హైదరాబాద్ నుంచి 3 హై స్పీడ్ రైలు మార్గాలు వీడియో
తెలంగాణ మీదుగా మూడు హైస్పీడ్ రైలు మార్గాలు ఏర్పాటు కానున్నాయి. హైదరాబాద్-చెన్నై, హైదరాబాద్-బెంగళూరు, హైదరాబాద్-అమరావతి హైస్పీడ్ రైలు మార్గాలను నిర్మించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కీలక అడుగులు వేస్తున్నాయి. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ను దేశంలోని ఇతర ప్రధాన నగరాలతో అనుసంధానించే మూడు హైస్పీడ్ రైలు మార్గాల ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. హైదరాబాద్ నుంచి చెన్నై, బెంగళూరు, అమరావతి నగరాలకు ఈ బుల్లెట్ రైలు కారిడార్లను నిర్మించేందుకు కేంద్రం సుముఖత వ్యక్తం చేసింది.
ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులతో పాటు ఇతర కొత్త రైల్వే లైన్ల పురోగతిపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గురువారం ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమావేశం కోసం రైల్వే ముఖ్య ఇంజనీర్లు సైతం హైదరాబాద్‌కు చేరుకున్నట్లు సమాచారం. హైదరాబాద్-చెన్నై, హైదరాబాద్-బెంగళూరు హైస్పీడ్ రైలు మార్గాలకు సంబంధించిన అలైన్‌మెంట్లను అధికారులు ఇప్పటికే ఖరారు చేశారు. హైదరాబాద్-చెన్నై మార్గం కాజీపేట మీదుగా కాకుండా నార్కట్‌పల్లి, సూర్యాపేట, కోదాడ మీదుగా వెళ్లనుందని తెలిసింది. ఈ మార్గంలో తెలంగాణ పరిధిలో దాదాపు 6 నుంచి 7 స్టేషన్లు ఉండే అవకాశం ఉంది. ఇక హైదరాబాద్-బెంగళూరు హైస్పీడ్ మార్గాన్ని ప్రతిపాదిత నాగ్‌పూర్-హైదరాబాద్-బెంగళూరు గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వేకు సమాంతరంగా నిర్మించనున్నారు. దీనికి సంబంధించి మూడు రకాల అలైన్‌మెంట్లను సిద్ధం చేయగా, రాష్ట్రంలో 4 నుంచి 5 స్టేషన్లు ఏర్పాటు కావొచ్చని అంచనా వేస్తున్నారు. మరోవైపు, హైదరాబాద్-అమరావతి గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వేకు సమాంతరంగానే హైస్పీడ్ రైలు మార్గాన్ని కూడా నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. దీనిపై ప్రస్తుతం చర్చలు జరుగుతున్నట్టు సమాచారం.
మరిన్ని వీడియోల కోసం :
తురకపాలెం బాధితుల్లో మెలియాయిడోసిస్ లక్షణాలు గుర్తింపు వీడియో
నర్సరీలో వింత శబ్దాలు.. దగ్గరకు వెళ్లి చూసిన కూలీలకు షాక్ వీడియో
బస్సులో ఫోన్ పోగొట్టుకున్నారా.. జాగ్రత్త వీడియో
అలవాటుగా ఇంటి సీలింగ్‌వైపు చూసి వణికిపోయిన వ్యక్తి.. ఏం జరిగిందంటే?వీడియో
రోడ్లు బాగు చేయాలంటూ రోడ్డుపై పొర్లు దండాలు
దూసుకెళ్తున్న ఎమ్మెల్యే కారు... ఆపిన పోలీసులు.. ఆ తర్వాత
విషాదం అంటే ఇదే... ఆ దాత నుంచి కిడ్నీ తీసుకున్న వారాలకే
‘దురంధర్’ పాటకు పాక్‌లో దుమ్మురేపేలా డాన్స్
గబ్బిలాలకు పూజలు చేసే గ్రామం.. ఎందుకో తెలుసా ??
200 ఏళ్ల నాటి అరుదైన శంఖం... ఏడాదికి ఒక్కసారే...
ప్రియుడి భార్య ఎంట్రీ..10వ అంతస్తు లో వేలాడిన ప్రియురాలు
