AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఒకటే వీధి రెండు రాష్ట్రాలు.. అటు అడుగేస్తే ఆంధ్రా, ఇటు తెలంగాణ..! నడుమన ఉంది..

ఒక ఇంటిలో ఉదయం సమయంలో కల్లాపు చల్లితే పక్క రాష్ట్రం లో పడేంత చెరువులో ఉన్నాయి ఇక్కడ ప్రజలందరూ కలిసి కట్టుగానే ఉంటారు. సంబరాలు పండుగలు కలిసిమెలిసి నిర్వహించుకుంటారు. ఒక్కమాటలో చెప్పాలంటే బయట వ్యక్తులు వస్తే ఇవి రెండు రాష్ట్రాల నడుమ రెండు గ్రామాలుగా చెబితే తప్ప ఎవ్వరికి తెలియదు. రాష్ట్ర విభజన వరకు ఇక్కడ విద్యార్థులు వెంకటాపురం లోని ఉన్నత పాఠశాలలో చదువుకున్నారు. రాష్ట్ర విభజన తర్వాత చనుబండ ఉన్నత పాఠశాలలో స్థానికత కోసం చదువుకుంటున్నారు.

ఒకటే వీధి రెండు రాష్ట్రాలు.. అటు అడుగేస్తే ఆంధ్రా, ఇటు తెలంగాణ..! నడుమన ఉంది..
One Road, Two States
N Narayana Rao
| Edited By: Jyothi Gadda|

Updated on: Sep 13, 2025 | 7:43 PM

Share

ఒక్క సీసీ రోడ్డు…రెండు గ్రామాలు. అంతే కాదు రెండు రాష్ట్రాలు. ఆ రెండు రాష్ట్రాలకు మధ్య సరిహద్దు గా మారింది ఆ సీసీ రోడ్డు. అదేంటి అని ఆలోచిస్తున్నారా.. జంట నగరాలు.. పేర్లు వినే ఉంటాం. అలానే రెండు రాష్ట్రాల నడుమ రెండు గ్రామాల మధ్య కొంతైనా సరిహద్దు ఉంటుంది కానీ తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లా వేంసూరు మండలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఏలూరు జిల్లా చాట్రాయి మండలం కృష్ణారావుపాలెం కి కేవలం ఒక్క సీసీ రహదారే అడ్డు.

తూర్పు వైపు గా నిలబడితే కుడివైపు కృష్ణారావు పాలెం ఉండగా ఎడమవైపు వెంకటపురం గ్రామాలు ఉన్నాయి. సీసీ రోడ్డు మీద నిల్చుని ఒక అడుగు అటు వేస్తే…ఆంధ్రా రాష్ట్రం. ఒక అడుగు ఇటువైపు వేస్తే తెలంగాణ రాష్ట్రంలో అడుగు పెట్టినట్టే. ఆ గ్రామానికి సరిహద్దు గా ఉన్న సీసీ రోడ్డు రెండు రాష్ట్రాల సరిహద్దు గా మారిందంటే అందరూ ఆశ్చర్యపోతున్నారు.

ఒక ఇంటిలో ఉదయం సమయంలో కల్లాపు చల్లితే పక్క రాష్ట్రం లో పడేంత చెరువులో ఉన్నాయి ఇక్కడ ప్రజలందరూ కలిసి కట్టుగానే ఉంటారు. సంబరాలు పండుగలు కలిసిమెలిసి నిర్వహించుకుంటారు. ఒక్కమాటలో చెప్పాలంటే బయట వ్యక్తులు వస్తే ఇవి రెండు రాష్ట్రాల నడుమ రెండు గ్రామాలుగా చెబితే తప్ప ఎవ్వరికి తెలియదు. రాష్ట్ర విభజన వరకు ఇక్కడ విద్యార్థులు వెంకటాపురం లోని ఉన్నత పాఠశాలలో చదువుకున్నారు. రాష్ట్ర విభజన తర్వాత చనుబండ ఉన్నత పాఠశాలలో స్థానికత కోసం చదువుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్నితెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..