్‌లో న్యాయవాదుల ముష్టియుద్ధం!
పోలీస్ స్టేషన్‌లో న్యాయవాదుల ముష్టియుద్ధం!
అమావాస్య రోజు ఈ వస్తువులు కొనకండి.. ఉప్పు, నూనె నుంచి బంగారం వరకు
అమావాస్య రోజు ఈ వస్తువులు కొనకండి.. ఉప్పు, నూనె నుంచి బంగారం వరకు
ఎల్‌నీలో ఎఫెక్ట్.. ఈ సారి చలిలేని శీతాకాలాన్ని చూడబోతున్నారు
ఎల్‌నీలో ఎఫెక్ట్.. ఈ సారి చలిలేని శీతాకాలాన్ని చూడబోతున్నారు