AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TOP 9 ET News: అల్లు కుటుంబానికి GHMC షాక్‌ కూల్చేస్తామంటూ నోటీస్‌

TOP 9 ET News: అల్లు కుటుంబానికి GHMC షాక్‌ కూల్చేస్తామంటూ నోటీస్‌

Phani CH
|

Updated on: Sep 10, 2025 | 2:09 PM

Share

తేజ సజ్జా హీరోగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘మిరాయ్’. సెప్టెంబర్ 12న రిలీజ్‌కు రెడీ అవుతున్న ఈ సినిమా ఐఎండీబీ లిస్ట్‌లో రేర్‌ ఫీట్ సాధించింది. మోస్ట్ యాంటిసిపేటెడ్ ఇండియన్‌ మూవీస్‌ లిస్ట్‌లో టాప్ ప్లేస్‌లో నిలిచింది మిరాయ్‌. ఈ లిస్ట్‌లో ఓజీ రెండో స్థానంలో ఉండటం విశేషం. ప్రముఖ సినీ నిర్మాత అల్లు అరవింద్‌కు జీహెచ్‌ఎంసీ అధికారులు నోటీసులు జారీ చేశారు.

ప్రముఖ సినీ నిర్మాత అల్లు అరవింద్‌కు జీహెచ్‌ఎంసీ అధికారులు నోటీసులు జారీ చేశారు. జూబ్లీహిల్స్‌ రోడ్‌ నం. 45లోని అల్లు బిజినెస్‌ పార్క్‌ పేరుతో ఒక భవనం నిర్మించారు. నాలుగు అంతస్థుల వరకు జీహెచ్‌ఎంసీ నుంచి అనుమతులు తీసుకున్నారు. అయితే, కొద్దిరోజుల క్రితం అదనంగా పెంట్‌హౌస్‌ నిర్మించడంతో అధికారులు నోటీసులు జారీ చేశారు. అక్రమంగా నిర్మించిన ఆ పెంట్‌హౌస్‌ను ఎందుకు కూల్చవద్దో తెలపాలంటూ జీహెచ్‌ఎంసీ సర్కిల్‌-18 అధికారులు షోకాజ్‌ నోటీసులో పేర్కొన్నారు. ఇక అల్లు బిజినెస్ పార్క్ నవంబర్ 2023లో నటుడు అల్లు అర్జున్ కుటుంబం పనులు మొదలుపెట్టింది. అల్లు రామలింగయ్య 101వ జయంతి సందర్భంగా ఈ నిర్మాణం ప్రారంభించబడింది. ఈ పార్క్ జూబ్లీహిల్స్‌లో ఉంది. ఇది గీతా ఆర్ట్స్, అల్లు ఆర్ట్స్ వంటి కుటుంబ వ్యాపారాల కార్యకలాపాలకు కేంద్రంగా ఈ భవనం పనిచేస్తుంది. అయితే, అనుమతులు లేకుండా పెంట్‌హౌస్‌ నిర్మించడంతో దానిని కూల్చేస్తామంటూ జీహెచ్‌ఎంసీ నోటీసులు ఇచ్చింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

భరణికి మెగా సపోర్ట్‌ !! వర్కవుట్ అవుతుందా ?? లేక..

పైన పటారం.. లోన లొటారం..! బిగ్ బాస్ గుట్టు రట్టు చేసిన తేజస్వి

Prabhas: ఇది కూడా లీక్ చేయడం ఏంట్రా.. ఏంటి బతకనివ్వరా ??

Kajal Aggarwal: కాజల్‌కు చావు భయం చూపించిన.. పోకిరీ నెటిజన్స్‌ !!