AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: ఆహా.. చట్నీస్ రెస్టారెంట్ అంటూ వెళితే.. మీ కథ ఖల్లాసే..

Hyderabad: ఆహా.. చట్నీస్ రెస్టారెంట్ అంటూ వెళితే.. మీ కథ ఖల్లాసే..

Shaik Madar Saheb
|

Updated on: Sep 13, 2025 | 7:17 PM

Share

మంచి హోటల్‌, నోరూరించే మెనూ, కంటికి ఇంపైన ఐటమ్స్ చూసి టెంప్ట్‌ అవుతున్నారా..? బీ కేర్‌ ఫుల్‌..! ఎందుకంటే ఫుడ్‌ సేఫ్టీ అధికారుల దాడుల్లో షాకింగ్‌ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రముఖ హోటళ్లలోనూ ఏ మాత్రం సుచీశుభ్రత పాటించటం లేదు. కిచెన్లలో బొద్దింకలతో పాటు అధ్వాన్న పరిస్థితిలు వెలుగుచూశాయి.

మంచి హోటల్‌, నోరూరించే మెనూ, కంటికి ఇంపైన ఐటమ్స్ చూసి టెంప్ట్‌ అవుతున్నారా..? బీ కేర్‌ ఫుల్‌..! ఎందుకంటే ఫుడ్‌ సేఫ్టీ అధికారుల దాడుల్లో షాకింగ్‌ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రముఖ హోటళ్లలోనూ ఏ మాత్రం సుచీశుభ్రత పాటించటం లేదు. కిచెన్లలో బొద్దింకలతో పాటు అధ్వాన్న పరిస్థితిలు వెలుగుచూశాయి. ఇలాంటి హోటళ్లలో భోజనాలు చేస్తే.. హాస్పిటల్స్‌కు వెళ్లటం ఖాయమనేలా దారుణాలు బయటపడుతున్నాయి. జూబ్లీహిల్స్, బంజారా హిల్స్‌లోని చట్నీస్ రెస్టారెంట్స్‌లోనూ చాలా రోజులు ఫ్రిజ్‌లలో నిల్వ చేసిన ఆహార పదార్థాలు ఫుడ్ సెఫ్టీ అధికారులకు పట్టుబడ్డాయి.

వంటగదులు FSSAI నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని అధికారులు గుర్తించారు. రిఫ్రిజిరేటర్ల మధ్య బొద్దింకలు తిరుగుతుండటం, జిడ్డుగా ఉన్న ఎగ్జాస్ట్ ఫ్యాన్లు, మూసుకుపోయిన మురుగు కాలువలు, అపరిశుభ్రంగా ఉన్న గ్రౌండ్ ఫ్లోర్‌ను చూసి అధికారులు షాక్‌ అయ్యారు. అక్కడ పనిచేస్తున్న సిబ్బందికి సరైన మెడికల్ సర్టిఫికెట్లు లేకపోవడంతో చట్నీస్ రెస్టారెంట్‌ నిర్వాహకులపై అధికారులు సీరియస్‌ అయ్యారు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌ చట్నీస్ రెస్టారెంట్లకు నోటీసులు జారీ చేశారు.

Published on: Sep 13, 2025 07:17 PM