AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పైన పటారం.. లోన లొటారం..! బిగ్ బాస్ గుట్టు రట్టు చేసిన తేజస్వి

పైన పటారం.. లోన లొటారం..! బిగ్ బాస్ గుట్టు రట్టు చేసిన తేజస్వి

Phani CH
|

Updated on: Sep 10, 2025 | 1:34 PM

Share

బిగ్ బాస్‌తో అడిషనల్ సెలబ్రిటీ స్టేటస్‌ వస్తుందని కొందరు అనుకుంటారు. సినిమాల్లో తమకంటూ మంచి కెరీర్ క్రియేట్ చేసుకోవచ్చని మరి కొందరు థింక్ చేస్తుంటారు. అలా థింక్ చేసే.. బిగ్ బాస్‌లోకి వచ్చేందుకు తెగ ఆరాటపడుతుంటారు. పోటీ పడుతుంటారు. అయితే ఈక్రమంలోనే బయటికి వచ్చిన కొందరు కంటెస్టెంట్స్‌ కెరీర్లో దూసుకుపోతుండగా.. కొందరు మాత్రం ఉన్న కెరీర్‌ను పాడుచేసుకున్నారనే కామెంట్ ఉంది.

అయితే కెరీర్‌ను పాడుచేసుకున్న కొందర్లో తాను కూడా ఒకరని చెబుతోంది తేజస్వి. ఆర్జీవీ తెరకెక్కించిన ఐస్ క్రీమ్ సినిమాలో సోలో హీరోయిన్ గా నటించిన తేజస్వి.. ఆ తర్వాత సెకెండ్ ఫీమెల్ లీడ్, క్యారెక్టర్ ఆర్టిస్టుగానే ఎక్కువగా కనిపించింది. ఈ క్రమంలోనే బిగ్ బాస్ తెలుగు సీజన్ 2 లో పాల్గొంది.తన ఆటతో ప్రేక్షకులను అలరించింది. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత తేజస్వి సినిమాల్లో బిజీ అవుతుందని అంతా అనుకున్నారు.. కానీ అలా జరగలేదు. ఆ షో వచ్చిన నెగటివిటీ కారణంగా… ఆమెకు సినిమా ఛాన్సులు దూరమయ్యాయనే కామెంట్ ఉంది. ఇక ప్రస్తుతం కొన్ని షోస్.. చేస్తూ… సోషల్ మీడియాలో వెరీ యాక్టివ్‌గా ఉండే తేజస్వి… రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూకు వెళ్లింది. ఈ క్రమంలోనే బిగ్ బాస్ కూడా షాకింగ్ కామెంట్స్ చేసింది. చాలా మంది బిగ్ బాస్ లోకి వెళ్లాలని ఆరాటపడుతున్నారు.. అక్కడ జరిగేది ఒకటి మనకు చూపించేది మరొకటి. బిగ్ బాస్ చూసిన జనాలు మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుంటారు. మా గురించి పిచ్చుపిచ్చిగా మాట్లాడుకుంటుంటారు.. చాలా మంది నెగిటివ్ కామెంట్స్ చేస్తారు. దాంతో దర్శకనిర్మాతలు మాకు ఛాన్స్ లు ఇవ్వడానికి వెనకడుతారు అంటూ చెప్పుకొచ్చింది. ఈ క్రమంలోనే బిగ్ బాస్ గేమ్ షోకు వెళ్లడం వల్లే తన కెరీర్ నాశనం అయ్యిందంటూ కుండబద్దలు కొట్టినట్టు చెప్పింది. తన కామెంట్స్‌తో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Prabhas: ఇది కూడా లీక్ చేయడం ఏంట్రా.. ఏంటి బతకనివ్వరా ??

Kajal Aggarwal: కాజల్‌కు చావు భయం చూపించిన.. పోకిరీ నెటిజన్స్‌ !!