విశాఖపట్నంలో ఘనంగా మహాసిమెంట్స్ వార్షిక సమావేశం వీడియో
సిమెంట్ వ్యాపార రంగంలో మై హోమ్ గ్రూప్స్ మహా సిమెంట్స్ రాజ్యంగా వెలుగొందుతుంది. అనతి కాలంలోనే దక్షిణాదిలో సుస్థిరమైన స్థానం సంపాదించుకుంది. ఈ నేపథ్యంలో విశాఖపట్నం రీజియన్ వార్షిక డీలర్స్ సమావేశం అత్యంత ఘనంగా జరిగింది. మహా కుటుంబం పేరుతో విశాఖ నోవాటెల్ హోటల్లో జరిగిన ఈ కార్యక్రమంలో మహా సిమెంట్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శాంభశివరావు, రీజినల్ మేనేజర్లు పాల్గొన్నారు.
విశాఖ రీజియన్ నుంచి ఉమ్మడి విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన మహా సిమెంట్స్ డీలర్లు తమ కుటుంబ సభ్యులతో సహా హాజరయ్యారు. మహా సిమెంట్స్ సేల్స్ లో ప్రతిభ చూపిన డీలర్లకు ఈ సందర్భంగా అవార్డులను ప్రదానం చేశారు. రీజియన్ వారీగా మూడు బహుమతులతో పాటు జిల్లాల వారీగా కూడా జిల్లాకు మూడు చొప్పున అవార్డులను అందజేశారు. మహా సిమెంట్స్ ప్రస్తుతం 12 మిలియన్ టన్నుల ఉత్పత్తి కెపాసిటీతో కొనసాగుతుందని రాబోయే ఐదేళ్లలో 20 మిలియన్ టన్నులను లక్ష్యంగా పెట్టుకున్నామని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శాంభశివరావు చెప్పారు. సంస్థను మరింత విస్తరించే కార్యాచరణతో వేగంగా ముందుకు వెళ్తున్నామన్నారు. తెలుగువారు స్థాపించిన మహా సిమెంట్స్ కు అందరి సహకారం మరింత అవసరమని కోరారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాల్లో 8000 డీలర్లున్న మహా సిమెంట్స్ కు విశాఖ రీజియన్లో 200 మందికి పైగా డీలర్లున్నారని శాంభశివరావు తెలిపారు. మహా సిమెంట్స్ కు విశాఖ రీజియన్లో ఎక్కువ ఆదరణ ఉందని ఆయన స్పష్టం చేశారు. భవిష్యత్తులో మరింత విస్తరించి అగ్రగామిగా నిలిచేలా డీలర్ల సహకారం కోరుతున్నామన్నారు. విశాఖపట్నం రీజియన్ వార్షిక డీలర్స్ మీట్ జరుగుతుంది.
మరిన్ని వీడియోల కోసం :
అంతరిక్షంలో ఇరుక్కుపోయా.. ఆక్సిజన్‌కి డబ్బులు పంపవా?వీడియో
వారికి జీతం 3 రెట్లు పెంపు.. ఒక్కొక్కరికీ నెలకు రూ.లక్షపైనే వీడియో
ప్రకాశ్ రాజ్ ఎమోషనల్ పోస్ట్.. డియర్ గౌరీ అంటూ.. వీడియో
పని వాళ్లకి రూ.80 లక్షల ఇల్లు గిఫ్ట్ వీడియో
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
