Nellore: కారం బస్తా చిరిగి నడిరోడ్డుపై పడింది.. ఆ తర్వాత..
నెల్లూరు జిల్లాలోని టపాతోపులో కారం బస్తా చిరిగిపడి రోడ్డంతా ఎర్రగా మారింది. గాలికి ఎగిరిన కారం వాహనదారుల కళ్లలోకి చేరి కళ్ల మంటలతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. లారీకి జేసీబీ తగలడంతో జరిగిన ఈ ఘటన ట్రాఫిక్ జామ్‌కు దారి తీసింది. రోడ్డుపై నీళ్లు పోసి శుభ్రం చేయాలని వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు.
నెల్లూరు జిల్లాలోని టపాతోపులో నడిరోడ్డుపై కారం బస్తా చిరిగి కలకలం రేపింది. కారం లోడ్ చేసిన లారీకి ఎదురుగా వచ్చిన జేసీబీ తగలడంతో బస్తా పగిలిపోయింది. రోడ్డంతా కారం చిందర వందరగా పడిపోయి గాలికి ఎగిరి వాహనదారుల కళ్లలోకి చేరింది. దీంతో కళ్ల మంటలతో డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వాహనాలు ఆగిపోవడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. రోడ్డుపై నీళ్లు పోసి కారం శుభ్రం చేయాలని వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు.
Published on: Sep 10, 2025 01:59 PM
వైరల్ వీడియోలు
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
3 మేడలు, కారు, వ్యాపారం.. బిచ్చగాడి ఆస్తులు తెలిస్తే మైండ్ బ్లాక్
టాయిలెట్లో పేపర్పై వార్నింగ్.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
విశాఖ అబ్బాయి వెడ్స్ నార్వే అమ్మాయి
డ్రైవర్ లేకుండానే పొలం దున్నిన ట్రాక్టర్.. దగ్గరకి వెళ్లి చూడగా
మీరు మనుషులేనా ?? పిల్లాడికి ఏమైందో చూడకుండా చేపల కోసం ఎగబడతారా
క్రిమినల్ లాయర్కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా

