AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kajal Aggarwal: కాజల్‌కు చావు భయం చూపించిన.. పోకిరీ నెటిజన్స్‌ !!

Kajal Aggarwal: కాజల్‌కు చావు భయం చూపించిన.. పోకిరీ నెటిజన్స్‌ !!

Phani CH
|

Updated on: Sep 10, 2025 | 1:03 PM

Share

ఒకప్పుడు టాలీవుడ్ లో ఓ వెలుగు వెలిగింది హీరోయిన్ కాజల్ అగర్వాల్. స్టార్ హీరోలందరితోనూ సూపర్ హిట్ సినిమాలు చేసింది. పలు బ్లాక్ బస్టర్ సినిమాలు ఖాతాలో వేసుకుంది. అయితే పెళ్లి, పిల్లలయ్యాక కాస్త స్పీడ్ తగ్గించింది. ఈ క్రమంలోనే రీసెంట్‌గా భగవంత్ కేసరి సినిమాతో మళ్లీ అభిమానులను పలకరించిన కాజల్... విష్ణు భక్త కన్నప్ప సినిమాలోనూ పార్వతి దేవిగా చిన్న రోల్ చేసింది.

ప్రస్తుతం ఈమె చేతిలో కొన్ని ప్రాజెక్టులు ఉన్నట్లు తెలుస్తోంది. సినిమాల్లో పెద్దగా కనిపించుకున్నా సోషల్ మీడియాలో మాత్రం ఎప్పటిలాగే ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది. తన గ్లామరస్ అండ్ ఫ్యాషనబుల్ ఫొటోలను అందులో షేర్ చేస్తుంటుంది. వీటికి నెటిజన్లు నుంచి కూడా మంచి స్పందన వస్తుంటుంది.అయితే ఎలా మొదలైందో తెలీదు కానీ… గత కొన్ని గంటలుగా సోషల్ మీడియాలో కాజల్ అగర్వాల్‌కు యాక్సిడెంట్ జరిగిందని… ఈ ప్రమాదంలో కాజల్‌కు తీవ్ర గాయాలయ్యాయని న్యూస్ తెగ వైరల్ అవ్వడం షురూ అయింది. ఆమె ఫ్యాన్స్ తో పాటు అందర్నీ షాక్ అయ్యేలా చేసింది. దీంతో కాజల్ ఈ న్యూస్‌ పై క్లారిటీ ఇవ్వాల్సిన వరకు పరిస్థితి వచ్చింది. కాజల్ తన అఫీషియల్ సోషల్ మీడియా హ్యండిల్స్ వేదికగా తాజాగా రియాక్ట్ అయింది. యాక్సిడెంట్ రూమర్లను కొట్టి పారేసింది. తనకు యాక్సిడెంట్ జరిగిందని, తాను ఇక లేనంటూ అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ లో ఎలాంటి నిజం లేదంటూ చెప్పింది. అంతేకాదు ఈ న్యూస్‌ను చూసి తాను కూడా చాలా ఆశ్చర్యపోయినట్టు చెప్పుకొచ్చింది ఈమె. ఆ దేవుడి దయ వల్ల తాను చాలా బాగున్నానని.. సురక్షితంగా ఉన్నానని.. ఎలాంటి ఫేక్ న్యూస్ ను నమ్మొద్దని తన ఫ్యాన్స్‌కు చెప్పుకొచ్చింది. అలానే ఈ ఫేక్ న్యూస్‌ను ఎవరికి స్ప్రెడ్ చేయవద్దంటూ నెటిజన్స్‌ను రిక్వెస్ట్ చేసింది. అయితే ఈ రూమర్లపై ఏకంగా కాజల్ క్లారిటీ ఇవ్వటంతో కాజల్ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

గుడ్‌న్యూస్‌.. భారత్‌కు బంగ్లాదేశ్ వినూత్న కానుక

Araku Coffee: ప్రమాదంలో అరకు కాఫీ తోటలు

హిమాచల్ ప్రదేశ్ లో వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రధాని ఏరియల్ సర్వే

అవి క్షుద్రపూజలు కాదు.. ఆ ఒక్క తప్పే మేం చేసింది

కులమతాలకు అతీతంగా తురకపాలెంలో పూజలకు నిర్ణయం