AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అలవాటుగా ఇంటి సీలింగ్‌వైపు చూసి వణికిపోయిన వ్యక్తి.. ఏం జరిగిందంటే?వీడియో

అలవాటుగా ఇంటి సీలింగ్‌వైపు చూసి వణికిపోయిన వ్యక్తి.. ఏం జరిగిందంటే?వీడియో

Samatha J
|

Updated on: Sep 11, 2025 | 1:31 PM

Share

పాములంటే భయపడనివారుండరు. ఎంత ధైర్యవంతులైనా సమీపంలో పాము కనిపిస్తే దూరంగా పరుగుతీస్తారు. అలాంటిది ఇంట్లోనే పాము తిష్టవేస్తే వారి పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పనక్కర్లేదు. అలా ఓ వ్యక్తి తన ఇంట్లో అటూ ఇటూ తిరుగుతూ యధాలాపంగా ఇంటి సీలింగ్‌ వైపు చూశాడు. ఆ ఫ్యాన్సీ సీలింగ్‌లో ఏదో కదులుతున్నట్టు గమనించాడు. అయితే ఏవో వైర్లు బయటకు వచ్చి ఉంటాయిలే అనుకున్నాడు. కాస్త పరిశీలనగా చూడగా అది కదులుతూ కనిపించింది. విషయం అర్థమైన అతనికి చెమటలు పట్టాయి. వెంటనే ఇంట్లోని వారిని అలర్ట్‌ చేశాడు. ఆ తర్వాత ఫారెస్ట్‌ అధికారులకు సమాచారమిచ్చాడు.

ఉత్తరప్రదేశ్ నోయిడా సెక్టార్ 49 పోలీస్ స్టేషన్ పరిధిలోని సెక్టార్ 51లోని ఒక ఇంట్లోకి పాము చొరబడింది. మొదట ఫ్యాన్సీ సీలింగ్ లైట్ లోపల ఏదైనా వైరింగ్ సమస్య ఉందేమో అనుకున్నారు.. కానీ, అక్కడ పాము కదులుతూ కనిపించగానే భయపడిపోయారు. ఆ పాము ఫ్యాన్సీ లైట్ లోపలికి చేరి, సీలింగ్ ప్యానల్‌లో తిరుగుతూ కనిపించడంతో అందరూ భయంతో హడలిపోయారు. దాన్ని బయటకు పంపడం ఎలా అని ఆందోళచెందారు. సీలింగ్‌లోపల చిక్కుకున్న పాము పరిస్థితికూడా అదే.. బయటకు వెళ్ళే మార్గం కనిపించక పాముకూడా అటూ ఇటూ తిరుగుతూ హడావిడిచేసింది. లాభం లేదని ఆ కుటుంబ సభ్యులు ఫారెస్ట్‌ అధికారులకు సమాచారమిచ్చి, ఇంట్లోనుంచి బయటకు వచ్చేశారు. ఘటనాస్థలికి చేరుకున్న అటవీ సిబ్బంది పామును పట్టుకునే పనిలో పడ్డారు. ఈ ఘటన స్థానికులను తీవ్ర భయాందోళనకు గురిచేసింది. వర్షాకాలంలో ఇళ్లలోకి పాములు రావడం గతంలోనూ జరిగిందని, కానీ ఇలా సీలింగ్‌ ప్యానల్‌లోకి పాములు చొరబడటం భయం ఇదే తొలిసారి అంటున్నారు. పాములు ఇళ్లలోకి రాకుండా పైకప్పులు, బాత్రూమ్‌ లాంటి ప్రదేశాలను ఎప్పుడూ మూసి ఉంచుకోవాలని ఫారెస్ట్ అధికారులు సూచిస్తున్నారు. ఇంటి చుట్టూ ఉన్న పొదలను క్రమం తప్పకుండా శుభ్రం చేసుకోవాలని, పైకప్పు గోడలలో ఏవైనా పగుళ్లు ఉంటే వెంటనే మూసివేయాలని సూచించారు.

మరిన్ని వీడియోల కోసం :

లగ్జరీ బంగ్లాను ఖాళీ చేసిన స్టార్‌ కపుల్‌.. కారణం తెలిస్తే షాకవుతారు వీడియో

ఏపీ, తెలంగాణలో దసరా సెలవులు ఎప్పటినుంచంటే? వీడియో

‘స్పిరిట్’ పై సందీప్ రెడ్డి అప్ డేట్.. ప్రభాస్ ఫ్యాన్స్ సంబరాలు వీడియో

ఎంతైనా తల్లితల్లే..పిల్లల కోసం చిరుత ఏం చేసిందంటే? వీడియో