AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎంతైనా తల్లితల్లే..పిల్లల కోసం చిరుత ఏం చేసిందంటే? వీడియో

ఎంతైనా తల్లితల్లే..పిల్లల కోసం చిరుత ఏం చేసిందంటే? వీడియో

Samatha J
|

Updated on: Sep 10, 2025 | 1:27 PM

Share

సింహం వర్సెస్‌ చిరుత.. రెండూ అడవిలో పెద్ద జంతువులే.. వీటి అలికిడి వినబడితే చాలు.. ఇతర జంతువులు గప్‌చుప్‌. అలాంటిది ఓ ఆడ సింహం.. చిరుత పులి బాహాబాహీకి దిగితే.. ఆ సీన్ ఒక్కసారి ఊహించుకోండి.. సరిగ్గా అదే జరిగింది. అసలు విషయానికివస్తే... తల్లి తన పిల్లలను కాపాడుకోడానికి ప్రాణాలను సైతం లెక్కచేయదు. ఎంతటి ప్రమాదం ఎదురైనా వెనక్కి తగ్గదు. సరిగ్గా ఓ చిరుత కూడా అదే పని చేసింది. తన పిల్లలను కాపాడుకోడానికి ఓ ఆడ సింహంతో హోరాహోరీగా పోరాడింది. తన పిల్లలపై దాడిచేసేందుకు వచ్చిన సింహాన్ని పరుగులు పెట్టించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

నెట్టింట వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. చిరుత పులి ఓ పెద్ద రాయికింద పిల్లలను పెట్టింది. అనంతరం తన కూనలను ఏ జంతువూ తినేయకుండా ఆ రాయి పైన కాపలాగా కూర్చుంది. చిరుత ఊహ నిజమైంది. ఓ సింహం చిరుత పిల్లలపై దాడి చేసేందుకు అక్కడికి వచ్చింది. విషయం గ్రహించిన చిరుత వెంటనే అలర్టయింది. సింహాన్ని రాయిపైకి రాకుండా అడ్డుకుంది. ఈ క్రమంలో రెండిటిమధ్య భీకరమైన ఫైట్‌ జరిగింది. సింహం తన బలాన్నంతా ఉపయోగించినా చిరుతముందు నిలవలేకపోయింది. కాసేపటికి రెండు జంతువులూ చెరోవైపూ పారిపోయాయి. ఈ క్రూర మృగాల మధ్య జరిగిన చిన్నపాటి యుద్ధాన్ని సఫారీకి వెళ్లిన పర్యాటకులు వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. దాంతో అది వైరల్‌ అయింది. ఈ వీడియోను రెండు లక్షలమందికి పైగా వీక్షించగా 7 వేలమందికి పైగా లైక్‌ చేశారు. తమదైన శైలిలో కామెంట్లు చేశారు.

మరిన్ని వీడియోల కోసం :

జాగ్రత్త : కారు సన్‌రూఫ్‌ ఇలా వాడితే శిక్ష తప్పదంట!వీడియో

విశాఖపట్నంలో ఘనంగా మహాసిమెంట్స్‌ వార్షిక సమావేశం వీడియో

ఢిల్లీలో ఒక్కసారిగా కూలిన భవనం వీడియో

తురకపాలెం.. భయపడొద్దు.. నేనొచ్చా.. ఇక్కడే పల్లె నిద్ర చేస్తా వీడియో