AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తురకపాలెం.. భయపడొద్దు.. నేనొచ్చా.. ఇక్కడే పల్లె నిద్ర చేస్తా వీడియో

తురకపాలెం.. భయపడొద్దు.. నేనొచ్చా.. ఇక్కడే పల్లె నిద్ర చేస్తా వీడియో

Samatha J
|

Updated on: Sep 09, 2025 | 1:59 PM

Share

వరుస మరణాలు సంభవించిన తురుకపాలెం గ్రామంలో పట్టిపాడు ఎమ్మెల్యే బోర్ల రామాంజనేయులు పల్లె నిద్ర చేస్తున్నారు. ముఖ్యంగా కొన్ని మూఢనమ్మకాలు, అపనమ్మకాలు గ్రామస్తులలో ఉన్నాయి. బోర్‌వెల్ ఒరిగింది, అరిష్టం జరిగిందంటూ కూడా పెద్ద ఎత్తున ఒక ప్రచారం అయితే జరిగింది. ఇన్ని మరణాలకు అదే కారణమని గ్రామస్తులు భావిస్తా ఉన్నారు. అయితే వాటన్నిటినీ కూడా మూఢనమ్మకాలుగా కొట్టిపారేస్తూ ఎమ్మెల్యే ఈరోజు పల్లె నిద్రకు ఉపక్రమించారు.

మనతోపాటు ప్రస్తుతం ఎమ్మెల్యే ఉన్నారు. సార్ ప్రధానంగా మీరు జిల్లా కలెక్టర్‌కు కూడా చేశారు. ఈ జిల్లాలో ఉన్న సామాజిక కోణం అంతా కూడా మీకు చాలా పెద్ద ఎత్తున తెలిసిన అంశం. అయితే ఈరోజు ఇంత భయాందోళన రేకెత్తించడానికి ప్రధాన కారణం ఏమనుకుంటున్నారు? వాటిని ఏ విధంగా తొలగించనున్నారు? మొట్టమొదట టీవీ నైన్ యాజమాన్యానికి, ప్రేక్షకులకు నా ధన్యవాదాలు. ఎందుకంటే ఈ ఇష్యూ మీద ఈరోజు రాష్ట్రస్థాయిలో చర్చ జరగడానికి గాని, రాష్ట్రస్థాయి నుంచి డాక్టర్ల బృందాలు ఇక్కడికి వచ్చి వివిధ రకాలైనటువంటి పరీక్షలు చేసి అసలు ఇక్కడ ఉన్నటువంటి దానికి పూర్తి స్థాయిలో ఒక నివారణ కార్యక్రమాన్ని చేపట్టడానికి మీ అంత కృషి చేస్తున్నందుకు మీ యాజమాన్యానికి మీకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇక్కడ ముఖ్యంగా తురుకపాలెం గ్రామంలో అందరూ కూడా క్వారీ మీద ఆధారపడినటువంటి ఆ సెరామిక్స్‌లో సో ఇక్కడ ఉన్నది ఏంటంటే వాళ్లు కష్టపడి ఏదో నాలుగు డబ్బులు సంపాదించుకొని ఆ కష్టంతో వాళ్లు జీవనాన్ని కొనసాగించేటటువంటి ఈ ఊరిలో మరి సడెన్‌గా ఈ రకంగా డెత్స్ రావడం అనేటటువంటిది చాలా భయాందోళనంగా ఉన్నటువంటి వాతావరణం. సో దీనికి అనేక కారణాలు వెతికాం. ఒకటి ఆరోగ్యపరంగా సర్వేలు పరీక్షలు జరుగుతున్నది ఒకవైపు అయితే మరొకవైపు సామాజిక కోణంలో కూడా ఇక్కడ శానిటేషన్‌కు సంబంధించి సెట్రేట్ చేయడం జరిగింది.

మరిన్ని వీడియోల కోసం :

అంతరిక్షంలో ఇరుక్కుపోయా.. ఆక్సిజన్‌కి డబ్బులు పంపవా?వీడియో

వారికి జీతం 3 రెట్లు పెంపు.. ఒక్కొక్కరికీ నెలకు రూ.లక్షపైనే వీడియో

ప్రకాశ్ రాజ్ ఎమోషనల్ పోస్ట్.. డియర్ గౌరీ అంటూ.. వీడియో

పని వాళ్లకి రూ.80 లక్షల ఇల్లు గిఫ్ట్ వీడియో

Published on: Sep 09, 2025 12:17 PM