ఏపీ, తెలంగాణలో దసరా సెలవులు ఎప్పటినుంచంటే? వీడియో
ఏపీ, తెలంగాణ విద్యార్థులకు పండుగ సీజన్ లో వరుస సెలవులు రానున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో సెప్టెంబర్ 24 నుండి అక్టోబర్ 2 వరకు దసరా సెలవులు ఉండగా, జూనియర్ కళాశాలలకు, క్రిస్టియన్ మైనారిటీ పాఠశాలలకు వేర్వేరు తేదీల్లో సెలవులు ప్రకటించారు. తెలంగాణలో సెప్టెంబర్ 21 నుండి అక్టోబర్ 3 వరకు దసరా సెలవులు ఇవ్వనున్నారు. ఏపీలో పాఠశాలలకు మొత్తం 9 రోజుల పాటు ప్రభుత్వం సెలవులను ప్రకటించింది. దసరా పండగ అక్టోబర్ 2, 2025 న వస్తుంది. సుదీర్ఘ సెలవుల అనంతరం పాఠశాలలు అక్టోబర్ 3న తెరుచుకోనున్నాయి.
విద్యాశాఖ అకడమిక్ క్యాలెండర్ ప్రకారం.. జూనియర్ కాలేజీలకు సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 5 వరకు సెలవులు ఉంటాయి. క్రిస్టియన్ మైనారిటీ స్కూళ్లకు మాత్రం సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 2 వరకు సెలవులు ఇస్తారు. వీరికి మొత్తం 6 రోజులు దసరా సెలవులు ఉంటాయి. గతేడాదితో పోల్చితే ఈసారి దసరా ముందుగానే వచ్చింది. గతేడాదిలో దసరా పండగ అక్టోబర్ 12వ తేదీన రాగా, ఈసారి మాత్రం అక్టోబర్ 2వ తేదీనే వచ్చింది. అందుకే ఈసారి ముందుగానే సెలవులు ప్రారంభం కానున్నాయి.తెలంగాణలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలలకు దసరా సెలవులు ప్రకటించారు. సెప్టెంబర్ 21 నుంచి అక్టోబర్ 3 వరకు పాఠశాలలకు సెలవు. అక్టోబర్ 4నుంచి తిరిగి సాధారణ తరగతులు పునప్రారంభం కానున్నాయి. విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ షెడ్యూల్‌ను దృష్టిలో ఉంచుకొని తమ ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని విద్యాశాఖ సూచించింది. ఇక జూనియర్ కళాశాలల విషయానికి వస్తే.. సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 5 వరకు జూనియర్ కళాశాలలకు సెలవులు ప్రకటించారు. ఈమేరకు విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
మరిన్ని వీడియోల కోసం :
జాగ్రత్త : కారు సన్‌రూఫ్ ఇలా వాడితే శిక్ష తప్పదంట!వీడియో
విశాఖపట్నంలో ఘనంగా మహాసిమెంట్స్ వార్షిక సమావేశం వీడియో
ఢిల్లీలో ఒక్కసారిగా కూలిన భవనం వీడియో
తురకపాలెం.. భయపడొద్దు.. నేనొచ్చా.. ఇక్కడే పల్లె నిద్ర చేస్తా వీడియో
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో
