AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జాగ్రత్త : కారు సన్‌రూఫ్‌ ఇలా వాడితే శిక్ష తప్పదంట!వీడియో

జాగ్రత్త : కారు సన్‌రూఫ్‌ ఇలా వాడితే శిక్ష తప్పదంట!వీడియో

Samatha J
|

Updated on: Sep 09, 2025 | 1:59 PM

Share

బెంగళూరులో కారు సన్‌రూఫ్‌పై నిలబడి ఉన్న బాలుడు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఈ ఘటనపై చాలా మంది ఫైర్ అయ్యారు. అయితే ఈ సంఘటనకు సంబంధించి యలహంక ట్రాఫిక్ పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు. BNS చట్టంలోని సెక్షన్లు 125(a) మరియు 281 కింద కేసు నమోదు చేయబడింది.

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతుంది.బెంగళూరులో ఓ వ్యక్తి మహీంద్ర రెడ్ కలర్ కారులో సన్ రూఫ్ పై నిలబడి ప్రయాణిస్తుండగా, అతడి తల ఎత్తైన గోడను ఢీ కొట్టింది. అయితే బాలుడి ప్రాణానికి ఏం ప్రమాదం లేకపోయినప్పటికీ, తీవ్రంగా గాయం అయినట్లు సమాచారం. కాగా, ఈ ఘటనపై పోలీసులు ఫైర్ కావడమే కాకుండా, కేసు నమోదు చేయడం జరిగింది. కారు సన్ రూఫ్ ‌ను అలా వినియోగిస్తే శిక్ష తప్పదంటూ హెచ్చిరించారు. ఒక వ్యక్తి నిర్లక్ష్యంగా లేదా తొందరపాటున మరొక వ్యక్తి భద్రతకు, ప్రాణానికి ప్రమాదం కలిగిస్తే అతను BNS చట్టంలోని సెక్షన్ 125(A) ప్రకారం శిక్షార్హుడు. గాయాన్ని బట్టీ శిక్ష ఉంటుంది. ఎటువంటి గాయం లేకపోతే మూడు నెలల జైలు శిక్ష, రూ.25000 జరిమాన ఉంటదంట. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

మరిన్ని వీడియోల కోసం :

అంతరిక్షంలో ఇరుక్కుపోయా.. ఆక్సిజన్‌కి డబ్బులు పంపవా?వీడియో

వారికి జీతం 3 రెట్లు పెంపు.. ఒక్కొక్కరికీ నెలకు రూ.లక్షపైనే వీడియో

ప్రకాశ్ రాజ్ ఎమోషనల్ పోస్ట్.. డియర్ గౌరీ అంటూ.. వీడియో

పని వాళ్లకి రూ.80 లక్షల ఇల్లు గిఫ్ట్ వీడియో

Published on: Sep 09, 2025 01:47 PM