తెలుగు రాష్ట్రాలకు వానగండం..ఆ జిల్లాల్లో క్లౌడ్‌బరస్ట్ వీడియో
బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో నాలుగు రోజుల పాటు కోస్తా జిల్లాలకు భారీ వర్ష సూచన చేసింది వాతవావరణ శాఖ. 5 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, 2 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అనకాపల్లి, కాకినాడ, ఏలూరు, ఎన్టీఆర్.. తూ.గో జిల్లాలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని అధికారులు హెచ్చరించారు.
కర్నూలు, నంద్యాల జిల్లాలకు భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు. మిగిలిన జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. 40-50 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. అదేవిధంగా రానున్న నాలుగు రోజులు తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం ప్రకటించింది. తెలంగాణలో నిర్మల్, నిజామాబాద్,జగిత్యాల, సిరిసిల్ల, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, నారాయణపేట, వనపర్తి, గద్వాల్ జిల్లాలో అక్కడక్కడా భారీవర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. 40-50 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉందని రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. కొన్నిచోట్ల క్లౌడ్‌బరస్ట్ అయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది వాతావరణ శాఖ. ప్రస్తుతం తెలంగాణ మొత్తానికి ఎల్లో అలర్ట్ కొనసాగుతుండగా.. ఇది గంటగంటకూ మారే అవకాశం కనిపిస్తోంది. ఉపరితల ఆవర్తనం, రుతుపవన ద్రోణి ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయంటోంది వాతావరణశాఖ. వాతావరణం ఆకస్మికంగా మారుతూ క్లౌడ్‌బరస్ట్, కుండపోత వానలు కురిసే అవకాశముందని హెచ్చరించింది. ఇప్పటికే తెలంగాణలో నిన్న వర్షాలు షేక్ చేశాయ్. ఆరేడు జిల్లాల్లో కుండపోత వానలు బీభత్సం సృష్టించాయి. కొన్ని ప్రాంతాల్లో క్లౌడ్‌బరస్ట్ కావడంతో మూడు నాలుగు గంటల్లోనే భారీ వర్షపాతం నమోదైంది.
మరిన్ని వీడియోల కోసం :
ట్రంప్ డబుల్ గేమ్..పైకి ప్రేమ.. లోపల ద్వేషం వీడియో
ఎండ ఉన్నంతసేపు ఉరుకతనే ఉంటది..కాకినాడ కుర్రోడి ఖతర్నాక్ ఐడియా వీడియో
ఆ జిల్లాల్లో పిడుగులు పడొచ్చు జాగ్రత్త.. వీడియో
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
